pizza
Prabhakar interview (Telugu) about Brand Babu
ఆయ‌న పేరు నాకు ప్ల‌స్ అవుతుందే కానీ.. మైనస్ కాదు - ప్ర‌భాక‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 August 2018
Hyderabad

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రభాకర్‌.పి దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం 'బ్రాండ్‌బాబు'. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేస్తూ....

- నేను డైరెక్ట్ చేసిన తొలి చిత్రం `నెక్స్‌ట్ నువ్వే` పెద్ద డిసప్పాయింట్ చేసింది. అందుకు కార‌ణం. సీరియ‌ల్స్ ద్వారా నాకు ఫ్యామిలీ, చిన్న పిల్ల‌లు అభిమానుల‌య్యారు. అటువంటి వారిని నేను థియేట‌ర్స్‌కి ర‌ప్పించ‌లేక‌పోయాను. త‌మిళ సినిమాను చూసిన నాకు సినిమా బాగా న‌చ్చింది. ప్ర‌తి సీన్‌ను కామెడీతో ఉండేలా చూసుకుని స‌న్నివేశాల‌ను రాసుకున్నాం. కానీ.. హార‌ర్ సినిమా కావ‌డంతో దానికి ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఎ స‌ర్టిఫికేట్ అంటే పెద్దల‌కు మాత్ర‌మే అని అనుకున్నారేమో కాబోలు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌, పిల్లలు నా సినిమాకు రాలేదు.

- నా తొలి డైరెక్ట్ చేసే స‌మ‌యంలో నేను బాగా డైరెక్ట్ చేస్తున్నాన‌ని బ‌న్ని వాసుగారు, ఎస్‌.కె.ఎన్ వంటివారు మారుతిగారికి చెప్ప‌డం వ‌ల్ల‌.. ఆయ‌న త‌యారు చేసుకున్న `బ్రాండ్‌బాబు` క‌థ‌ను నాకు అప్ప‌గించారు. న‌న్ను డైరెక్ట్ చేయ‌మ‌న్నారు. ఆయ‌న చ‌క్క‌గా వండిన వంట‌ను ప్రేక్ష‌కులకు అందంగా వడ్డించ‌డ‌మే నా ప‌ని అన్న‌ట్లు `బ్రాండ్‌బాబు` సినిమాను డైరెక్ట్ చేశాను. సినిమా బౌండెడ్ స్క్రిప్ట్‌తో మారుతిగారు నాకు అప్ప‌గించారు. అయితే..షూటింగ్ స‌మ‌యంలో ఎక్క‌డైనా ఎన్‌హెన్స్ చేయాల‌నిపిస్తే.. చేస్తాను. న‌చ్చితే ఉంచుకోండి.. లేకుంటే ఎడిటింగ్‌లో తీసేయండ‌ని చెప్పాను. మారుతిగారు స‌రేన‌ని చెప్పారు. నేను ఎన్‌హెన్స్ చేసిన త‌ర్వాత కొన్ని సీన్స్ ఆయ‌న‌కు న‌చ్చిన‌వి ఉంచుకున్నారు.. రెండు, మూడు చోట్ల ఎడిటింగ్‌లో క‌ట్ చేశారంతే.

- మారుతిగారు ఒక బ్రాండ్‌. ఆయ‌న వ‌ల్ల నాకు పేరు వ‌స్తే ప్ల‌స్ అవుతుందే కానీ మైన‌స్ కాదు. రేపు సినిమా చూసిన ఆడియెన్స్‌కు సినిమా మారుతిగారే డైరెక్ట్ చేశార‌నేలా ఉంటుంది. ఈ సినిమాలో ఓ రోజు అంటే.. ఒక‌టిన్న‌ర సీన్‌ను ఆయ‌నే డైరెక్ట్ చేశారు. దానికి ప్ర‌ధాన కార‌ణం. సినిమాటోగ్రాఫ‌ర్‌.. నా బ్ర‌ద‌ర్ చ‌నిపోయారు. నేను వెళ్లాల్సిన ప‌రిస్థితి. మారుతిగారు షూటింగ్ క్యాన్సిల్ చేయ‌మ‌న్నారు. కానీ నాకు అలా క్యాన్సిల్ చేయ‌డం ఇష్టం లేదు. అందుక‌ని ఆయ‌న్నే డైరెక్ట్ చేయ‌మ‌ని నేను కోర‌డంతో ఆయ‌నే ఆరోజు షూటింగ్‌ను డైరెక్ట్ చేశారు.

interview gallery- మారుతిగారు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించారు. షూటింగ్ స‌మ‌యాల్లో లొకేష‌న్‌కు వ‌చ్చేవారు. కానీ షూటింగ్‌లో ఎక్క‌డా వేలుపెట్ట‌లేదు.

- బ్రాండ్ బాబు సినిమా విష‌యానికి వ‌స్తే.. నిజ జీవితంలో బ్రాండ్స్ అంటే ఇష్ట‌ప‌డేవారిని చూసుంటాం. అలాంటి వారి క్యారెక్ట‌ర్‌ను కాస్త అతిగా చూపిస్తూ.. ఎట‌కారంగా ప్రొట్రేట్ చేస్తూ తీసిన సినిమా ఇది. ఇలా చేయ‌డం వెనుకు ఆడియెన్స్‌ను న‌వ్వించ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం.

- సుమ‌త్ శైలేంద్ర క‌న్న‌డంలో నాలుగు సినిమాలు చేసినా.. తెలుగులో డెబ్యూ హీరోలాగా క‌ష్ట‌ప‌డ్డాడు. లుక్‌లో జెన్యూనిటీ తెలియాల‌ని జిమ్‌కు వెళ్లాడు. డైలాగ్స్‌ను ముందుగానే ప్రాక్టీస్ చేసుకున్నాడు. సినిమాలో బ్రాండ్‌బాబు అనే క్యారెక్ట‌ర్‌కు సుమంత్ శైలేంద్ర కరెక్ట్‌గా యాప్ట్ అవుతాడు. హోం మినిష్ట‌ర్ కూతరిని ప్రేమించాల‌నుకునే హీరో.. వాళ్లింటి ప‌ని మ‌నిషిని ప్రేమిస్తాడు. చివ‌ర‌కు ప‌రిస్థితులు ఎలా మారాయ‌నేదే క‌థ‌.

- నా ద‌గ్గ‌ర 7-8 స్ర్కిప్ట్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్స్ అన్ని నా స్టైల్ ఆఫ్ ఎమోష‌న్స్‌తో ఉంటాయి. వాటితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు కోరిన‌ప్పుడు త‌ప్ప‌కుండా సినిమా చేస్తాను. త‌దుప‌రి మారుతిగారు మ‌రో సినిమా చేద్దామ‌న్నారు. అలాగే జ్ఞాన‌వేల్ రాజ‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో మ‌రో సినిమా చేయాల్సి ఉంది.


 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved