pizza
P. Balreddy interview about Rojulu Marayi
మారుతిగారి ద‌ర‌కత్వంలో ప‌నిచేయాల‌నుంది - బాల్‌రెడ్డి.పి
You are at idlebrain.com > news today >
Follow Us

27 June 2016
Hyderaba
d

ఒక వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా, వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా, మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం ‘రోజులు మారాయి’. ముర‌ళీక‌ష్ణ ముడిదాని ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీనివాస‌రావు నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమా జూలై 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్రాఫ‌ర్ బాల్‌రెడ్డి.పి తో ఇంట‌ర్వ్యూ విశేషాలు...

నేపథ్యం...
- సినిమాటోగ్రాఫ‌ర్‌గా నాకు ఇది 8వ చిత్రం. సినిమాటోగ్రాఫ‌ర్‌గా నేను అజ‌య్ విన్సెంట్‌గారి వ‌ద్ద ఆరు సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. త‌ర్వాత వాసు అనే సినిమాటోగ్రాఫ‌ర్‌గా అరు సినిమాలు దాకా వ‌ర్క్ చేశాను. త‌ర్వాత రామ‌రాజుగారు ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన `మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు` చిత్రంతో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యాను. త‌ర్వాత నీల‌కంఠ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో మాయ సినిమాకు వ‌ర్క్ చేశాను. అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో పిల్ల‌జ‌మీందార్ ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రాంగ‌ద చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశాను.

`రోజులు మారాయి` చిత్రంలో అవ‌కాశం....
- `మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లెపువ్వు ` సినిమా స‌మ‌యంలో మారుతిగారు ఆ సినిమా చూశారు. ఆయ‌న‌కు నా వ‌ర్క్ న‌చ్చ‌డంతో మ‌నం క‌లిసి ఓ సినిమా చేద్దామ‌ని అన్నారు. అన్న‌మాట ప్ర‌కార‌మే రోజులు మారాయి చిత్రంలో నాకు అవ‌కాశం ఇచ్చారు.

వ‌ర్క్‌లో తేడా ఉండ‌దు...
- చిన్న‌, సినిమా అనే తేడా ఏం ఉండ‌దు. సినిమా క‌థ ప‌రంగా ఎలాంటి వ‌ర్క్ అవ‌స‌ర‌మో దాన్ని తెర‌పై చూపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. `రోజులు మారాయి` టెక్నిషియ‌న్స్ మూవీ. అలాగ‌ని ఈ చిత్రంలో క‌థ‌కు ఎంత అవ‌స‌ర‌మో దాన్ని ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నించాను. ఎక్క‌డా ఎక్స్‌పెరిమెంట్స్ చేయ‌లేదు.

అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు..
- న‌టీన‌టులు చేత‌న్‌, కృతిక‌, పార్వ‌తీశం, తేజ‌స్విలు చ‌క్క‌గా న‌టించారు. అలాగే నిర్మాత శ్రీనివాస‌రావుగారు సినిమాకు ఏం కావాలంటే అది స‌మ‌కూర్చారు. మంచి టీం వ‌ల్లే మంచి అవుట్‌పుట్ రాబ‌ట్ట‌గలిగాం.

దిల్‌రాజు మెచ్చుకున్నారు...
- దిల్‌రాజుగారు నిర్మాత‌ల్లో ఒక‌ర‌ని తెలియ‌గానే ఓ చిన్న టెన్ష‌న్ మొద‌లైంది. సినిమా పూర్త‌యిన త‌ర్వాత ఆయ‌న సినిమా చూశారు. ఆయ‌న సినిమా చూస్తున్నంత సేపు ఎమంటారోన‌ని టీం అంతా టెన్ష‌న్ ప‌డ్డాం. అయితే ఆయ‌న సినిమా చాలా బావుంది. క‌చ్చితంగా హిట్ అవుతుంద‌న‌డంతో అందంర హ్యాపీగా ఫీల‌య్యాం.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌..
- `రోజులుమారాయి` సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా త‌ర్వాత మారుతిగారి బ్యాన‌ర్‌లోనే ఓ సినిమా చేస్తాను. అయితే నాకు మారుతిగారి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయాల‌నుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved