pizza
Priya Vadlamani interview (Telugu) about Hushaaru
ఏదైనా కేరక్టర్‌ని బట్టే చేస్తా - ప్రియా వడ్లమాని
You are at idlebrain.com > news today >
Follow Us

19 December
Hyderabad

‘ప్రేమకు రెయిన్ చెక్‌’, ‘శుభలేఖ+లు’, ‘హుషారు’ చిత్రాలతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి ప్రియా వడ్ల‌మాని. పుట్టిపెరిగింది హైదరాబాద్‌లో అయినా, గ్రాడ్యుయేషన్ బెంగుళూరులో చదివింది. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ప్రియా వడ్లమాని హీరోయిన్గా నటించిన ‘హుషారు’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా గురించి ఆమె చెప్పిన విషయాలు...

* ‘హుషారు’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారా?
- ఎలా ఎంజాయ్‌ చేయాలో కూడా తెలియడం లేదు. మాది చాలా సింపుల్‌ ఫ్యామిలీ. నేను చాలా సింపుల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తా. అందుకే ఈ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేయాలో కూడా తెలియడం లేదు. సినిమాను ఇంకెంత బాగా ప్రమోట్‌ చేయొచ్చా అనేది మాత్రం ఆలోచిస్తున్నా. అయితే ఒకటి.. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నా.

*‘హుషారు’ సక్సెస్‌ కోసం వెయిట్‌ చేశారన్నమాట..
- నిజమే. ‘హుషారు’ ఎలా ఉంటుందోననే టెన్షన్ మాత్రం ఉండేది.

* డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌ టు యాక్టింగ్‌ ఎలా అనిపించింది?
- నేను వంశీ పైడిపల్లిగారి దగ్గర ‘మహర్షి’ సినిమాకు ప్రీ ప్రొడక్షన్లో రెండు నెలలు చేశానంతే. అప్పుడే నాకు శుభలేఖ+లు, హుషారు అవకాశాలు వచ్చేశాయి. ఇటు టర్న్‌ అయ్యా.

*భవిష్యత్తులో డైరక్షన్ చేస్తారా?
- ప్రస్తుతానికి నా మనసంతా యాక్టింగ్‌ మీదే ఉంది. ఫ్యూచర్‌ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు.

* నటనలో ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా?
- లేదండీ. ‘హుషారు’ కోసం ముందుగా కొన్ని వర్క్‌షాప్‌లు జరిగాయి. కెమెరాను ఎలా ఫేస్‌ చేయాలి? శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఎలా ఉంచుకోవాలి వంటి విషయాలు నేర్పించారు.

interview gallery



* మీరు క్లాసికల్‌ డ్యాన్సర్‌ అట కదా?
- అవునండీ. నేను 12 ఏళ్లు డ్యాన్స్ నేర్చుకున్నా.

* మీ పేరెంట్స్‌ ఏం చేస్తుంటారు?
- నాన్న ప్లై వుడ్‌కి సంబంధించిన బిజినెస్‌ చేస్తుంటారు. అమ్మా, పెద్దమ్మా కలిసి హాస్టల్‌ నడుపుతున్నారు. నా అభిప్రాయాలకు విలువిస్తారు మా వాళ్లు. మాది అచ్చ తెలుగు కుటుంబం.

*తెలుగు హీరోయిన్లకు ఇండసీ్ట్రలో అవకాశాలెలా ఉన్నాయి?
- తెలుగు హీరోయిన్లా? మరొకరా? అనేది కాదండీ. ఎవరికైనా అవకాశాలు బాగానే ఉంటాయి. కాకపోతే మన దగ్గర టాలెంట్‌ ఉండాలంతే. ప్రతిభ ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయి.

* తెలుగమ్మాయిగా మీరు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా?
- ఒకటీ రెండు సార్లు మాత్రం కొందరు తెలుగమ్మాయిలు వద్దండీ అని అన్నట్టు తెలిసింది. మరికొందరైతే ముంబై నుంచి వచ్చామని చెప్పమన్నారు. ఇంకొందరు సర్‌నేమ్‌ మార్చుకోమని కూడా సలహా ఇచ్చారు. అదేమీ చేయకపోయినా ‘హుషారు’, ‘శుభలేఖ+లు’, ‘ప్రేమకు రెయిన్ చెక్‌’ వంటి అవకాశాలు వచ్చాయి. కాబట్టి నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. ‘హుషారు’ డైరక్టర్‌లాంటి వారు వెతికి వెతికి తెలుగు అమ్మాయిలకే అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఉండటం నా అదృష్టం.

* ‘శుభలేఖ+లు’లో సిగరెట్‌ కాల్చినట్టున్నారు.. ఇందులో లిప్‌లాక్‌లున్నాయి..
- ఏదైనా కేరక్టర్‌ కోసమేనండీ. కావాలని అలాంటి పనులు నేను చేయనుగా. పరిస్థితి ఇలా ఉందని మా ఇంట్లో వాళ్లతో చెప్పా. వాళ్లు కూడా బోల్డ్‌ మైండ్‌తో అర్థం చేసుకున్నారు. నా ఫ్రెండ్స్‌కి, నా ఫ్యామిలీకి నేనేంటో తెలుసు. అందువల్ల సబ్జెక్టులను ఓకే చేసేటప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

* ఇప్పుడు ఏమేం సినిమాలు చేస్తున్నారు?
- తమిళ్‌లో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. తెలుగులో టాక్స్‌ జరుగుతున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved