pizza
PS Mithran interview (Telugu) about Abhimanyudu
ఆలోచ‌న అలా వ‌చ్చిందే - మిత్ర‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 May 2018
Hyderabad

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్‌ 1న 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా `అభిమ‌న్యుడు` సినిమా గురించి ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ మాట్లాడుతూ ...

- నేను పెద్ద దర్శకుల వద్ద పనిచేయలేదు. ముంబైలో చాలా యాడ్స్‌కు పనిచేశాను. అక్కడి నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నా స్నేహితులైన సినిమాటోగ్రాఫర్‌ జార్జ్‌ విలియమ్స్‌, ఎడిటర్‌ రూబెన్స్‌ సహకారంతో ఈ సినిమా అవకాశం కలిగింది.

interview gallery



- ఒకసారి నేను, నా స్నేహితుడు మాట్లాడుకుంటూ ఉండగా.. నా స్నేహితుడి అకౌంట్‌ నుండి నలబై వేల రూపాయలు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ముందు షాకయ్యాం. బ్యాంకుకి వెళ్లాం. అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. మేం కంప్లైంట్‌ ఇస్తే వారు సాధారణంగా రియాక్ట్‌ అయ్యారు. నాకు ఈ పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అలా ఆ సమయంలో నాకు ఐడియా వచ్చింది. కథ తయారు చేసుకున్న తర్వాత హీరో దొరికితే నిర్మాత దొరకడం లేదు.. నిర్మాత దొరికితే హీరో దొరకడం లేదు. ఆ సమయంలో నా స్నేహితులు జార్జ్‌ విలియమ్స్‌, రూబెన్స్‌ సహకారంతో హీరో, నిర్మాత అయిన విశాల్‌గారిని కలిశాను. కథ విన్న ఆయన పది నిమిషాల్లోనే సినిమా చేయడానికి ఎస్‌ చెప్పాడు. ఆయన సినిమా బిగ్‌ వేలో చేయాలనుకున్నాడు. ఆయన వల్ల యువన్‌, జార్జ్‌విలియమ్స్‌ తదితరులు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

- నిరసన చేయడానికి ఓ కారణం ఉండాలని నేను భావిస్తాను. సినిమా విడుదల కాలేదు.. ఎవరూ చూడలేదు. అయినా సినిమాకు నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి. మా సినిమాకు అలాంటి నిరసన ఎదురైంది. కానీ నేను పెద్దగా తీసుకోలేదు.

- యూనివర్సల్‌ కంటెంట్‌తో రూపొందిన సినిమా ఇది. తెలుగులో సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారని తెలుసు. సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటారు.

- స్క్రిప్ట్‌ తయారవుతుంది. పూర్తి కాగానే సీక్వెల్‌ చేస్తాం. ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ సమయంలో నాకు దొరికిన కంటెంట్‌లో 20 శాతం మాత్రమే సినిమాలో చూపించాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved