pizza
Pavani interview about Lovers Club
మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాల‌ని ఉంది - పావ‌ని
You are at idlebrain.com > news today >
Follow Us

10 November 2017
Hyderabad

`గంగ‌`, `అంప‌శ‌య్య‌`, `ఎర్ర‌బ‌స్సు`, `ఎలుకా మ‌జాకా`, `లావ‌ణ్య విత్ ల‌వ్ బోయ్స్` వంటి చిత్రాల్లో న‌టించిన భామ పావ‌ని. తాజాగా ఆమె ల‌వ‌ర్స్ క్ల‌బ్ చిత్రంలో న‌టించారు. ఆ సినిమా గురించి, అందులో త‌న పాత్ర గురించి హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఈ సినిమాలో నా పేరు గీత‌. నేను డాక్ట‌ర్‌గా చేస్తాను. అనుకోని కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇంట్లో ప్రాబ్ల‌మ్స్ వ‌ల్ల బ‌య‌ట‌కు వ‌స్తుంది. త‌ను చాలా బోల్డ్. హీరోకి ల‌వ‌ర్స్ క్ల‌బ్ అని ఒక టీమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి ల‌వ‌ర్స్ కి అండ‌గా నిలిచి, రెండు వైపుల నుంచి వాళ్ల ల‌వ్ ప‌ర్ఫెక్ట్ అనిపిస్తే పెళ్లి చేస్తారు. ల‌వ‌ర్స్ షెల్ట‌ర్ ఇచ్చే కేర‌క్ట‌ర్‌లో హీరో క‌నిపిస్తారు. వాటి వ‌ల్ల వ‌చ్చే ప్రాబ్ల‌మ్స్ ని అత‌ను ఫేస్ చేస్తుంటాడు. స‌రిగా అదే సమ‌యానికి హీరోయిన్ అత‌ని ఇంట్లో అద్దెకు దిగుతుంది. మెడ‌లో తాళితోనే అత‌నికి ప్ర‌పోజ్ చేస్తుంది.

* మెడ‌లో తాళి ఎందుకు ఉంటుంది?
- హీరోయిన్ కి అప్ప‌టికే పెళ్ల‌యిపోయి ఉంటుంది. కానీ త‌న ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తించే వ్య‌క్తి కావ‌డం వ‌ల్ల అక్క‌డ ఇమ‌డ‌లేక వ‌చ్చేస్తుంది. మెడ‌లో తాళి ఉన్న అమ్మాయితో ప్రేమ ఏంట‌ని హీరో త‌ల్లి అత‌న్ని ఇలాగే ప్ర‌శ్నిస్తుంది.

* బోల్డ్ పాత్ర అన్నారు.. అంటే ఎలా ఉంటుంది?
- బోల్డ్ పాత్ర అంటే త‌న‌కు న‌చ్చింది చెప్పేస్తుంది. ఏం కావాలంటే అది అడుగుతుంది. బోల్డ్ అంటే త‌ను సిగ‌రెట్ తాగుతుంది. త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉంటుంది. మోడ్ర‌న్ డేస్‌కి త‌గ్గ‌ట్టు ఉంటుంది.

* మీ గురించి చెప్పండి?
- మాది గుంటూరు. మా తాత‌గారికి స్టేజ్ అనుభ‌వం ఉంటుంది. నాక్కూడా స్టేజ్ అనుభ‌వం ఉంది. చాలా నాట‌కాలు వేశాను. సినిమాల్లోకి వ‌స్తాన‌న్న‌ప్పుడు మా నాన్న‌గారు, సోద‌రులు స‌పోర్ట్ చేశారు.

* సినిమాల్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయం?
- అంటూనే ఉన్నారు.

* సినిమాను ఐ ఫోన్‌లో షూట్ చేశార‌ట క‌దా?
- అవునండీ. నాకు ముందే చెప్పారు. వాళ్లు ఐఫోన్‌లో షూట్ చేసిన డెమో చూపించారు. దాన్ని చూసి నాకు న‌చ్చి వెంట‌నే చేశాను. ఎక్కువ‌గా నా పోర్ష‌న్‌ని హైద‌రాబాద్‌లో షూట్ చేశారు.

* ఇంకేం సినిమాలు చేస్తున్నారు?
- ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ నెల 13న ఓ సినిమా మొద‌ల‌వుతుంది.

* న‌టించ‌గ‌లిగి ఉండీ.. మంచి సినిమాలు రాలేద‌న్న బాధ ఉందా?
- లేదండీ. నేను వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉన్నాను. లీడ్ ఆర్టిస్ట్ గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. లీడ్ అనే కాకుండా, పెద్ద చిత్రాల్లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాల‌ని ఉంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved