pizza
Parasuram interview (Telugu) about Geetha Govindam
స్టార్ లీగ్ గురించి ఆలోచించ‌డం లేదు - ప‌ర‌శురామ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 August 2018
Hyderabad


ప‌ర‌శురామ్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడిగా అడుగుపెట్టి ప‌దేళ్ల‌యింది. యువ‌త‌, సోలో, ఆంజ‌నేయులు, సారొచ్చారు, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.. తాజాగా గీత గోవిందం. ప‌దేళ్ల‌లో ఆయ‌న వంద కోట్ల క్ల‌బ్ లో చేరిపోయారు. తాజాగా చిత్రం గీత గోవిందం 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ సినిమా హిట్ గురించి ప‌ర‌శురామ్ మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు..

* కంగ్రాట్స్ అండీ.. స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న‌ట్టున్నారు..
- అవునండీ. రెండు వారాల క్రితం గీత గోవిందం విడుదలైంది. ప్రపంచంలోని అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కలెక్షన్లు కూడా ఆనందంగా అనిపించాయి. షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను. అరవింద్ గారికి, వాసుగారికి, విజయ్ దేవరకొండగారికి, మంచి చిత్రాన్ని దగ్గరుండి ప్రమోట్ చేసిన మీడియాకు థాంక్స్ చెప్పాలని మాట్లాడుతున్నాను.

* గీత‌గోవిందం ఎలా స్టార్ట‌యిందో.. ఇంకో సారి గుర్తు చేసుకుంటారా?
- చిన్న సినిమాగా రెండేళ్ల క్రితం మొదలైంది. ఒక పెద్ద సినిమాకు ఎలా ఫీడ్ బ్యాక్ వస్తుందో... థియేటర్స్ లో గానీ, రెవెన్యూ సైడ్గానీ.. అలాగే ఉంది. అందుకే ఇంత ఆనందంగా ఉంది. నేను డైరక్టర్ అయి పదేళ్లయింది. 2008లో నా తొలి సినిమా విడుదలైంది. మొత్తం ఆరు సినిమాలు డైరక్ట్ చేశాను. వాటిలో ఆడినవీ ఉన్నాయి. ఆడనవీ ఉన్నాయి. కానీ గీతగోవిందం దర్శకుడిగా, రచయితగా నన్ను ఇంకో స్థాయిలో నిలబెట్టింది. నన్ను నమ్మి సినిమా చేసిన వారందరికీ ధన్యవాదాలు.

*స్టార్ డైర‌క్ట‌ర్ల‌ లీగ్లో చేరానని అనుకుంటున్నారా?
- క్రిష్ గారు నాకు పదేళ్లుగా ఫ్రెండ్. నేను ఏడీగా ఉన్నప్పటి నుంచీ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే స్టార్ లీగ్‌లో చేరాల్సిన డైర‌క్ట‌ర్ అని ప్రీ రిలీజ్ వేడుక‌లో అన్నారు. రూ.100కోట్లతో స్టార్ లీగ్ లో చేరామా? లేదా అనేది ప్రేక్షకులు చెప్పాలి. మంచి సినిమా అని మా అన్నయ్య చెప్పారు. రైటింగ్ డీటైల్డ్ గా ఉంది, ఎక్కడా తొందర పడకుండా రాసుకున్నట్టు ఉంది అని అన్నారు. కథ అలా కుదిరింది. విజయ్ యాడ్ అయ్యాడు ప్రాజెక్ట్ కి. సాంగ్స్ మాసివ్ హిట్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ పాటలు విని, సినిమా కోసం వెయిట్ చేశారు. కథ ప్రాపర్గా సెట్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్, మిగిలిన కాస్టింగ్ అంతా చక్కగా కుదిరింది.

* సినిమా విడుదలకు ఒన్ వీక్ ముందు... సినిమా లీక్ అయింది.. అప్పుడు దర్శకుడిగా మీ థాట్ ప్రాసెస్ ఏంటి?
- కోప్పడాలా? బాధపడాలా? ఏడవాలా? ఏమీ అర్థం కాలేదు. ఇంకో నాలుగైదు రోజుల్లో విడుదల అవుతుందనగా సినిమా మొత్తం లీక్ అయిందని చాలా టెన్షన్ పడ్డా. కానీ అప్పుడు కూడా నాకు హోప్ అరవింద్గారే. ఇంకో పది, పన్నెండు గంటల్లో అంతా సెట్ అవుతుందని అరవింద్గారు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు కాస్త కుదుటపడ్డా. ఎందుకంటే ఈ సినిమా నా బేబీలాంటిది. గీతతోనూ, గోవింద్తోనూ నేను అంతగా కనెక్ట్ అయ్యాను.

* దర్శకుడిగా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నారా... పాత సినిమాల్లో అలా చేశాం.. ఈ సినిమాలో ఇలా చేశాం.. ఇక దీన్ని ఫాలో కావాలి.. అనేలా?
- అంటే అన్నీ సినిమాలకు నేను పడ్డ కష్టం ఒకటే. కాకపోతే దీనికి అన్నీ సెట్ అయ్యాయి. ఈ సినిమాకు పాత్రలు, పాయింట్ వంటివన్నీ సెట్ అయ్యాయి. విజయ్కి ఉన్న క్రేజ్ కూడా చాలా హెల్ప్ అయింది.

* గత సినిమాలకూ,ఈ సినిమాలకూ మీలో ఉన్న వ్యత్యాసం ఏంటి?
- రకరకాల సబ్జెక్ట్ కి రకరకాలుగా రాస్తాం. ఈ సినిమాకి డీటెయిలింగ్గా రాయడం కుదిరింది. అంతకు మించి వ్యత్యాసం ఏమీ లేదండీ.

* ఈ సినిమా తర్వాత చాలా ఫోన్లు వచ్చాయా... అడ్వాన్సులు ఇస్తామని..?
- చూద్దామండీ. ఇప్పుడు గీతలో ఉన్నాం కదా. మైత్రీ ఉంది.

* బన్నీ తో సినిమా..?
- బన్నీకి ఇప్పుడు కాదండీ. ఈ సినిమా కథ ఎప్పటి నుంచో ఇష్టం. కాకపోతే అతనికి నేను ఈ కథను రాంగ్ టైమింగ్లో చెప్పాను. సరైనోడు విడుదలైన తర్వాత ఆయనకు ఈ కథ చెప్పా. దాంతో ఈ కథని మిస్ అవకుండా గీతలో చేయండి అని అన్నారు. ఫైనల్ గా 10 డేస్ ముందు డబుల్ పాజిటివ్ చూశారు. చాలా సంతోషించారు. అందుకే పెద్ద పార్టీ కూడా ఇచ్చారు.

interview gallery



* ఇంతకీ మీ సినిమా ఎప్పుడు ఉంటుంది?
- ఆయనకు ముందు నేను కథ చెప్పాలి.

* సాయిధరమ్ తేజ్ తో..
- ఫ్రాంక్గా నాదగ్గర 4,5 కథలున్నాయండీ. వాటి మీద వర్క్ చేయాలి. ఈ సినిమా ఇంకా థియేటర్లో ఉంది. ఇప్పుడే ఇంకో సినిమా గురించి మాట్లాడటం టూ ఎర్లీ కదా.

* బన్నివాస్గారికి ఓ కథ చెప్పారు.. ఇంటి తాళం ఇచ్చారట కదా?
- ఒక పాయింట్ చెప్పాను. ఆ కథే ఇప్పుడు రెడీ చేస్తున్నా.

* `గీత గోవిందం` రెండేళ్లు పట్టిందా?
- 2016 సెప్టెంబర్లో కథ ఓకే అయింది. వర్కింగ్ డేస్ 70. కానీ కాస్టింగ్ కే మాకు ఏడెమినిది నెలలు పట్టింది. 2,3, సీన్లు రీ షూట్ చేశాం. మధ్యలో కొన్ని లైట్ ఫెయిల్యూర్ అయినవి ఉన్నాయి. వాటిని తీర్చిదిద్దడానికి చేసుకున్నాం.

* బన్నీవాసుతో ఉన్న బాండింగ్ ఏంటండీ...?
- నేను పరుగు సినిమాకు భాస్కర్గారి దగ్గర పనిచేసేటప్పటి నుంచీ బన్నీవాసుగారితో పరిచయం ఉంది. అప్పటి నుంచీ రెండు, మూడు నెలలకోసారి అయినా వాసుగారితో మాట్లాడేవాడిని. ఓ బ్రదర్లాగానే చూసేవాళ్లు.

* ఇంత ఫిగర్స్ అని ముందే అనుకన్నారా?
- ఫిగర్స్ మనకు ముందే తెలియదుగా. కాకపోతే హిట్ సినిమా అనుకున్నాం.

* నిర్మాతల ప్రమేయం ఎలా ఉంటుంది?
- లేదండీ. శ్రీరస్తుకు గానీ, ఈ సినిమాకు గానీ... నిర్మాత‌లు త‌ర‌చూ సెట్‌కి వ‌చ్చేవారు కాదు. సినిమా 80-90 ప‌ర్సెంట్ కంప్లీట్ అయ్యాక చూశారు. అప్పుడు వాళ్లు చెప్పింది.. చెప్తే, దానికి నా స‌మాధానాలు నేను చెప్పాను. రెండు సినిమాల‌కీ అంతే జ‌రిగింది.

* నెక్స్ట్ గోపాలా గోపాలా త‌రహా సినిమా చేస్తున్నారా?
- లేదండీ. అది ఓ మెంట‌ర్‌కీ, ఓ వ్య‌క్తికీ సంబంధించిన క‌థ‌.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved