pizza
Puri Jagannadh interview (Telugu) about ISM
క‌ల్యాణ్‌రామ్‌లో నిజాయ‌తీ, నిబ‌ద్ధ‌త క‌నిపించాయి - పూరి ఇంట‌ర్వ్యూ
You are at idlebrain.com > news today >
Follow Us

19 October 2016
Hyderaba
d

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా సినిమా `ఇజం`. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై రూపొందింది. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టిస్తూ, నిర్మించారు. ఈ నెల 21న విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి పూరి జ‌గ‌న్నాథ్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `ఇజం` జ‌ర్న‌లిజానికి సంబంధించిన క‌థేనా?
- అవునండీ. ఓ సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ క‌థే `ఇజం`. ఓ ఐడియాల‌జీ, థియ‌రీ ఉన్న జ‌ర్న‌లిస్టు అవినీత‌మ‌య‌మైన స‌మాజంలో ఎలాంటి పోరాటాన్ని సాగించాడు అనేది కీల‌కం. కేవ‌లం స‌మ‌స్య‌నే కాదు, ఈ చిత్రంలో ప‌రిష్కారాన్ని కూడా చూపించాం.

* దేని మీద పోరాటం?
- క‌రెప్ష‌న్ మీద పోరాటం. గ‌తంలో `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` సినిమా కూడా జ‌ర్న‌లిస్టును బేస్ చేసుకుని చేసిన సినిమానే. కాక‌పోతే అందులో రాజ‌కీయ నేప‌థ్యం ఉంటుంది. పాలిటిక్స్ లో లోపాల‌ను చూపించాం. గ‌తంలో జ‌ర్న‌లిజానికి సంబంధించి వ‌చ్చిన సినిమాల‌న్నిటికీ ఇది పూర్తిగా వైవిద్యంగా ఉంటుంది. కొత్త‌గానూ సాగుతుంది.

* వికీలీక్స్ ఇన్ స్ప‌యిర్ చేసిందా?
- ఈ క‌థ నా ద‌గ్గ‌ర పదేళ్లుగా ఉంది. నా ద‌గ్గ‌ర ఇంకో ప‌దేళ్ల‌కు స‌రిప‌డా క‌థ‌లున్నాయి. మామూలుగా క‌థ‌ల‌ను రెండు వారాల్లో రాస్తే ఈ క‌థ‌ను మూడు వారాల్లో రాశా. కాసింత శ్ర‌ద్ధ‌పెట్టా. కాక‌పోతే నా ద‌గ్గ‌రున్న ప్ర‌తి క‌థ‌నూ ఎప్ప‌టిక‌ప్పుడూ అప్‌డేట్ చేసుకుంటూ ఉంటా. అలా ఈ చిత్రంలోనూ అప్‌డేట్స్ జ‌రిగాయి. వికీలీక్స్ ప‌బ్లిష‌ర్ ను స్ఫూర్తిగా తీసుకుని క‌ల్యాణ్‌రామ్ పాత్ర‌ను తీర్చిదిద్దా.

* క‌ల్యాణ్‌రామ్‌కి స‌రిపోతుంద‌ని ఎందుక‌నిపించింది?
- క‌ల్యాణ్‌రామ్ ముఖంలో నాకు నిజాయ‌తీ, నిబ‌ద్ధ‌త క‌నిపించాయి. జ‌ర్న‌లిస్ట్ పాత్ర చేసే న‌టుడికి అవి చాలా ముఖ్యం. అత‌ను డైలాగులు చెబుతున్నా, అవి సినిమా డైలాగుల్లాగా క‌నిపించ‌కూడ‌ద‌ని అనుకున్నా. అందుకే నేను క‌ల్యాణ్‌రామ్‌కి ఈ క‌థ‌ను చెప్పా. నేన‌నుకున్న‌దానిక‌న్నా చాలా బాగా చేశారాయ‌న‌.

Puri Jagannadh interview gallery

* సిక్స్ ప్యాక్ చేయ‌మ‌ని మీరే చెప్పారా?
- నేను సిక్స్ ప్యాక్ చేయ‌మ‌ని చెప్ప‌లేదండీ. జ‌ర్న‌లిస్ట్ అనే వ్య‌క్తి పొట్ట వేసుకుని డైలాగులు చెప్తే బావుండ‌దండీ. కాసింత ఫిట్‌గా ఉంటే బావుంటుంద‌ని చెప్పా. ఆయ‌న దాన్ని సీరియ‌స్‌గా తీసుకుని ప‌ద్నాలుగు కిలోలు త‌గ్గారు. ఆ ఫిట్‌నెస్‌తో పాటు సినిమాలో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమాతో క‌ల్యాణ్‌రామ్ రెండు రాష్ట్రాల్లోనూ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును ద‌క్కించుకోవ‌డం ఖాయం.

* అందుకేనా కోర్టు సీన్ల‌న్నీ నంద‌మూరి ఖాతాలోనే ఉన్నాయ‌ని అంటున్నారు?
- క్లైమాక్స్ లో పావు గంట పాటు కోర్టు స‌న్నివేశం ఉంటుంది. సినిమాకు హైలైట్ ఇది. అందులో అద్భుతంగా న‌టించారు.

* `ఇజం`తో కొత్త పూరిని చూస్తార‌ని క‌ల్యాణ్‌రామ్ అన్నారు.. మీరేమంటారు?
- అదే మాట ఆయ‌న నాతోనూ అన్నారు. హ్యాపీగా ఫీల‌య్యాను.

* వ‌ర్మ‌గారికి చూపించారా?
- లేదండీ. ఆయ‌న స‌ర్కార్ 3 తో బిజీగా ఉన్నారు. మామూలుగా మేం ఒక‌రి సినిమాలు ఒక‌రం చూడం. కాక‌పోతే ఈ ట్రైల‌ర్ ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. విడుద‌ల త‌ర్వాత నేను ఆయ‌న‌కు సినిమా చూపించాల‌నుకుంటున్నా.

* ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారా?
- ఇంకా ఖ‌రారు కాలేదండీ. ఇంకో వారంలో చెబుతా.

* ఆ మ‌ధ్య మ‌హేష్‌తో సినిమా అన్నారు?
- ఆయ‌న‌కు జ‌న‌గ‌ణ‌మ‌న అనే స్క్రిప్ట్ చెప్పా. అప్పుడ న‌చ్చింద‌న్నారు. కానీ ఆ త‌ర్వాత ఇంకా ఆయ‌న నాతో ఏమీ అన‌లేదు.

* `రోగ్ ` ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది?
- తెలుగు, క‌న్న‌డ‌లో తీస్తున్నాం. డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తాం.

* పూరి క‌నెక్ట్స్ గురించి చెప్పండి?
- కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఈ సంస్థ పెట్టాం.

* బాలీవుడ్‌లో అవ‌కాశాలు వ‌స్తున్నా... వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?
- అక్క‌డ సినిమాలు వ‌స్తున్నాయి.. కానీ ఏదీ అనుకున్న స్థాయిలో స్పీడ్‌గా ముందుకు పోవ‌డం లేదు. అక్క‌డ చేయాలంటే ఆరు నెల‌లు ఆగాలి. అప్ప‌టిదాకా తెలుగు సినిమాల‌కు దూర‌మ‌వ్వాలి. టెంప‌ర్ అభిషేక్‌బ‌చ్చ‌న్‌తో చేద్దామ‌న్నా. అంత ఎమోష‌న్‌ను పండించ‌లేను. వ‌ద్ద‌న్నాడు. దాంతో ఆగాను.

* భ‌విష్య‌త్తులో ఎలాంటి సినిమాలు చేయాల‌ని ఉంది?
- ఇక్క‌టి వాళ్ల‌ను, విదేశీ న‌టుల‌ను క‌లిపి క్రాస్ ఓవ‌ర్ సినిమా చేయాల‌ని ఉంది.

* ఆకాష్‌తో సినిమా ఎప్పుడుంటుంది?
- ఇప్పుడు ఇంట‌ర్మీడియేట్ చ‌దువుతున్నాడు. ఇంకోమూడేళ్ల త‌ర్వాత చేస్తా.

* ర‌వితేజ‌తో సిని ఎప్పుడుండొచ్చు?
- అత‌ను ఇప్పుడు సినిమా చేసే మూడ్‌లో లేడు. ప్ర‌పంచం అంతా తిరిగే మూడ్‌లో ఉన్నాడు. `పూరి సినిమాలు ఆపేయ్‌. ఒక‌సారి విదేశాలు చుట్టొద్దాం` అని అంటున్నాడు. గ‌త 15ఏళ్లుగా నిర్విరామంగా ప‌నిచేశాం మేమిద్ద‌రం.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved