pizza
Nikhil interview (Telugu) about Kirrak Party
కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి - నిఖిల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

06 March 2018
Hyderabad

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిఖిల్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'కిరాక్‌ పార్టీ'. శరణ్‌ కొపి శెట్టి దర్శకుడు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ ఇంటర్వ్యూ...

రిలీజ్‌ ఫీవర్‌ స్టార్ట్‌ అయింది...
- 'కిరాక్‌పార్టీ' నా 15వ సినిమా. నా తొలి సినిమా 'హ్యాపీడేస్‌' సినిమా రిజల్ట్‌ కోసం ఎలాగైతే ఎదురుచూశానో.. ఇప్పుడు కూడా అంతే అతృతగా సినిమా రిజల్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. రిలీజ్‌ ఫీవర్‌ స్టార్టయింది. రేపు 30 సినిమానో, 40వ సినిమానో చేసినా నేను ఇలాగే ఉంటాను.

హ్యాపీడేస్‌ రోజలు గుర్తొచ్చాయి...
- ప్రతి సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్‌.. అయితే అందులో మనకు కొన్ని సినిమాలు అలా గుర్తుండిపోతాయంతే. హ్యాపీడేస్‌, యువత, కార్తికేయ సినిమాలు గుర్తుండిపోయాయి. అలాగే ఈ 'కిరాక్‌పార్టీ' కూడా గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను కాలేజ్‌ ఫిలిం చేసి 11 ఏళ్లవుతుంది. కాలేజ్‌ కూడా వెళ్లడం.. అక్కడి వారిని కలవడం అన్ని చూసి నాకు హ్యాపీడేస్‌ రోజులు గుర్తుకు వచ్చాయి. హ్యాపీడేస్‌ తర్వాత ఓ పూర్తిస్థాయి కాలేజ్‌ సినిమా చేయలేదు.

అదే సినిమా పాయింట్‌...
- మనం అమ్మాయిల గురించి ఈజీగా మనకు తోచినట్లు మాట్లాడుతుంటాం. అలా మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి ఎలా బాధపడుతుంది. పరిస్థితులు ఎలా మారుతాయనే ఈ సినిమా. నేను కాలేజ్‌ చదువుకునే రోజుల్లో రెండుసార్లు పెద్ద గొడవలయ్యాయి. అయితే పోలీసులు మమ్మల్ని ఏమీ అనలేదు. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తున్నాయి.

ఫ్రెష్‌ ఫీల్‌ కోసమే...
- నేను, దర్శకుడు శరణ్‌ కోపిశెట్టి, చందు, సుధీర్‌ వర్మ, అనిల్‌, కిషోర్‌ ఇలా అందరం ఇంజనీరింగ్‌ చదివినవాళ్లే. వాళ్లు చదువుకున్న కె.ఎల్‌.యూనివర్సిటీలోనే 'కిరాక్‌పార్టీ'ని చిత్రీకరించాం. - కన్నడ మాతృకలో నటించిన సంయుక్త హెగ్డే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీశ్‌ లోక్‌నాథ్‌ మినహా అందరూ కొత్త వారినే తీసుకున్నాం. అందుకు కారణం ఆడియెన్స్‌కు ఫ్రెష్‌ ఫీల్‌ కలగాలనే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు కన్నడంలో చేసిన రష్మికనే తీసుకుందామనుకున్నాం. అప్పటికే తను రెండు, మూడు సినిమాలు కమిట్‌ కావడంతో, తన స్థానంలో సిమ్రాన్‌ పరింజను హీరోయిన్‌గా తీసుకున్నాం.

interview gallery



దాన్ని మిస్‌ చేయలేదు...
- కన్నడలో మూడు గంటల సినిమాను తెలుగులో ట్రిమ్‌ చేసి రెండు గంటల 25 నిమిషాలు చేశాం. రీమేక్‌ సినిమా అయినా అందులోని ఆత్మను మిస్‌ కాకుండా చూసుకున్నాం. కన్నడ సినిమాను రీమేక్‌ చేయాలనే ఆలోచన అనిల్‌ సుంకరగారిది. ఆయన నన్ను కలిసిన 10 నిమిషాలకే సినిమా చేయడానికి ఓకే చెప్పాను.

అన్ని రూమర్సే...
- అనిల్‌ సుంకరగారు చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఆయన రెండు సార్లు మాత్రమే లొకేషన్‌కు వచ్చారు. ఆయన ఏదో సన్నివేశాన్ని డైరెక్ట్‌ చేశారని.. ఇన్‌వాల్వ్‌ అవుతారని వచ్చే వార్తలన్నీ రూమర్సే. ఫైనల్‌గా సినిమా చూసిన అనిల్‌గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

డైరెక్టర్‌ గురించి...
- శరణ్‌కి డైరెక్టర్‌ చందు మొండేటి, సుధీర్‌ వర్మ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. శరణ్‌కు ధైర్యాన్ని ఇవ్వడానికే చందు, సుధీర్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సినిమా ప్రారంభం కావడానికి ముందు చాలా వర్క్‌ చేశారు. చందు దాదాపు నెలన్నర పాటు స్క్రిప్ట్‌పైన కూర్చున్నాడు. శరణ్‌ చాలా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. అంతా ఓకే అనుకున్న తర్వాత అనిల్‌గారు సెట్స్‌కు వెళ్లారు.

తదుపరి చిత్రం గురించి...
- 'కణిదన్‌' రీమేక్‌ కాదు. అందులో ఫేక్‌ సర్టిఫికేట్స్‌ అనే పాయింట్‌ను మాత్రమే తీసుకుని కొత్త కథను తయారు చేశారు. ఇందులో జర్నలిస్ట్‌ పాత్రలో కనపడతాను. ఈ సినిమా తర్వాత చందు మొండేటితో కార్తికేయ సీక్వెల్‌ చేస్తాను. ఎక్కడ ఆగిపోతుందో అక్కడే కార్తికేయ సీక్వెల్‌ స్టార్ట్‌ అవుతుంది. దీంతో పాటు ఠాగూర్‌ మధు సినిమా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved