pizza
Paruchuri Murali interview (Telugu) about Aatagallu
ఇప్పటి ట్రెండ్‌ తగ్గ మైండ్‌ గేమ్‌ మూవీ 'ఆటగాళ్ళు' - పరుచూరి మురళి
You are at idlebrain.com > news today >
Follow Us

18 August 2018
Hyderabad

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నారా రోహిత్‌, జగపతిబాబు నటిస్తోన్న సినిమా 'ఆటగాళ్ళు'. 'ఆంద్రుడు' చిత్ర దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. ఈ నెల 24న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరుచూరి మురళి ఇంటర్వ్యూ...

ప్రతి సినిమాకు ఎక్కువ గ్యాప్‌ వచ్చేస్తుంది కదా?
- పెదబాబు సినిమా తర్వాత రెండేళ్లు సమయం తీసుకున్నాను. ఆంధ్రుడు సినిమా తర్వాత మూడున్నరేళ్లు సమయం తీసుకున్నాను. అందుకు కారణం మంచి కథ కుదిరే వరకు సినిమా చేయడానికి నాకే నచ్చదు. భలే సినిమా తీశాడు రా!...మంచి డైరెక్టర్‌ అనిపించుకోవడమే నా గోల్‌.

`ఆటగాళ్ళు` కథేంటి?
- నేను ఇప్పటి వరకు కమర్షియల్‌ సినిమాలు చేశాను. విలన్‌ క్రియేట్‌ చేసే సమస్యలను హీరో క్లియర్‌ చేస్తుంటాడు. కానీ ఈ సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. మైండ్‌ గేమ్‌ కథ. జగపతిబాబు, నారా రోహిత్‌ ఇద్దరూ వారి సమస్యలను ఒకరికొకరు మైండ్‌గేమ్‌తో ఆడుకుంటారు.

ఇన్‌స్పిరేషన్‌ ఉందా?
- ఆంధ్రుడు స్టైయిల్లో ఉత్తర ప్రదేశ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేద్దామని అనుకున్నాను. అయితే నా బావ మరిది ఇంటికి వెళ్లాం. తను ఈ పాయింట్‌ చెప్పాడు. తను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను స్టార్ట్‌ చేశాం.

ఏ పాత్ర హైలైట్‌గా ఉంటుంది?
- జగపతిబాబు, నారా రోహిత్‌ పాత్రలు ఒకదాన్ని మించి ఒకటి అనిపించేలా సినిమా ఉంటుంది. అలాగే హీరోయిన్‌ దర్శన్‌ బానిక్‌ పాత్ర కూడా చాలా బావుంటుంది. దర్శన బానిక్‌ బెంగాళీలో ఆరు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆమె అయితే బావుంటుందనిపించడంతో ఈ సినిమాలో ఆమెను సంప్రదించి నటింప చేశాం.

interview gallery



నిర్మాతలు గురించి?
- నిర్మాతలు నా స్నేహితులే. సాధారణంగా డబ్బులు పెట్టే నిర్మాతలు ఆ డబ్బు వస్తుందా? రాదా? అని ఆలోచిస్తుంటారు. కానీ ఈ సినిమా అనేది ప్యాషన్‌. అలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలైనా ఫ్రెండ్స్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది.

బ్రహ్మానందం క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది? ఆయనకు కమ్‌ బ్యాక్‌ మూవీ అనుకోవచ్చా?
- నేను రాసుకున్న కామెడీ సిచ్యువేషన్స్‌కు బ్రహ్మానందం న్యాయం చేస్తారనిపించింది. అందుకని ఆయన్ను ఈ సినిమాలో తీసుకున్నాను. ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉండే సినిమా ఇది.

నెక్స్‌ట్‌ చిత్రాలు..?
- ఇంకా ఏమీ ఫిక్స్‌ కాలేదు. ఈ సినిమా ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved