pizza
Nivetha Thomas  interview about Gentleman
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు  - నివేద థామస్

You are at idlebrain.com > news today >
Follow Us

18 June 2016
Hyderaba
d

మ‌ల‌యాళ చిత్రాల‌తో సినీ రంగ ప్రేశం చేసి చెన్నైలో స్థిర‌ప‌డి తెలుగు కూడా చ‌క్క‌గా మాట్లాడుతున్న ముద్దుగుమ్మ నివేద థామ‌స్‌. మ‌ల‌యాళంత‌మిళ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన ఈ హీరోయిన్ ఇప్పుడు నానిఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్‌లో విడుద‌లైన జెంటిల్‌మ‌న్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మెప్పించింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రంలో నివేద న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో హీరోయిన్ నివేద థామ‌స్ మాట్లాడుతూ....

ఫ‌స్ట్ కాంప్లిమెంట్ ఆయ‌న‌దే...
ఈ సినిమా విష‌యంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌గారు నాకు ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా బాగా చేశావ‌ని మెచ్చుకున్నారు.

అవ‌కాశం ఎలా వ‌చ్చిందంటే...
కో డైరెక్ట‌ర్ సురేష్‌గారు నేను యాక్ట్‌చేసిన ఓ మ‌ల‌యాళీ మూవీ చూశార‌ట‌. అలాగే నేను యాక్ట్ చేసిన త‌మిళ చిత్రం పాప‌నాశం కూడా చూశారు. కొన్ని ఇంట‌ర్వ్యూస్ గ‌మ‌నించారు. అంతా ఓకే అనిపించిన త‌ర్వాత ఈ సినిమాలో న‌న్ను హీరోయిన్‌గా స‌జెస్ట్ చేశారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌గారికి కూడా న‌చ్చ‌డంతో హీరోయిన్‌గా సెల‌క్ట్ అయ్యాను.

క‌థ విన‌గానే..
మోహ‌న్ సార్ క‌థ చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చేసింది. వినేట‌ప్పుడు ఎలాగైనా ఈ సినిమా చేయాల‌ని నేను అనుకున్నాను. అలాగే క‌థ చెబుతున్న మోహ‌న్‌సార్ కూడా ఈ అమ్మాయి చేస్తే బావుంటుంద‌ని అనుకున్నారు. నా యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డం చాలా హ్యాపీగా ఉంది. మోహ‌న్ సార్‌నానిగారు ఉంటే చాలు సినిమా బాగా వ‌చ్చేస్తుంద‌ని గాఢంగా నమ్మాను. సినిమా చూసిన‌ప్పుడు ఆయ‌నేం చెప్పారో దానికంటే బాగా తీశార‌నిపించింది.

ఎడ్యుకేష‌న్‌...
నేను మ‌ల‌యాళీ అమ్మాయిని కానీ చెన్నైలో ఫ్యామిలీతో స‌హా సెటిల్ అయ్యాం. ఇప్పుడు అర్కిటెక్ విభాగంలో ఇంనీరింగ్ నాలుగో సంవత్స‌రం చ‌దువుతున్నాను.

Glam gallery from the event

నాని న‌ట‌న గురించి...
నాని నా ఫేవ‌రేట్ న‌టుడు. క‌మ‌ల్ హాస‌న్‌గారి తర్వాత నానియే నాకు ఇష్ట‌మైన యాక్ట‌ర్‌. నానికి నేను సూప‌ర్ ఫ్యాన్‌ని. త‌నొక స్పాంటేనియ‌స్ ఉన్న న‌టుడునేచుర‌ల్ స్టార్. నాని యాక్ట్ చేసిన సినిమాలన్నీ చూశాను.

డ‌బ్బింగ్ చెప్పాల‌నుకున్నా...
- ఈ సినిమా స‌మ‌యంలోనే నేను తెలుగు నేర్చుకున్నాను. అలాగే ఈ సినిమాకు డ‌బ్బింగ్ కూడా చెప్పాల‌నుకున్నాను కానీ కొన్ని కార‌ణాలతో వీలుప‌డ‌లేదు.

గ్లామ‌ర్ అంటే స్కిన్ షో కాదు...
- గ్లామ‌ర్ అంటే స్కిన్ షో కాదుఅందువ‌ల్ల సినిమాలు హిట్ అవుతాయంటే నేను న‌మ్మ‌ను. క‌థ వింటాను. న‌చ్చితే హీరోడైరెక్ట‌ర్ ఎవ‌ర‌ని ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటాను. క‌థ‌ల ఎంపిక విష‌యంలో కూడా నాదే తుది నిర్ణయం అవుతుంది. త‌ర్వాత వ‌చ్చే గెలుపు ఓట‌ముల‌కు కూడా నేనే బాధ్య‌త‌ను తీసుకుంటాను. అయితే ఓట‌మి నుండి నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.

మంచి ఫ్రెండ్ ...
- ఈ సినిమాలో న‌టించిన సుర‌భితో బాగా క‌లిసిపోయాను. మా మ‌ద్య ఏ గొడ‌వ‌లు లేవు. సినిమా అయిపోయిన త‌ర్వాత త‌న‌ను బాగా మిస్ అవుతున్నాను. త‌ను ఢిల్లీలో ఉంటుంది. నేను చెన్నైలో ఉంటాను. అయితే త‌న‌తో ట‌చ్‌లోనే ఉంటాను. అలాగే ఇక్క‌డ న‌రేష్ త‌మిళ్‌లోపోరాలి అనే త‌మిళ్ మూవీలో యాక్ట్ చేసిన‌ప్పుడు త‌న‌తో మంచి స్నేహం ఏర్ప‌డింది. ఇప్ప‌టికీ కూడా త‌న‌తో ట‌చ్‌లోనే ఉంటాను. ఈ సినిమా ముందు కూడా నానికి త‌ను నాగురించి బాగా చెప్పాడ‌ట‌.

త‌దుప‌రి చిత్రాలు...
- తెలుగుత‌మిళంమ‌ల‌యాళం ఎక్క‌డా ఏ సినిమాలు ఒప్పుకోలేదు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved