pizza
Parasuram interview about Srirastu Subhamastu
నేను ప‌నిచేసిన ద‌ర్శ‌కులు అలాంటివారు మ‌రి! - ప‌ర‌శురామ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

07 August 2016
Hyderaba
d

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాకు తాజాగా ద‌ర్శ‌క‌త్వం చేశారు ప‌ర‌శురామ్‌. యువ‌త‌, సోలో, ఆంజ‌నేయులు, సారొచ్చారు త‌ర్వాత ఆయ‌న చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఇటీవ‌లే విడుద‌లై విజ‌య‌వంత‌మైంది. ఈ సినిమా గురించి ఆదివారం ప‌ర‌శురామ్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు

* ప‌ర‌శురామ్ ఒక ర‌చ‌యిత‌గా ఎక్కువ స‌క్సెస్ అయ్యారా? ద‌ర్శ‌కుడిగా ఎక్కువ స‌క్సెస్ అయ్యారా?
- అది మీరే చెప్పాలండీ. ఆ విష‌యాల‌ను ప్రేక్ష‌కులే చెప్పాలి.

* సినిమా చూసుకున్నాక మీకేం అనిపించింది?
- నేను విడ‌దీసి చూడ‌లేనండీ. నేను ఇంత‌కు ముందు ప‌నిచేసిన ద‌ర్శ‌కులు.. పూరి జ‌గ‌న్నాథ్‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, వీరుపోట్ల, ద‌శ‌ర‌థ్‌ వంటివారి వ‌ర్కింగ్ స్టైల్‌నే నేను ఫాలో అవుతాను. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అనేది నాకు విడ‌దీసి చూడ్డం రాదు. అలా అల‌వాటైపోయింద‌ది.

* డైలాగులు రాసే విధానం ఎలా ఉంటుంది?
- నేనేం అదే ప‌నిగా కూర్చుని రాయ‌నండీ. కాక‌పోతే ఆ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు నేను ఏదో ఒక‌టి ఎక్స్ ప్రెస్ చేయాలి కాబ‌ట్టి అప్పుడు రాసుకుంటా. అంతేగానీ డైలాగుల‌కు క్లాప్స్ కొట్టించుకోవాల‌ని నేన‌నుకోను. అందుకే కేజువ‌ల్‌గా ఉంటాయి నా డైలాగులు. బుక్కిష్ లాంగ్వేజ్ ఉండ‌దు. నేచుర‌ల్‌గా ఉంటుంది. సీన్ తీసే ముందురోజు వ‌ర‌కు నేను డైలాగులు కూడా రాయ‌ను. ట్రీట్‌మెంట్‌లోనే ఉంటుంది. సెట్‌కెళ్లే ముందు రోజు మాత్రం రాస్తాను. ప్రొడ‌క్ష‌న్ వాళ్ల‌కి ప్లానింగ్ ఉండాల‌ని రాస్తాను.

* బ‌య‌టి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది?
- సూప‌ర్బ్ అండీ. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నేను ఇంత ఎక్స్ పెక్ట్ చేయ‌లేదు. జీరో ఎక్స్ పెక్టేష‌న్స్ తోనే రావాల‌ని అనుకున్నాం. అందుకే ఇలా సినిమా జ‌రుగుతుంద‌ని కూడా మేం ఎప్పుడూ ఎవ‌రితోనూ చెప్ప‌లేదు. కానీ టీజ‌ర్‌కి, ట్రైల‌ర్‌కి సినారియో కంప్లీట్‌గా మారిపోయింది. మంచి కంటెంట్‌ని మంచిగా రిజీవ్ చేసుకోవ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ డిజ‌ప్పాయింట్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ప్రేక్ష‌కులు చాలా బాగా రిజీవ్ చేసుకున్నారు.

* సోలో, బొమ్మ‌రిల్లు సినిమాలు గుర్తొస్తున్నాయ‌నే విమ‌ర్శ వినిపించింది?
- బొమ్మ‌రిల్లు ఎపిక్‌. సోలో అనేది అంత రేంజ్ కాదు కానీ బానే ఆడింది. వాటితో నా సినిమాను పోలిస్తే అది నాకు గ్రేట్ థింగ్‌. గురువుల ప్ర‌భావం మ‌న మీద ఎక్క‌డో ఉంటూనే ఉంటుంది క‌దా. చిరంజీవిగారు కూడా ఆ రోజు బొమ్మ‌రిల్లుతో పోలిస్తే ఆనందంగా అనిపించింది. తండ్రి వ‌చ్చి కొడుకు ద‌గ్గ‌ర నా పేరు నిల‌బెట్టావురా అని అంటే అది కొడుక్కి గ‌ర్వ‌మే అవుతుంది కానీ త‌ల‌వంపు ఎలా అవుతుంది.

* శిరీష్ యాక్టింగ్ విష‌యంలో ఏమైనా కేర్ తీసుకున్నారా?
- లేదండీ. నాక‌న్నా త‌న ఎఫ‌ర్ట్ ఎక్కువ‌గా ఉంది. నేను ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపించాను. కానీ చేయాల‌న్న త‌ప‌న అత‌నిలో ఉంది. త‌న‌ని త‌ను మౌల్డ్ చేసుకున్నాడు. మా డాడీ చిన్న జాబ్‌. 20 ఎక‌రాల పొలం ఉండేది. క్యాంప‌స్‌లో ఎంబీఏ చేశా. అందుకే నాకు నేచుర‌ల్‌గా ఉండ‌టం ఇష్టం. భారీ డైలాగులు కూడా ఇష్ట‌మే. కానీ ఈ క‌థ‌కు అలాంటివి ప‌నిచేయ‌వు. ఈ సినిమాలో నా హీరో కేర‌క్ట‌ర్ కి తొలి ప‌ది నిమిషాల్లో ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయిపోవాలి. దానికి త‌గ్గ‌ట్టే అన్నీ ప్లాన్ చేసుకున్నాం.

* తొలివారం రోజులు మీకు, శిరీష్‌కి మ‌ధ్య కెమిస్ట్రీ స‌రిగా లేద‌ట క‌దా?
- అదేం లేదండీ. నాకు ఐదు సినిమాల ఎక్స్ పీరియ‌న్స్. త‌న‌కి మూడు. తొలి రెండు రోజులు నేను త‌న‌ని ఏమీ అన‌లేదు. కానీ త‌నే నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి సార్ మీకు ఎలా కావాలో చెప్పండి. చేద్దాం. మ‌నం ఈ సినిమా చేస్తున్న ప‌ర్పెజే వేరు, అర‌వింద్‌గారి కొడుకు అనే భావ‌నే వ‌ద్దు అని అన్నాడు. రాయ‌డానికి తీయ‌డానికి నేను క‌ష్ట‌ప‌డితే చేయ‌డం మాత్రం శిరీష్ చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు.

* మూడు పాట‌లు పెట్ట‌డానికి కార‌ణం ఏంటి?
- సింగిల్ లైన్ ఆర్డ‌ర్ రాసేట‌ప్పుడు నాకు పాట ప‌ట్ట‌లేదు. అందుకే థీమ్‌ని డిస్ట‌ర్బ్ చేయ‌కుండా ఉండాల‌ని వ‌దిలేశాం. టాప్ టెన్‌, టాప్ 12 స్టార్స్ అయితే వాళ్ల‌కి పాట‌లు త‌ప్ప‌దు. ఎందుకంటే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ మేం ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాం. కాబ‌ట్టి పాట‌లు లేక‌పోయినా ఫ‌ర్వాలేద‌నిపించింది.

* శిరీష్ కాకుండా ఇంకెవ‌ర‌న్నా అయితే ఇంకా బావుండేద‌ని టాక్‌..
- లేదండీ. అస‌లు క‌థ రాసిందే త‌న‌కోసం. త‌ను న‌న్ను న‌మ్మాడు. సినిమా విడుద‌లైన త‌ర్వాత ల‌క్షాతొంభైయ్యారు మాట్లాడుకుంటాం. అవ‌న్నీ క‌రెక్ట్ కాదండీ. ముందు వేరేది క‌న్‌ఫ‌ర్మ్ అయింది. కానీ నేను, శిరీష్‌గారు కాఫీ షాప్‌లో కూర్చున్న‌ప్పుడు `హిట్ అంటే ఏముంది? ఎవ‌రితోనైనా కొట్ట‌గ‌ల‌ను. కానీ మ‌నం చేస్తే కెరీర్‌లో అలా ఉండిపోవాలి` అని అన్నాడు. అప్పుడు న‌న్ను మూడు వారాలు వ‌దిలేయ‌మ‌న్నా. ఆలోచిస్తే ఓ పాయింట్ త‌ట్టింది. దాంతో డెవ‌ల‌ప్ చేశాం.

* వ‌దిన పాత్ర‌తో ఒక్క డైలాగు కూడా ప‌లికించ‌లేదు?
- అవ‌స‌రం లేదండీ. ఎందుకంటే ఆమెకు ఫేస్ ఈ కుర్రాడే. వ‌దిన అంటే త‌ల్లిలాంటిది. ఆమె బాధ‌ను ఈ కుర్రాడు అర్థం చేసుకున్నాడంటే ఇత‌ని సంస్కారం తెలిసింది. అక్క‌డే అత‌ను నిల‌బ‌డ్డాను. ఇంత క‌థ రాసుకున్న‌వాళ్లం అంత మినిమ‌మ్ విష‌యాల‌ను ఆలోచించ‌మా? అన్నీ ఆలోచించే ఇది రాసుకున్నాం.

* గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే అర‌వింద్‌గారు, హీరోలు ఇన్ వాల్వ్మెంట్ ఉంటుంది అని అంటారు. నిజ‌మేనా?
- అదేం లేదండీ. నేను చాలా హ్యాపీగా చేశా. జాగ్ర‌త్త‌గా చేసుకోండి అని అన్నారు అర‌వింద్‌గారు. ఇంట్లో తండ్రి జాగ్ర‌త్త‌రా అని చెబితే దాన్ని ఒత్తిడి అని అనుకుంటే ఎలా? దాన్నే ఒత్తిడి అని అనుకుంటే హైద‌రాబాద్‌లో మ‌న‌కి ప‌నేం ఉంట‌ది? 14 నెల‌లు నాకు ఈ సంస్థ‌లో పిక్నిక్‌కి వ‌చ్చిన‌ట్టు ఉంది. హిట్ కొట్ట‌డం వేరు. గౌర‌వంతో కూడిన హిట్ కొట్ట‌డం వేరు. ఈ సంస్థ‌లో గౌర‌వంతో కూడిన హిట్ కొట్టా. అందుకు చాలా హ్యాపీ. చిన్న కార్పొరేట్ స్టైల్‌లో ఉంటుంది.

* సారొచ్చారు త‌ర్వాత ఏమైనా కొంచెం ఆలోచ‌న‌లో ప‌డ్డారా?
- అలా ఏమీ కాదండీ. ఇక్క‌డ ఏ సినిమాకు ఆ సినిమానే. ఇది సూప‌ర్‌హిట్ అయింద‌ని త‌ర్వాతి సినిమా ఒంటిమీద తెలివి లేకుండా తీస్తే మ‌ర‌లా ఇబ్బందే. ఎవ‌రికైనా స‌రే ఒక సినిమా పోయిందంటే బ్యాడేగా.

* అప్పుడు ఇండ‌స్ట్రీ మీ ప‌ట్ల ఎలా ఉంది?
- నా త‌ప్ప‌ది. ఎవ‌రినైనా ఎలా బ్లేమ్ చేస్తాం.

* హిట్ వ‌స్తే ఒక‌లా? ఫ‌్లాప్ వ‌స్తే ఒక‌లా చూస్తుంటారా?
- ఆబ్వియ‌స్లీ అండీ. ఎందుకంటే హండ్ర‌డ్ మీట‌ర్స్ లో ఫ‌స్ట్ వ‌స్తే అభినందిస్తారు. సెకండ్ వ‌చ్చినోడిని జాలిగా చూసి వెళ్లిపోతారు. వాళ్లొచ్చారు వాళ్ల‌ని అభినందించారు. న‌న్ను అభినందించ‌లేదంటే ఎలా? అభినంద‌న‌లు కావాలంటే గెలువు మ‌రి. గెల‌వ‌క‌పోతే ఎలా?

* లావ‌ణ్య త్రిపాఠిని బాగా అందంగా చూపించారు?
- నాకు శిరీష్ ప్ర‌పోజ్ చేశాడు ఆ అమ్మాయిని. చాలా బాగా చేసింది.

* త్రివిక్ర‌మ్‌, పూరి త‌ర్వాత డైలాగులు రాయాలంటే మీరేన‌ని అంటున్నారు?
- బాబ్బాబూ.. .అలాంటిదేమీ లేదండీ. వాళ్లు భ‌గ‌వంతులు. మ‌నం భ‌క్తులం అంతే.

* మీ త‌దుప‌రి సినిమా ఏంటి?
- గీతా ఆర్ట్స్ లోనే అండీ. ఏ హీరోతో అనేది అల్లు అర‌వింద్‌గారు చెప్పాలి. నా ద‌గ్గ‌రున్న క‌థ‌ల‌న్నీ ఆయ‌న‌కు తెలుసు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved