pizza
NTR interview about Janatha Garage
స్టార్ హీరోగా కంటే ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తుండిపోవాలనుకుంటాను. - ఎన్టీఆర్
You are at idlebrain.com > news today >
Follow Us

31 August 2016
Hyderaba

`టెంపర్‌``నాన్నకు ప్రేమతో..` వరుస సక్సెస్‌ల తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌యలమంచిలి రవిశంకర్‌సి.వి.మోహన్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'జనతాగ్యారేజ్‌సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో ఇంటర్వ్యూ....

జయాపజయాల నుండి త్వరగా బయటకు వచ్చేస్తాను.....
టెన్షన్‌ ఎందుకుండకూడదు. ఓ సినిమాకు ఆరేడు నెలలు పనిచేసిన తర్వాత ఆ మాత్రం టెన్షన్‌ ఉంటుంది. రిజల్ట్‌ పక్కన పెట్టేస్తే బావుండాలని కోరుకుంటాను. అలాగని సినిమా సినిమా సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ ను పట్టించుకోనని చెప్పను కానీ..సినిమా రిలీజ్‌ తర్వాత వీలైనంత త్వరగా బయటకు వచ్చేస్తున్నాను. నెక్ట్స్‌ సినిమా గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను.

అప్పుడే `జనతాగ్యారేజ్` కథ విన్నా...
రభస టైంలోనే జనతాగ్యారేజ్‌ కథను విన్నాను. టెంపర్‌నాన్నకు ప్రేమతో సినిమాల కంటే ముందుగానే విన్నాను. మనం విన్న మంచి విషయాలెప్పుడు మన మైండ్‌లో సబ్‌ కాన్‌షియస్‌గా రన్‌ అవుతుంటాయి. బహుశా ఆ కథలోని పొటెన్షియల్‌ ఉందేమో కాబట్టి ఈ సినిమా కథ వైపు ప్రయాణించాణేమో అనిపిస్తుంది.

టైటిల్ గురించి...
కథే ఈ సినిమాలో లీడ్‌ హీరో. నేను కానీమోహన్‌లాల్‌గారు కానీ కథను డామినేట్‌ చేయలేని విధంగా స్క్రిప్ట్‌ ను డిజైన్‌ చేశారు. ట్రైలర్‌ చూస్తే కథ జనతాగ్యారేజ్‌ ఫార్ములాలో జరుగుతుందని తెలుస్తుంది. ఇలాంటి కథలు అరుదుగా దొరుకుతాయి.

మోహన్‌లాల్‌గారిని నటింప చేయాలనే ఆలోచన...
కథ వినేటప్పుడు హీరోకు సమానమైన పవర్‌ఫుల్‌ రోల్‌ ఉంది. ఎవరు చేస్తారనుకున్నా. అప్పుడు శివగారు మోహన్‌లాల్‌గారి పేరు చెప్పారు. తర్వాత టైటిల్‌ కూడా శివగారే జనతాగ్యారేజ్‌ పెడదాం అన్నారు. కథ డిమాండ్‌ మేరకే ఈ టైటిల్‌ యాప్ట్‌ అవుతుందనిపించింది. నేను కూడా ఓకే చెప్పాను.

అద్భుతమైన నటుడు....
మోహన్‌లాల్‌ వంటి నటుడితో నటించడం నేను ఎప్పటికీ మరచిపోలేను. సంపూర్ణ నటుడు. నటుడే కాదుగొప్ప వ్యక్తి. చాలా మంచి హృదయమున్న వ్యక్తి. ఆయన నటుడునిర్మాతగాడిస్ట్రిబ్యూటర్‌గా అన్నింటిని చక్కగా హ్యండిల్‌ చేసే వ్యక్తి ఆయన. ఒక రోల్‌ ఎక్కువఒక రోల్‌ తక్కువ అనే బేదాలు ఎవరికీ లేవు.

NTR interview gallery

ప్రయోగాత్మక చిత్రాలుఛాలెంజింగ్‌ పాత్రలు చేయడానికి సిద్ధం..
నేను స్టార్ హీరోగా కంటే ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తుండిపోవాలనుకుంటాను. స్టార్‌డమ్‌పై నాకు నమ్మకం లేదు. నా ద ష్టిలో స్టార్స్‌ ఎవరూ వుండరు. అందరూ నటులే. అవకాశాలుపాత్రలను బట్టి వారికి ప్రేక్షకుల్లో ఇమేజ్‌ ఏర్పడుతుంది. కమర్షియల్‌ పంథాకు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలుఛాలెంజింగ్‌ పాత్రలు చేయడానికి సిద్ధంగా వున్నాను. టెంపర్‌ నాన్నకు ప్రేమతో చిత్రాలు అందుకు నాంది పలికాయని అనుకుంటున్నాను. నేను చేసినందువల్లే సినిమా పాడైపోయిందనే అపవాదు నాపై వుండకూడదు. నావల్లే సినిమా బాగా వచ్చిందనే ప్రశంసలు దక్కాలని కోరుకుంటాను.

తెలుగు సినిమాలో మార్పులు...
ఇప్పుడు తెలుగు చిత్రసీమ చక్కటి మార్పుదిశగా పయనిస్తోంది. అది మనకు కనపడుతుంది కూడా.  అందుకు ఇటీవల విడుదలైన పెళ్లిచూపులు మనమంతా చిత్రాలు పరివర్తన చెందుతోన్న తెలుగు సినిమా ధోరణికి ఉదాహరణలు. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందిన పెళ్లిచూపులు పదికోట్లకు పైగా వసూళ్లను సాధించిందంటే ఆ సినిమా పొటెన్షియల్ ఏంటో తెలుస్తుంది. కథల్లో కొత్తదనం ఉంటేనే సినిమాలు చేయడానికి ఆసక్తి ఏర్పడుతుంది. ఒకే రకమైన కథాంశాలు చేస్తే బోర్‌గా ఫీలవుతాం. నాన్నకు ప్రేమతో కథలో కొత్త ఫీల్‌ కనిపించింది. జనతా గ్యారేజ్‌ కూడా అదే కోవలో ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌. ప్రతి సినిమాలో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవాలనే తపనతో కథాంశాల్ని ఎంచుకుంటున్నాను.

అందరి బాధ్యత...
జనతాగ్యారేజ్ లో మొక్కులు , పర్యావరణ పరిరక్షణ ప్రకృతిని ప్రేమించడంపర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలి. ప్రకృతిని గౌరవించాలి. లేకపోతే మూడొంతుల నీటితో వున్నభూమి సమాజానికి సమస్యలను క్రియేట్ చేస్తుంది.

ఎలాంటి క్యారెక్టర్ లో కనపడతారు....
-జనతాగ్యారేజ్ లో నా పాత్ర పేరు ఆనంద్. ప్రకృతిని ప్రేమించే యువకుడు.అలాగే మరో వ్యక్తి భూమిపై మనుషులను ప్రేమిస్తుంటాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఓ లక్ష్యం కలిసి ఏం చేశారనేదే కథ. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక కుటుంబ కథా చిత్రం. ప్రతి కుటుంబానికి కొన్ని విలువలులక్ష్యాలుఆశయాలు వుంటాయి. జనతా గ్యారేజ్‌ అనే కుటుంబానికి ఎలాంటి సంకల్పం వుందనేదే ఈ సినిమా.

హీరో ఈజ్ ద లాస్ట్ చాయిస్...
-నా అభిమానులు విపరీతమైన పనులు చేయరు. ఒకవేళ చేస్తే వారిని దయచేసి తప్పుకోమంటాను. ముందే చెప్పినట్లు స్టార్‌హీరో అనే ఇమేజ్‌ను నేను నమ్మను. మొదట మన దేశాన్ని ప్రేమించండి. ఆ తర్వాత తల్లిదండ్రుల్నిభార్యాపిల్లల్లిసమాజాన్ని ప్రేమించండి. చివరి ఆప్షన్‌గా హీరోల్ని అభిమానించమని కోరుతున్నాను. చౌరస్తాలో నిలబడి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తే హీరో ఈజ్‌ ద లాస్ట్‌ ఛాయిస్‌ అని భావించండి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved