pizza
Panna Royal interview about Calling Bell success
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2015
Hyderabad

 

రవివర్మ, కిషోర్, సంకీర్త్, విత్రిఖన్నా, మమత రాహుత్ ప్రధానపాత్రల్లో గోల్డెన్ టైమ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘కాలింగ్ బెల్’. అనూద్ నిర్మాత. పన్నా రాయల్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పన్నా రాయల్ తో ఇంటర్వ్యూ...

నేపథ్యం...

మాది నెల్లూరు జిల్లా పెరిగిందంతా కడపజిల్లా. అది గత పదిహేనేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. అక్కడ న్యూక్ సాఫ్ట్ వేర్ కంపెనీలో విఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేశాను. డిజిటల్ డొమైన్ లో వర్క్ చేశాను. నా పేరు పవన్. అందరూ ముద్దుగా పన్నా అని పిలిచేవారు. వి.ఎఫ్.ఎక్స్ లో నాకు రాయల్ కాసిల్ వారు రాయల్ అనే అవార్డుని ప్రెజెంట్ చేశారు. అందుకే నా పేరుని పన్నా రాయల్ అని ఈ చిత్రంలో పెట్టుకున్నాను.

సినిమా రంగంలోకి రావాలనే ఆలోచన...

సినిమాలంటే చిన్నప్పట్నుంచి ఆస్తక్తి. దానికి తోడు వి.ఎఫ్.ఎక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేయడం వల్ల సినిమాలంటే మరింత ఆసక్తి పెరిగింది. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేద్దామనే ఆలోచనతో హైదరాబాద్ కి వచ్చాను. అయితే ఇంతకు ముందు సినిమా రంగంతో పరిచయం లేదు. కొత్త వాడిని ఎక్కడా పనిచేయలేదు. దాంతో ముందు చిన్న సినిమాలనే చేద్దామనే ఆలోచనతో చేసిందే ‘కాలింగ్ బెల్’.

‘కాలింగ్ బెల్’ సక్సెస్ రెస్పాన్స్...

సినిమా విడుదల కాకముందే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని బాగా నమ్మకం ఉంది. సినిమా విడుదల తర్వాత ఆ నమ్మకం నిజమైంది. సినిమా ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయింది. నా టార్గెట్ కూడా అదే కావడంతో నేను సక్సెస్ అయినట్టే. థియేటర్స్ లో మంచి రెస్సాన్స్ వస్తుంది. రిపిటేడ్ ఆడియెన్స్ వస్తున్నారు. వైజాగ్ లో నిన్ననే థియేటర్ వెళ్లాను అక్కడ రెస్పాన్స్ చూసి హ్యపీగా అనిపించింది. సినిమా సెకండ్ వీక్ లోకి ఎంటరైంది. ఇప్పుడు మరో 12 థియేటర్స్ పెరిగాయి. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్

నిర్మాత గురించి..

ఈ సినిమా కోసం చాలా మంది నిర్మాతలను కలిశాను. ఇంతకు ముందు చెప్పినట్లు కొత్తవాడిని, ఎక్కడా వర్క్ చేయకపోవడంతో అందరూ ఆలోచించారు. కానీ అనూద్ గారు కథ విన్న తర్వాత వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. 20రోజుల కాల్షీట్స్ లో సినిమాని పూర్తి చేద్దామనుకున్నాను కానీ షూటింగ్ టైమ్ లో సన్నివేశాలను చూసిన ఆయన కాల్షీట్స్ ను 52 రోజులకు పెంచారు. రిలీజ్ టైమ్ లో కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆయనకి వీలైనన్నీ ఎక్కువ థియేటర్స్ లో సినిమాని విడుదల చేశారు.

నటీనటుల సపోర్ట్ గురించి..

ఈ సినిమా కోసం ముందుగా వేరే స్టార్స్ ను కలిశాను. అయితే వారికి ఎక్కడో చిన్న డౌట్ ఉండటంతో ఒప్పుకోలేదు. అప్పుడు రవివర్మగారిని కలిశాను. ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేశారు. ఆయనతో పాటు మిగతా నటీనటుల అందరూ బాగా సపోర్ట్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత నేను సినిమాకి ముందు కలిసిన నటీనటులు ఫోన్ చేసి అభినందనలు చెప్పడమే కాకుండా మంచి స్క్రిప్ట్ ఉంటే చేద్దామనే ఆసక్తిని చూపిస్తున్నారు.

నెక్స్ ట్ ప్రాజెక్ట్స్..

నాకు లవ్ సబ్జెక్ట్స్ కంటే సోషియో ఫాంటసీ, హర్రర్, థ్రిల్లర్, సైంటిఫిక్ సబ్జెక్ట్స్ చేయడానికి ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం నా చేతిలో ఆరు ప్రాజెక్ట్ కి సంబంధించిన కథలు ఉన్నాయి. అందులో మూడు ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్స్. ప్రస్తుతం అందరూ కాలింగ్ బెల్ 2 చేయమంటున్నారు. నా మైండ్ లో వేరే స్టోరి కూడా చేయాలని ఉంది. అయితే ఏదో చేయాలనే విషయం గురించి ఆలోచిస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved