pizza
Pawan Kumar interview (Telugu) about U Turn
చేసింది రీమేక్ కాదు.. అడాప్టేష‌న్
You are at idlebrain.com > news today >
Follow Us

15 September 2018
Hyderabad

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌కుమార్ ఇంట‌ర్వ్యూ...

* నిజ జీవితం ఆధారంగా తీశారా?
- యు ట‌ర్న్ తీసుకునే షాట్స్ ఉన్నాయి క‌దా.. ఆ ఫ్లై ఓవ‌ర్ బెంగుళూరులో ఉంది. అది డ‌బుల్ రోడ్ ఫ్లై ఓవ‌ర్‌. అక్క‌డ ఆ స‌మ‌స్య ఉండేది. 4,5 ఏళ్లు నేను ఆ ఫ్లై ఓవ‌ర్ మీద తిరిగేవాడిని. అప్పుడు అక్క‌డ కొన్ని ఇన్సిడెంట్స్ జ‌రిగేవి. వాటిని చూస్తూ ఉండేవాడిని. అక్క‌డి నుంచి నేను ఆ ఐడియా డెవ‌ల‌ప్ చేశాను. అంత‌కు మించి ఇంకేమీ కాదు.

* రీమేక్ అంటే బోర్ క‌దా?

- ఇందులో మేం చేసింది రీమేక్ కాదు. అడాప్టేష‌న్ చేశాం. లాస్ట్ 30 నిమిషాలు ఇక్క‌డ వేరుగా చేశాం. బిగినింగ్ పార్ట్ లు మాత్ర‌మే సేమ్‌. క‌న్న‌డ‌లో లో బ‌డ్జెట్, ఎక్స్ పెరిమెంట‌ల్ అప్రోచ్‌తో చేశాం. కానీ ఇక్క‌డికి వ‌చ్చేస‌రికి అది చాలా పెద్ద‌దైంది. లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా చేశాం. తెలుగులో చేసిన చివ‌రి 30 నిమిషాల‌ను త‌క్కువ బ‌డ్జెట్‌లో క‌న్న‌డ‌లో చేయ‌లేక‌పోయాం. టెక్నికాలిటీస్ అక్క‌డితో పోలిస్తే ఇక్క‌డ బావున్నాయి. టైమ్ కూడా ఇక్క‌డ ఉన్న‌ది.

* క‌న్న‌డ‌లో చేసిందానికి, ఇక్క‌డ చేయ‌డానికీ మీకు ఎలాంటి అనుభూతి ఉంది?

- క‌న్న‌డ వెర్ష‌న్ చూసి కూడా చాన్నాళ్ల‌యింది. అప్పుడు చేసిన‌ప్పుడు అది బాగా అనిపించింది. ఇప్పుడు ఇదే బాగా అనిపిస్తోంది.

* ఆత్మ‌ల మీద ఏమైనా స్ట‌డీ చేశారా?

- స్ట‌డీ అంటే ఆత్మ అనేది గిల్ట్. మ‌నం ఏదైనా త‌ప్పు చేస్తే ఓ గిల్ట్ మ‌న‌లో ఉంటుంది. ఆ గిల్ట్ నే మేం గోస్ట్ గా చూపించాం.

* మామూలుగా దెయ్యాలు త‌ప్పు చేసిన వాళ్ల‌నే శిక్షిస్తాయ‌ని అంటారు. కానీ మీ సినిమాలో ఆ దెయ్యం ఆ రూట్‌లో వెళ్లిన ప్ర‌తి ఒక్క‌రినీ శిక్షించ‌డం ఎంత వ‌ర‌కు న్యాయం?
- మామూలుగా మ‌నం సిగ్న‌ల్స్ జంప్ చేస్తాం. దానికి సిగ్గుప‌డం. పోలీసులు ఫైన్ వేసినా సిగ్గుప‌డం. కానీ అక్క‌డ జ‌రిగేది త‌ప్పు అయిన‌ప్పుడు సిగ్గుపడాలి, ప‌శ్చాత్తాప ప‌డాలి. అందుకే నేను ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాను. ఏదో ఒక భ‌యం ఉంటే త‌ప్ప మ‌నం స‌రిగా ప్ర‌వ‌ర్తించం. ఇది ఫిక్ష‌నల్ థ్రిల్ల‌ర్‌. ఇప్పుడు నేను త‌మిళ్‌, తెలుగు ఆడియ‌న్స్ ఫీడ్‌బ్యాక్ చదువుతున్నా. ఇది యూనివ‌ర్శ‌ల్ స‌బ్జెక్ట్. అయినా ఒక్కొక్క‌రూ దాన్ని తీసుకునేవిధానం అలాగే ఉంటుంది.

* జ‌ర్న‌లిస్ట్ గా ఆమె చేసిన ఇన్వెస్టిగేష‌న్‌లో.. ఎడిట‌ర్‌కి చెప్ప‌డం కామ‌న్‌. కానీ ఇందులో ఆ కోణంలో ఎందుకు చూపించ‌లేదు?

- ఈ మొత్తం స్టోరీ ఐదు రోజుల్లో జ‌రుగుతుంది. అందుకే ఎవ‌రితోనూ చెప్ప‌దు. సమ‌స్య‌కు ఆమె సొల్యూష‌న్ తీసుకుని రావాల‌ని అనుకుంటుంది. ఇక్క‌డ భూమిక కేర‌క్ట‌ర్‌ని చాలా ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించాం.

* * స‌మంత మిమ్మ‌ల్ని అప్రోచ్ అయ్యార‌ట క‌దా?
- అవును. మా క‌న్న‌డ వెర్ష‌న్ ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు ఆమె చూశారు. మ‌మ్మ‌ల్ని స్క్రిప్ట్ పంప‌మ‌ని అడిగారు. నేను ఎలా పంప‌డం అని ఆలోచిస్తుండ‌గా, ఆమె మ‌ర‌లా ఫాలో అప్ చేశారు. దాంతో డేర్ చేసి పంపించాను. చ‌దివి హ్యాపీగా ఫీల‌య్యారు. మ‌ధ్య‌లో ఒక‌సారి నాగ‌చైత‌న్య మ‌మ్మ‌ల్ని బెంగుళూరులో క‌లిశారు. ఆ త‌ర్వాత మా క‌న్న‌డ వెర్ష‌న్ విడుద‌ల‌కు ప‌ది రోజుల ముందు నాగ‌చైత‌న్య‌, స‌మంత బెంగుళూరు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని క‌లిసి సినిమా చూశారు. మా సినిమా ప్ర‌మోష‌న్‌లోనూ పాల్గొన్నారు. అప్పుడే స‌మంత ఈ సినిమాను చేస్తాన‌న్నారు. కానీ ఆమెకు ఉన్న ప్రాజెక్టుల కార‌ణంగా ఆమె ఈ సినిమాను చేయ‌లేదు. ఇన్నాళ్ల‌కు కుదిరింది.

* యూనివ‌ర్శ‌ల్ స‌బ్జెక్ట్ ని ఇక‌పై బైలింగ్వుల్‌గా చేస్తారా?
- చేస్తాను. కానీ దానికి త‌గ్గ స్క్రిప్ట్, వ‌న‌రులు అన్నీ ఉండాలి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved