pizza
Nikki Galrani interview (Telugu) about Marakatamani
న‌న్ను అక్క‌డ డార్లింగ్ నిక్కి అని అంటారు - నిక్కి గ‌ల్రాని
You are at idlebrain.com > news today >
Follow Us

13 June 2017
Hyderabad

`మ‌ర‌క‌త‌మ‌ణి` సినిమా ఈ నెల 16న విడుద‌ల కానుంది. ఇందులో ఆది పినిశెట్టి హీరో. నిక్కి గ‌ల్రాని నాయిక‌. ఈ సినిమా గురించి నిక్కి గ‌ల్రాని మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మాట్లాడారు.

*మ‌ర‌క‌త‌మ‌ణి గురించి చెప్పండి?
- అడ్వెంచ‌ర‌స్‌, ఫ్యామిలీ, కామెడీ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. చాలా డిఫ‌రెంట్ జోనర్ల కాంబినేష‌న్‌లాగా ఉంటుంది. ట్రైల‌ర్‌లో చూసిన‌ట్టు ఉంటుంది. హీరోగారు త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేస్తుంటారు.ఆ క్ర‌మంలో ర‌క‌ర‌కాల రాళ్ల‌ను విక్ర‌యిస్తుంటారు. ఆ నేప‌థ్యంలోనే మ‌ర‌క‌త‌మ‌ణి దొరుకుతుంది. ఆ త‌ర్వాత అంద‌రి లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా చేంజ్ అవుతుంద‌న్న‌దే సినిమా.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- నా పాత్ర పెద్ద స‌ర్‌ప్రైజ్‌. అది నేను అస‌లు చెప్ప‌లేను.

* మీ ద్వారా దొరుకుతుందా?
- మా ఐదుగురు ద్వారా దొరుకుతుంది. మా గ్రూప్‌కి దొరుకుతుంది.

* హీరో, హీరోయిన్ల‌కి ల‌వ్ ఉండ‌దా?
- డిఫ‌రెంట్ జోన‌ర్ స్టోరీ ఇది. ల‌వ్ ఉండ‌దు. ఇప్ప‌టిదాకా నేను ఇలాంటి పాత్ర‌ను చేయ‌లేదు. ఇప్ప‌టికే నావి పాతిక సినిమాలు పూర్త‌య్యాయి. మూడేళ్ల‌లోనే పాతిక సినిమాలు చేశాను. ఇలాంటి పాత్ర‌ను రీసెంట్ టైమ్స్ లో ఏ హీరోయిన్ కూడా చూడ‌లేదు.

interview gallery

* అంత‌గా ఏమి న‌చ్చింది?
- అది సినిమాలో చూడాలి. నా ప్ర‌తి సినిమాలోనూ ప్ర‌తి పాత్రా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాను. అలాంటి సినిమానే ఇది.మామూలుగా హీరోయిన్ అన‌గానే అందంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ నా డెబ్యూ సినిమాలో నేను దెయ్యంలాగా క‌నిపిస్తాను. దీన్ని బ‌ట్టి నేనెంత డిఫ‌రెంట్‌గా ఉండాల‌నుకుంటానో మీకు అర్థ‌మై ఉంటుంది. నా తొలి సినిమా నుంచి ఇప్ప‌టిదాకా త‌మిళ‌నాడులో డార్లింగ్ నిక్కీ అనే పిలుస్తారు.

ఈ సినిమాలోని పాత్ర కూడా నాకు న‌చ్చింద‌ని చేశాను.

* హార‌ర్ ఎలిమెంట్స్ ఉంటాయా?
- కామెడీ హార‌ర్ ఉంటుంది.

* ఇందులో కూడా దెయ్య‌మేనా?
- అది సినిమా చూడండి. త‌ర్వాత తెలుస్తుంది.

* ఇందులో మీ పాత్ర పేరు ఏంటి?
- అది కూడా స‌ర్‌ప్రైజ్‌. త‌మిళ్‌లో మ‌హీ అని పెట్టారు. తెలుగులో ఏం పెట్టారో తెలియ‌దు.

* డ‌బ్బింగ్ మీరు చెప్పుకోలేదా?
- లేదండీ. నేను చెప్పుకోలేదు.

* మీరు న‌మ్ముతారా జాత‌కాల‌ను?
- నేను న‌మ్మ‌ను మా అమ్మ న‌మ్ముతారు. నాకు డైమండ్స్ ఇష్టం.

* స్ట్రెయిట్ సినిమాలు ఎప్పుడు చేస్తున్నారు?
- త్వ‌ర‌లో చేస్తాను.నా డేట్స్ త‌మిళ్‌, మ‌ల‌యాళంలో చాలా ప్యాక్డ్ గా ఉన్నాయి. త్వ‌ర‌లోనే అక్క‌డ కాస్త గ్యాప్ తీసుకుని ఇక్క‌డికి వ‌స్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved