pizza
Nikki Galrani interview about Krishnashtami
మా అక్క నాకు అమ్మ‌లాంటిది - నిక్కి గ‌ల్రాని
You are at idlebrain.com > news today >
Follow Us

16 February 2016
Hyderaba
d

సంజ‌న చెల్లెలిగా సినిమా రంగంలోకి ప్ర‌వేశించింది నిక్కి గ‌ల్రాని. ఈ భామ చేసింది కొద్ది సినిమాలే అయినా మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులో సునీల్ ప‌క్క‌న న‌టించిన కృష్ణాష్ట‌మి ఈ నెల 19న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నిక్కి గ‌ల్రాని మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో ముచ్చ‌టించింది. ఆ వివ‌రాలు..

* మీ గురించి చెప్పండి?
- డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యానంటారు కదా.. అలాంటి బాప‌తు నేను. నేను డాక్ట‌ర్ అయితే చూడాల‌ని ఇంట్లో వాళ్ళు క‌ల‌లు క‌న్నారు. అయితే నేను మాత్రం సైన్స్ చ‌దువుల‌ను మ‌ధ్య‌లో వ‌దిలేసి ఫ్యాష‌న్ డిజైనింగ్ చేశా. కాలేజీ చ‌దువుతున్న‌ప్పుడే సిల్వ‌ర్ స్క్రీన్ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ న‌నే ఒప్పుకోలేదు. కోర్సు కంప్లీట్ చేసి మోడ‌లింగ్ చేయ‌డం మొద‌లుపెట్టా. మీరు న‌మ్ముతారా 10 నెల‌ల్లో 45 యాడ్స్ చేశా. 1983 అనే మ‌ల‌యాళ సినిమా నా తొలి సినిమా. ఈ రెండున్న‌రేళ్ళ‌లో దాదాపు 15 సినిమాల్లో న‌టించా. తెలుగులో కృష్ణాష్ట‌మి తొలి సినిమా.

* కృష్ణాష్ట‌మి ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది?
- నేను మ‌ల‌యాళంలో షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. కేర‌ళ‌లో ఒక సినిమా చేస్తున్న‌ప్పుడు ఇంకో సినిమా చేయ‌కూడ‌ద‌నే రూల్ ఉంది. సో ఈ ఆఫ‌ర్ మిస్ అయింద‌నే అనుకున్నా. ఆ విష‌యాన్నే వీళ్ళ‌కు చెప్తే దిల్‌రాజుగారు ఫోన్ చేసి షూటింగ్ నెల త‌ర్వాతేన‌ని అన్నారు. సో అప్ప‌టికి ఆ సినిమా పూర్తి కావ‌డంతో ఈ సినిమా చేయ‌గ‌లిగా.

* మీ కేర‌క్ట‌ర్ గురించి చెప్పండి?
- ఇందులో ప‌ల్ల‌వి అనే పాత్ర చేశా. మంచి రైట‌ర్ పాత్ర‌. ప‌ల్ల‌విజం అనే బుక్ రాసే కేర‌క్ట‌ర్‌. క్యూట్‌గా, ఇన్నొసెంట్‌గా, బ‌బ్లీగా ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఉంద‌నుకునే వ్య‌క్తి త‌ను. ప్ర‌తి విష‌యాన్ని పాజిటివ్‌గా తీసుకుంటుంది.

* కృష్ణాష్ట‌మి అనే పేరు ఎందుకు పెట్టారు?
- హీరో పేరు కృష్ణ వ‌ర‌ప్ర‌సాద్‌. త‌ను కృష్ణాష్ట‌మి రోజే పుడ‌తాడు. అత‌నికి జీవితంలో ఎదురైన స‌మ‌స్య‌లు కూడా అదే రోజు ఎదుర‌వుతాయి. వాటిని అదేరోజే ప‌రిష్క‌రించుకుంటాడు. అన్ని విధాలా క‌రెక్ట్ కాబ‌ట్టి ఆ పేరును పెట్టారు.

* సునీల్ గురించి చెప్పండి?
- సునీల్‌గారు చాలా హంబుల్‌. స్వీట్ ప‌ర్స‌న్‌. ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నా. వ‌ర్క్ ప‌ట్ల డెడికేష‌న్ ఉన్న మ‌నిషి. ఫారిన్‌లో ఉన్న‌ప్పుడు రెండు డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో ఉద‌యాన్నే నాలుగింటికి లేచి జాగింగ్ వెళ్లొచ్చేవారు.

* ఎలాంటి పాత్ర‌ల‌ను చేయాల‌ని ఉంది?
- టిపిక‌ల్ హీరోయిన్‌గా కొన్ని సీన్లు, కొన్ని పాట‌లు మాత్రం చేయ‌డం న‌చ్చ‌దు. నా పాత్ర‌కు వెయిట్ ఉండాలి. పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ను చేయాల‌ని ఉంటుంది. గ్లామ‌ర్ డాల్ అనే పేరు ఇష్టం ఉండ‌దు. అందుకే పాత్ర‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా ఉంటా.

Nikki Galrani interview gallery* డైర‌క్ట‌ర్ గురించి చెప్పండి?
- వాసువ‌ర్మ‌గారు చాలా పేష‌న్స్ ఉన్న మ‌నిషి. నాకే ఓపిక ఎక్కువ‌నుకుంటే ఆయ‌నకు ఇంకా ఎక్కువ‌. ఎలాంటి ప‌రిస్థితినైనా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. ఎన‌భై శాతం షూటింగ్‌లో ఫారిన్‌లోనే చేశాం. 20 శాతం ఇక్క‌డ చేశాం.

* సౌత్ భాష‌ల‌న్నిటిలో చేశారు. తెలుగులో చేయ‌డం ఎలా అనిపించింది?
- మిగిలిన భాష‌ల‌తో పోలిస్తే ఇక్క‌డ క‌మ‌ర్షియాలిటీ ఎక్కువ‌. మ‌ల‌యాళ సినిమాలు జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. త‌మిళంలో రియాలిటీ ప్ల‌స్ క‌మర్షియాలిటీ ఉంటుంది. తెలుగులో క‌మ‌ర్షియాలిటీ ఎక్కువ‌.

* గ్లామ‌ర్ గురించి మీరేమంటారు?
- నా సినిమాల‌ను అంద‌రూ స‌కుటుంబంగా చూడాలి. నా దృష్టిలో గ్లామ‌ర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిని చీర‌లో కూడా గ్లామ‌ర్‌గా చూపించొచ్చు. ఈ సినిమాలో నేను స్క‌ర్ట్స్, జీన్స్ వేసుకుంటా. క్యూట్‌గా క‌నిపిస్తా. అంతేగానీ వ‌ల్గారిటీ ఉండ‌దు.

* మీ సోద‌రి సంజ‌న గురించి చెప్పండి?
- త‌ను అక్కే అయినా నాకు అమ్మ‌లాంటిది. నా ప్ర‌తి ఎదుగుద‌ల‌ను చూసి త‌ను సంతోష‌ప‌డుతుంది. నా డౌట్స్ క్లియ‌ర్ చేస్తుంది. నా క‌థ‌ల్ని మాత్రం ముందు నేనే వింటా. త‌ర్వాతే ఫ్యామిలీతో డిస్క‌స్ చేస్తా.

* మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి?
- త‌మిళంలో మూడు సినిమాలున్నాయి. తెలుగులో మంచి ఆఫ‌ర్లున్నాయి. ఇంకా సైన్ చేయ‌లేదు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved