pizza
Pragya Jaiswal interview (Telugu) about Gunturodu
నేను చేసిన తొలి మాస్ సినిమా ఇది - ప్రగ్యా జైశ్వాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2017
Hyderabad

`కంచె` చిత్రంలో జమీందారుగారి అమ్మాయి సీతాదేవిగా న‌టించింది ప్ర‌గ్యా జైశ్వాల్‌. ఆ త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావుగారి ద‌ర్శ‌క‌త్వంలో `ఓం న‌మో వేంక‌టేశాయ‌`లో చేసింది. తాజాగా మంచు మ‌నోజ్‌తో ఆమె న‌టించిన `గుంటూరోడు` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌గ్యా జైశ్వాల్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు.

* చాలా సంతోషంగా ఉన్న‌ట్టున్నారు?
- అవునండీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను. చేతినిండా ప‌ని ఉన్న‌ప్పుడు ఆనందంగానే ఉంటాం క‌దా.

* ఒక్క‌సారిగా స్పెష‌ల్ సినిమాల నుంచి మామూలు సినిమాల్లోకి వ‌చ్చేశారు?
- నిజంగానే. నా పేరు గుర్తుకురాగానే చాలా స్పెష‌ల్ సినిమాలే గుర్తుకువ‌చ్చేవి. ఇప్పుడు గుంటూరోడు న‌న్ను ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌ని చేసింది.

Pragya Jaiswal interview gallery

* గుంటూరోడు ప్రేమ‌లో ప‌డేది మీతోనేనా?
- వెయ్యి శాతం నాతోనే. నాతో ప్రేమ‌లోప‌డ్డ‌వాడు, నాకోసం ఏం చేశాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

* యాక్ష‌న్ సీక్వెన్స్ ఇందులో కొత్త‌గా ఉన్నాయ‌ని అంటున్నారు?
- మంచు మ‌నోజ్ కెరీర్‌లోనే ఇలాంటి యాక్ష‌న్ సీక్వె.న్స్ లేవ‌ట‌. అంత గొప్ప‌గా చేశార‌ట ఇందులో. సో ఈ మూవీ చాలా స్పెష‌ల్‌.

* మీ గ‌త చిత్రాల‌కు ఈ సినిమాకు ప‌నిచేయ‌డంలో తేడా ఏమైనా గ‌మ‌నించారా?
- ఎందుకు ఉండ‌దు.. చాలా ఉంటుంది. క్రిష్ 24 గంట‌లూ ప‌నిమీదే ధ్యాస‌. ఆ సెట్‌లో నిజంగా ఏదో గొప్ప జోక్ పేలితేగానీ ఎవ్వ‌రూ న‌వ్వ‌రు. అంద‌రూ అంత సీరియ‌స్‌గా ప‌నిచేసుకుంటూ వెళ్తారు. కృష్ణ‌వంశీగారి సెట్‌లోనూఅంతే. అయితే గుంటూరోడు సినిమా సెట్లో అంత‌కు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. సెట్లో ఎవ‌రైనా ఏమూల‌నైనా న‌వ్వుతూ క‌నిపించారే అనుకో వెంట‌నే మ‌నం గుర్తుప‌ట్టేయ‌వ‌చ్చు మ‌నోజ్ వ‌చ్చేశార‌ని. అంత స‌ర‌దా మ‌నిషి మా హీరో. షాట్ రెడీ అన‌గానే సెక‌న్ల‌లో ఆయ‌న సినిమా మూడ్‌లోకి వెళ్తారు. అది చాలా క‌ష్ట‌మైన ప‌ని. అంద‌రికీ సాధ్యం కాదు.

* న‌క్ష‌త్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాను. ఫ‌క్తు కెవీ సార్ పోలీస్‌గా క‌నిపిస్తాను. ప్ర‌స్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ చేస్తున్నాం.

* త‌దుప‌రి సినిమాలేంటి?
- కొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

* `గుంటూరోడు`లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నా పేరు అమృత‌. ఫ‌క్తు గుంటూరు గ‌ర్ల్ గా క‌నిపించా. ట్రెండీగా ఉంటా.

* గుంటూరుకు ఎప్పుడైనా వెళ్లారా?
- ఈ సినిమా కోసం వెళ్ల‌లేదు. కానీ ఇంత‌కు ముందు మాత్రం వెళ్లాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved