pizza
PG Vinda interview about Gentleman
సాంగ్స్‌, డ్రామా లేకుండా డైరెక్ష‌న్ చేస్తాను - పి.జి.విందా
You are at idlebrain.com > news today >
Follow Us

24 June 2016
Hyderaba
d

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం `జెంటిల్‌మ‌న్‌`. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. సినిమా జూన్ 17న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ పి.జి.విందా మాట్లాడారు. ...

నేప‌థ్యం...
- మాది మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, పాలెంలోని నాగ‌ర్‌క‌ర్నూల్ చిన్నప్ప‌టి నుండి ఆర్ట్స్‌, సైన్స్ అంటే చాలా ఆస‌క్తి ఉండేది. బీచుప‌ల్లిలోని గురుకుల పాఠ‌శాల‌లో చ‌దువుకున్నాను. అక్క‌డ మా డ్రాయింగ్ టీచ‌ర్‌గారు సెల‌వుల్లో సినిమాలు చూపిస్తుండేవారు. అలా నాకు సినిమాలంటే ఆస‌క్తి ఏర్ప‌డింది. శివ‌, గీతాంజ‌లి, అంజ‌లి ఇలా చాలా సినిమాల‌ను చూశాను.

హైదరాబాద్ ప‌య‌నం..
- డిగ్రీ చ‌దివిన త‌ర్వాత హైద‌రాబాద్ చేరుకున్నాను. సంగీత ద‌ర్శ‌కుడు కె.యం.రాధాకృష్ణ నా స్నేహితుడు. అత‌నితో క‌లిసి సినిమాల‌కు సంబంధించి బాగా డిస్క‌స్ చేసేవాడిని. జె.ఎన్‌.టి.యులో ఫోటోగ్ర‌ఫీ పై ఏదో కోర్సు ఉందంటే ఆ కోర్సులో చేరాను. త‌ర్వాత రాజీవ్ మీన‌న్‌గారితో కలిసి కొన్ని యాడ్స్‌కు ప‌నిచేశాను. త‌ర్వాత ల‌జ్జ సినిమాకు మ‌ధు అంబ‌టిగారి వ‌ద్ద చేరాను. ఆయ‌న ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను.

ఇంద్ర‌గంటితో ప‌రిచ‌యం...
ల‌జ్జ సినిమా స‌మ‌యంలోనే ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్ద‌రి అభిప్రాయాలు క‌లిశాయి. అలా త‌న‌తో క‌లిసి గ్ర‌హ‌ణం సినిమాకు ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. ఆ సినిమాకు నాకు చాలా అవార్డ్స్ వ‌చ్చాయి. దాంతో నాలో కాన్ఫిడెంట్ పెరిగింది. త‌ర్వాత అష్టాచమ్మా, వినాయ‌కుడు, బందిపోటు, జెంటిల్‌మ‌న్ స‌హా చాలా సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను.

పూరిగారితో వ‌ర్క్ చేయ‌డం..
- బ‌ద్రి హిందీ రీమేక్ చిత్రానికి నేను అసిస్టెంట్ కెమెరామెన్ అప్పుడు నాకు పూరిగారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. మ‌నం క‌లిసి సినిమా చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. మాట ప్ర‌కార‌మే జ్యోతిల‌క్ష్మీ, లోఫ‌ర్ సినిమాల్లో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది.

జెంటిల్‌మ‌న్ సినిమా గురించి...
- జెంటిల్‌మ‌న్ డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమా చేయ‌డంతో ఇంద్ర‌గంటి మంచి స్టోరీ టెల్ల‌ర్ అని ప్రూవ్ చేసుకున్నారు. సినిమా చేసేట‌ప్పుడు లైటింగ్ విష‌యంలో కేర్ తీసుకున్నాం. డ్రై నేచుర్‌లో ఓరిజిన‌ల్ క‌ల‌ర్స్‌ను చ‌క్క‌గా చూపించాను.

డైరెక్ష‌న్ చేస్తాను...
- అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే సాంగ్స్‌, డ్రామా లేకుండా ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved