pizza
Nitin interview about A..Aa
‘అఆ’ సినిమా క్రెడిట్ అంతా త్రివిక్రమ్ గారికే చెందుతుంది..ఆయనే ఈ సినిమా రియల్ హీరో - నితిన్ 
You are at idlebrain.com > news today >
Follow Us

27 May 2016
Hyderaba
d

శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్సమంతఅనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అఆఅనసూయ రామలింగం’ వర్సెస్ ఆనంద్ విహారిఅన్నది ఉప శీర్షిక. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో నితిన్ తో ఇంటర్వ్యూ...

అఆ ఎలాంటి స్టోరీ...క్యారెక్టర్ గురించి...
మంచి ఫ్యామిలీ వాల్యూస్, సెంటిమెంట్, లవ్ స్టోరీలో మంచి  ఫ్యామిలీ స్టోరీని దర్శకుడు త్రివిక్రమ్ గారు చక్కగా మిళితం చేసి తెరకెక్కించారు. కొత్త సినిమా, కొత్త కథ అని చెప్పను కానీ మంచి ఆత్మ ఉన్న సినిమా. ఇందులో వంటవాడి పాత్ర. చాలా కామెడి షేడ్స్ ఉంటాయి.

అదే తేడా...
ఇంతకు ముందు చాలా ప్రేమకథలున్న సినిమాల్లో నటించాను. కానీ వాటన్నింటిలో నేను ఆకతాయిగా కనపడతాను. కానీ ఇందులో ఓ బాధ్యత గల కొడుకుగా కనపడతాను. ఈ సినిమాలో నాకొక సమస్య ఉంటుంది.  ఆ సమస్య ఉన్నప్పటికీ అందరినీ నవ్విస్తూ ఉంటాను. నేను చేసిన ఇన్ని పాత్రలో ఇది నాకు బాగా నచ్చిన పాత్ర. త్రివిక్రమ్ గారి సలహాలతో బ్యాలెన్స్ డ్ గా చేయగలిగాను.

సినిమా రూపొందిన విధానం...
నేను గుండెజారి గల్లంతయ్యిందే చిత్రీకరణలో ఉండగా స్పెయిన్ వెళ్లాను. త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి లైన్ చెప్పారు. సినిమా చేద్దామన్నారు. నేను కూడా హ్యపీగా ఫీలయ్యాను. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేకపోయాను. ఆ కారణంగా మనసులో బాధపడ్డాను. గత సంవత్సరంలో నేను చేయాల్సిన సినిమా ఒకటి క్యాన్సిల్ అయిపోవడం, ఆరు నెలలు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు మళ్లీ ఫోన్ చేసి సినిమా చేద్దామన్నారు. మంచి డైరెక్టర్ తో, మంచి సమయంలో మంచి సినిమా పడింది. ఈ సినిమాలో నా యాక్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది.

ఆయనతో చేయడం డ్రీమ్.....
త్రివిక్రమ్ గారు అనగానే అందరికీ చిన్నపాటి ఎగ్జయిట్ మెంట్ ఉంటుంది. ఆయనతో సినిమా చేయడం కూడా నాకొక డ్రీమ్ గా ఉండేది. అలాగే ఆయన చెప్పిన కథ కూడా బాగా నచ్చింది.

Nitin interview gallery

కంప్లీట్ మూవీ....
ఇంతకు ముందు చెప్పినట్టు లవ్ స్టోరీలో మిళితమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇందులో నాది, సమంత సహా ప్రతి క్యారెక్టర్ కు ఓ ముఖ్యత్వం కనపడుతుంది. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది.

చాలా విషయాలు నేర్చుకున్నాను....
త్రివిక్రమ్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా గత చిత్రాలతో పోల్చి చూస్తే ఇందులో నా నటన వేరుగా ఉంటుంది. ఈ సినిమాకు ముందు వర్క్ షాప్ నిర్వహించాం. అలాగే నేను, త్రివిక్రమ్ గారు సీన్స్ ను డిస్కస్ చేసుకునేవాళ్లం. వందశాతం ఇది డైరెక్టర్ మూవీ, ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనదే, ఆయనే ఈ సినిమాకు రియల్ హీరో. సినిమా అనే చాలా విషయాలకు సంబంధించి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. ఈ సినిమాతో మా మధ్య మంచి ర్యాపో ఏర్పడింది.

మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చడానికి కారణమదే...
అనిరుధ్ ను ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నాం. కానీ అతను చాలా  బిజీగా ఉన్నాడు. మాకేమో షూటింగ్ అయిపోతుంది. దాంతో ఇక మేం మిక్కిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాం. మిక్కి కూడా చాలా తక్కువ టైంలో మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

ఆ విషయంలో నేను లక్కీ...
నేను ఇండస్ట్రీలోకి రాజమౌళి, త్రివిక్రమ్ గారు, వినాయక్ గారు ఇలా అందరితో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఆ విషయంలో నేను లక్కీగా భావిస్తాను. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్టయిల్. అయితే త్రివిక్రమ్ గారు నా సినిమాలన్నీ చూసి నటన పరంగా నాలోని లోపాలేంటి కనుగొని వాటిని కవర్ చేస్తూ ఈ సినిమా చేస్తాను. నా కెరీర్ లో నేను వర్క్ చేసిన దర్శకుల్లో నా తొలి చిత్రం దర్శకులు తేజగారు తర్వాత రాజమౌళిగారు వీరి తర్వాత త్రివిక్రమ్ గారితో చేయడం బెస్ట్ గా ఫీలవుతున్నాను.

ఈ జర్నీలో తెలుసుకున్న విషయాలు..
నేను 2000లో కెరీర్ స్టార్ట్ చేశాను, 2011 వరకు చాలా ప్లాప్స్ ఎదురుచూశాను. అయితే వీటి నుండి ఏం చేయవచ్చు, ఏం చేయకూడదనే విషయాలు నేర్చుకున్నాను. చాలా విమర్శలు వచ్చినా, నేను వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. ప్రతి సినిమా నుండి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాను.

చాలా డిసప్పాయింట్ అయ్యాను...
నిర్మాతగా అఖిల్ సినిమా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమా రిలీజైన నాలుగైదు నెలలు వరకు సరిగా నిద్ర కూడా పోలేదు. సినిమా ప్లాప్ కావడం, డబ్బులు పోవడం అనే విషయాలు పక్కన పెడితే అఖిల్ మొదటి సినిమా ఏంటి ఇలా అయ్యిదనే విషయంపై నేను, నాన్నగారు చాలా బాధపడ్డాం. ఈ సినిమా కోసం అందరూ హార్డ్ వర్క్ చేశాం. కానీ ఫలితం నిరాశ పరిచింది.

సీక్వెల్ అనుకుంటున్నాం...
గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకు సీక్వెల్ అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఫస్టాఫ్ స్క్రిప్ట్ పూర్తయ్యింది. సెకండాఫ్ స్క్రిప్ట్ పూర్తై బాగా నచ్చితేనే చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఫార్ట్ పెద్ద హిట్ అయ్యింది కాబట్టి చేయబోయే సీక్వెల్ కూడా హిట్ కావాలనుకుంటాను. స్క్రిప్ట్ బాగా వస్తే చేస్తా..లేకుంటే లేదు.

పెళ్లి గురించి...
అమ్మ నాన్నలేమో పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు కానీ నేనే వచ్చే ఏడాది చేసుకుంటానంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను.

తదుపరి చిత్రం...
ఇప్పటి వరకు ఇంకా ఏదీ అనుకోలేదు, వారంరోజుల్లో నా తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకుంటాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved