pizza
Noorin Shereef interview (Telugu) about Lovers Day
అల్లు అర్జున్ లాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌నుకున్నా - నూరిన్
You are at idlebrain.com > news today >
Follow Us

27 February 2019
Hyderabad

`ల‌వ‌ర్స్ డే` సినిమా చూసిన వారికి నూరిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉంగ‌రాల జుట్టుతో స‌ర‌దా స‌ర‌దాగా ఉంటూ, ఆఖ‌రున ఉన్న‌ట్టుండి అంద‌రినీ భావోద్వేగానికి గురి చేసిన అమ్మాయి. సుఖీభ‌వా సినిమాస్ ప‌తాకంపై గురురాజ్ తెలుగులో నిర్మించారు. సి.హెచ్‌.వినోద్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఒమ‌ర్ లులు నిర్మాత‌. ఈ సినిమా గురించి నూరిన్ హైద‌రాబాద్‌లో బుధ‌వారం మాట్లాడారు. ఆ విశేషాలు

* `ల‌వ‌ర్స్ డే`లో మీ పాత్ర గురించి చెప్పండి?
- నేను చేసిన గాథ పాత్ర‌ని ప్రేక్ష‌కులు ఇంత‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ని అనుకోలేదు. చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. త‌మ స్కూల్ ఫ్రెండ్స్ లో ఒక‌రిని క‌లిసిన భావ‌నే క‌లుగుతోంద‌ని చాలా మంది చెప్పారు.

* క‌న్ను కొట్టిన సీన్ పాపుల‌ర్ అయ్యాక క‌థ‌లో చాలా మార్పులు జ‌రిగాయ‌ట‌..?
- ఇందులో మొద‌టి నుంచీ నాకు ఇంపార్టెంట్ రోల్ అనే చెప్పారు. మీర‌న్న‌ట్టు క‌థ‌ని కూడా కాస్త చేంజ్ చేశారు.

* ముందు అనుకున్న‌ట్టే ఉండి ఉంటే మీ పాత్ర‌కు ఇంకా మంచి స్పంద‌న వ‌చ్చేదా?
- అలాంటిదేమీ లేదండీ. అయినా ఇప్పుడు కూడా నా పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. చూసిన‌వారంద‌రూ బావుంద‌ని మెచ్చుకున్నారు.

* క‌థ‌లో మార్పులు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది?
- క‌న్ను కొట్ట‌డం, గ‌న్ను పేల్చ‌డం, మాణిక్య మ‌ల‌రాయ్ పాట విడుద‌ల కావ‌డం.. వాటన్నిటికీ చాలా మంచి స్పంద‌న రావ‌డం వ‌ల్ల క‌థ‌లో మార్పులు చేశారు.

* మీరు బాగా అప్‌సెట్ అయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి?
- నేను అప్‌సెట్ అయ్యాన‌న్న‌ది ప‌ట్టించుకోవాల్సిన విష‌యం కాదు. అయినా మ‌నంద‌రం మ‌నుషులం. కోప‌తాపాలు క‌చ్చితంగా ఉంటాయి.

* ప్రియా వారియ‌ర్‌తో మీరెలా ఉంటారు?
- ప్రియ‌ను నేను తొలిసారి సెట్స్ మీదే క‌లిశాను. మా మ‌ధ్య కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. మా మ‌ధ్య గొడ‌వ‌లు ఏమీ లేవు.

interview gallery* ఒరు అడార్ ల‌వ్‌కి మ‌ల‌యాళంలో ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?
- మ‌ల‌యాళంలో మొద‌ట మిక్స్డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పెద్ద‌వారికి, యువ‌త‌కు న‌చ్చింది. అయితే క్లైమాక్స్ మార్చాక ఇంకా చాలా మందికి న‌చ్చింది. నాకు మొద‌టిదీ బావుంది. ఈ వెర్ష‌న్ కూడా బావుంది. థియేట‌ర్ లో సినిమా చూస్తున్నంత సేపు మేం ప‌డ్డ క‌ష్టం, షూటింగ్ చేసిన రోజులు గుర్తుకురాసాగాయి.

* మీ ఆడియో వేడుక‌కు బ‌న్నీ రావ‌డం గురించి?
- నా చిన్న‌త‌నంలో నేను `బ‌న్నీ`, `హ్యాపీ` వంటి సినిమాల‌ను టీవీలో చూస్తూ పెరిగాను. అల్లు అర్జున్‌లాంటి వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌నుకున్నాను. అలాంటిది నేను న‌టించిన సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఆడియో వేడుక‌కు ఆయ‌న రావ‌డం, వేడుక ఆఖ‌రున ఆయ‌న నా చేతిని ప‌ట్టుకోవ‌డం జీవితంలో మ‌ర్చిపోలేను. ఆ క్ష‌ణంలో ఎవ‌రో ఫొటోలు కూడా తీశారు. ఆ ఫొటో తీసిన వ్య‌క్తి కోసం ఇప్ప‌టికీ వెతుకుతూనే ఉన్నా. నాకు ఆ ఫొటో కావాలి.

* సెట్స్ మీద స‌ర‌దా స‌ర‌దాగా క‌నిపించారు. నిజ జీవితంలోనూ అలాగే ఉంటారా?
- నేను ఎవ‌రితోనూ అంత తేలిగ్గా క‌ల‌వ‌ను. ఒక వేళ క‌లిస్తే `ద‌య‌చేసి కాసేపు ఊరుకుంటావా` అని అవ‌త‌లివాళ్లు అడిగేలాగా ప్ర‌వ‌ర్తిస్తా. ద‌గ్గ‌రివారి ద‌గ్గ‌ర మాత్ర‌మే స‌ర‌దాగా మాట్లాడ‌గ‌ల‌ను.

* నెక్స్ట్ చేస్తున్న సినిమాలేంటి?
- ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఇదే ద‌ర్శ‌కుడితో ఓ సినిమా ఉంది. తెలుగులో కొన్ని క‌థ‌లు వింటున్నా.

* ఆఖ‌రిగా మీ నిర్మాత గురించి చెప్పండి?
- ఆయన‌క‌న్నా ఆయ‌న కుటుంబం న‌న్ను ఇంకా బాగా చూసుకుంటున్నారు. చాలా మంచి నిర్మాత‌.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved