pizza
ఆ సినిమా కోసం అన్నిటినీ వదులుకుంటున్నా - పూజాహెగ్డే
You are at idlebrain.com > news today >
Follow Us

16 December 2014
Hyderabad

ఒక లైలా కోసం సినిమాలో నటించిన భామ పూజాహెగ్డే. ఇప్పుడు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పక్కన ముకుందలో నటించింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా గురించి, తన బాలీవుడ్ సినిమా మొహంజొదారో గురించి పూజాహెగ్డే చాలా విషయాలను చెప్పుకొచ్చింది. ఆ వివరాలు...

ప్ర? ముకుందలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
-చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ఒకలైలాకోసంలో మోడ్రన్ గర్ల్ గా కనిపించా. ఈ సినిమాలో ఇంకాస్త ట్రెడిషినల్ గా ఉంటాను. ఈ సినిమాలోని పాత్ర పర్ఫెక్ట్ డాటర్. రావురమేష్ నా తండ్రిగా చేశారు. ఈ సినిమాకు నా పాత్ర సెంటర్. అన్నీ కేరక్టర్లూ నా పాత్ర చుట్టూ తిరుగుతుంటాయి.

ప్ర? వరుణ్ తేజ్ గురించి చెప్పండి?
-మహాభారతంలో కృష్ణుడు పాత్ర ఎంత ముఖ్యమైందో, ఈ సినిమాలో ముకుంద పాత్ర అలాంటిది.

ప్ర? తెలుగు బాగా వచ్చేసిందా? స్టేజ్ మీద ఏకంగా పాటే పాడేశారు?
-నా స్పీచ్ పూర్తి చేశాక పాట పాడమని అడిగితే పాడేశాను. గోపికమ్మ లిరిక్స్ మొదటి నుంచి చివరి వరకు బైహాడ్ చేశాను. బ్యూటీఫుల్ సాంగ్. చూడ్డానికి కూడా చాలా కలర్ ఫుల్ గా బావుంటుంది. కెమెరామెన్ మణి చాలా బాగా చేశారు. రాజుసుందరం కొరియోగ్రఫీ కూడా చాలా బావుంటుంది.

ప్ర? ఒక లైలా కోసం రిజల్ట్ తో హ్యాపీగానే ఉన్నారా?
-ఒకలైలా కోసం రిజల్ట్ తో నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా బావుందని అందరూ మెచ్చకున్నారు. బ్యాలన్స్ గా చేయాల్సిన పాత్ర అది. చూసిన ప్రతి ఒక్కరూ బావుందని అన్నారు.

ప్ర? పెద్ద ఫ్యామిలీ హీరోలతో నటించడం ఎలా అనిపిస్తోంది?
-చాలా ఫన్ గా ఉంది. వరుణ్ చాలా మంచి ఫ్రెండ్. లంచ్, డిన్నర్ కి వెళ్లినప్పుడు మేం ఫుడ్ ని ఎక్సేంజ్ చేసుకునేవాళ్లం. వరుణ్ తన కళ్లతో మాట్లాడగలరు. తను ఒకసారి అలా చూస్తే చాలా మంది భయపడతారు. తన హైట్ 6.4.

ప్ర? దర్శకుడి గురించి చెప్పండి?
-నేను సీతమ్మ వాకిట్లో చూశాను. శ్రీకాంత్ నాకు ఈ కథ చెప్పినప్పుడే వావ్ అనిపించింది. చాలా మంచి నెరేటర్ అతను. సీన్ ఎలా చేయాలో చెప్పడు శ్రీకాంత్. మనల్ని చేయనిస్తాడు. దానివల్ల నేచురల్ గా అన్నీ వస్తాయి. కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి చిన్న డీటైల్ ను తను గమనిస్తుంటారు. ధరదమ్ పాట కోసం నా కాస్ట్యూమ్ ని అతనే సెలక్ట్ చేశాడు.

ప్ర? మొహంజదారో గురించి?
-జనవరిలో మొదలవుతుంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. కొన్ని ఫోటో షూట్ లు కూడా చేశాం. దాదాపు ఐదునెలలు ఈ సినిమా సెట్స్ లోనే ఉంటా. ఎక్కువగా గుజరాత్ లో చిత్రీకరిస్తారు.

ప్ర? మీ పాత్ర పరంగా రీసెర్స్ ఏమన్నా చేశారా?
-అషుతోష్ గోవారికర్ అంతా చేసేశాడు. సెట్స్ నుంచి ప్రతి ఒక్కటీ అతనికి తెలుసు. నా కాస్ట్యూమ్ డిజైనర్ ఆల్రెడీ ఆస్కార్ నామినేటెడ్ వ్యక్తి. కాబట్టి వాళ్లు మొత్తం చూసుకుంటున్నారు. స్కూల్లో మొహంజదారో గురించి చదివాం. కానీ నేను హిస్టరీ క్లాసుల్లో నిద్రపోయేదాన్ని అనుకుంటా. పెద్దగా గుర్తులేదు.

ప్ర? ఆ సినిమాకు ఎలా ఎంపికయ్యారు?
-సునీత గోవారికర్ నా యాడ్ ని చూసి నన్ను సంప్రదించారు. ఆ తర్వాత ఆమెని, అశుతోష్ ని ఇంటర్వ్యూ కోసం కలిశాను.

ప్ర? మిమ్మల్ని ఫైనల్ చేసిన తర్వాత ఎలా ఫీలయ్యారు?
-ఆ ఫీలింగ్ ని నెర్వస్ అని చెప్పకూడదు. అంత కన్నా ఎక్కువైనదే. లగాన్ లాంటి సినిమాను నేను థియేటర్లో చూశాను. అలాంటి వ్యక్తితో పనిచేస్తామని ఎప్పుడూ అనుకోం. అశుతోష్ ని కలిసిన గంట సేపులో చాలా మంచి టీచర్ అనిపించింది. నేను మణిరత్నంగారిని కూడా కలిశా. ఆయన కూడా అంతే గొప్పవాడు.

ప్ర? మీరు స్క్రిప్ట్ ని ఎలా ఎంపిక చేసుకుంటారు?
-ప్రస్తుతం వస్తున్న సినిమాలు చేస్తున్నా. నేను గ్లామర్ అయినా చేస్తాను. కథ విని ఓకే చేస్తానంతే.

ప్ర? ప్రస్తుతం స్క్రిప్ట్ లు వింటున్నారా?
-దాదాపు ఐదు నెలల తర్వాత వింటాను. అప్పటిదాకా ఖాళీగా ఉండను కదా. ఆ తర్వాత కూడా తెలుగు వాళ్లు నన్ను చూడాలనుకుంటే, దర్శకులు నాకోసం కథలు రాస్తే.

ప్ర? నాగబాబును కలిశారా?
-కలిశాను. వరుణ్ హైట్, పర్సనాలిటీ వాళ్ల నాన్నగారిదే అనిపిస్తుంది. నాగబాబుగారితో పెద్దగా మాట్లాడలేదు.

ప్ర? చాలా సినిమాలు వదులుకున్నట్టున్నారు?
-నేను చిన్నతనం నుంచి మణిరత్నం సినిమాలు చూస్తున్నా. ఆయన నా డ్రీమ్ డైరక్టర్. అలాంటిది ఇటీవల మణిరత్నం సినిమాను వదులుకున్నా. ఓ కన్నడ సినిమాను వదులుకున్నా. ముకుంద సినిమాలోని అరెరె చంద్రకళ పాట నిన్ననే పూర్తయింది. ఇప్పుడు నా మనసంతా మహంజొదారో పైనే ఉంది.

ప్ర? ఈ సినిమాలో మీ పేరు చంద్రకళ?
-కాదు. ఈ సినిమాలో నా పేరు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు. శ్రీకాంత్ అడిగి చెప్పండి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved