pizza
Puri Jagannadh interview (Telugu) about Rogue
`రోగ్` ఒక క్యూట్ ల‌వ్‌స్టోరీ - పూరి జ‌గ‌న్నాథ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 March 2017
Hyderabad

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమాను మార్చి 31న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌తో ఇంట‌ర్వ్యూ.....

క్యూట్ ల‌వ్ స్టోరీ....
- ఇషాన్ `రోగ్‌`తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. డెబ్యూ హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ మూవీగా ఓ క్యూట్ ల‌వ్‌స్టోరీ అయితే బావుంటుంది అనిపించి చేసిన క్యూట్ ల‌వ్ స్టోరీయే `రోగ్‌`.ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్స్ చేశారు. విల‌న్ అనూప్ సింగ్ ఠాకూర్ కూడా కొత్త‌వాడే.

క‌థ గురించి...
- సినిమా క‌లక‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతుంది. అలాగే హైద‌రాబాద్‌,బెంగ‌ళూరుల్లో కూడా సినిమాను చిత్రీక‌రించాం.

టైటిల్ గురించి...
- ఇడియ‌ట్ అనే టైటిల్ పెట్టిన‌ప్పుడు చాలా మందికి అర్థం కాక‌పోవ‌చ్చున‌ని చంటిగాడి ప్రేమ‌క‌థ అని ట్యాగ్‌లైన్ పెట్టాను. ఇప్పుడు రోగ్ కూడా అలా క‌నెక్ట్ కావాల‌నే ట్యాగ్ లైన్‌పెట్టాను. నేను చాలా రోజుల త‌ర్వాత చేసిన ల‌వ్ స్టోరీ రోగ్‌. ఇడియ‌ట్‌లో హీరో చాలా యార‌గెంట్‌గా ఉంటే, రోగ్ చిత్రంలో చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఇద్ద‌రి చంటిగాళ్ళ‌కు తేడా ఉంటుంది.

నిర్మాత‌లే అడిగారు...
- నేను హీరోల‌ను ఎలివేట్ చేసే తీరు బావుంటుంద‌ని నిర్మాత‌లు న‌మ్మి, ఒక మాస్ హీరోలా ఇషాన్‌ను ప‌రిచ‌యం చేయ‌మ‌ని అడిగారు. అందుకే ఇషాన్‌ను రోగ్‌లో నా స్టైల్లో ర‌ఫ్‌గా చూపించాను.

Puri Jagannadh interview gallery

న‌మ్మి వెళ్ళిపోతుంటాను...
- నేను క‌థ రాసుకుని, నిర్మాత‌ల‌కు, హీరోకు చెప్పిన‌ప్పుడు వాళ్ళు ఎగ్జ‌యిట్ అయితే సినిమాను చేసేస్తాను. సినిమా చేసే స‌మ‌యంలో క‌థ‌ను న‌మ్ముకునే ఓ గ‌ట్ ఫీలింగ్‌తో వెళ్ళిపోతుంటాను. పోకిరి సినిమా చేసే స‌మ‌యంలో ఒక మంచి సినిమా తీస్తున్నాన‌ని న‌మ్మాను కానీ, ఏదో రికార్డుల‌ను క్రియేట్ చేసేంత పెద్ద సినిమా అవుతుంద‌ని అనుకోలేదు. ఒక సినిమా స‌క్సెస్ అనేది ఆ సినిమాతో పాటు విడుద‌లైన‌ వేరే సినిమాలు విడుద‌ల‌, అప్ప‌టి ప‌రిస్థితులు డిసైడ్ చేస్తాయి.అన్నీ సినిమాలు అనుకున్న ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేవు. హాలీవుడ్‌లో షాన్‌ఫీల్డ్ అనే గొప్ప స్క్రీన్‌ప్లే రైట‌ర్ ఉన్నారు. కొత్త ద‌ర్శ‌కులంతా ఆయ‌న ర‌చ‌న‌ల‌ను ఫాలో అవుతుంటారు. ఆయ‌న రాసిన రెండు క‌థ‌ల‌నుడైరెక్ట్ చేస్తే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

చేంజ్ చేస్తే నాకు సినిమాలుండ‌వు...
- నా సినిమాల్లో హీరోలు చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉంటారు. నా సినిమా హీరోల‌ను ప్ర‌జెంట్ చేసే తీరు మార్చితే నాకు సినిమాలుండ‌వు.

ఇషాన్ మంచి స్టార్ అవుతాడు...
- ఇషాన్ మంచి హ్యండ్స‌మ్ ప‌ర్స‌నాలిటీ. మంచి పెర్‌ఫార్మ‌ర్‌. స్ర్క్రీన్ ప్రెజ‌న్స్ బావుంటుంది. రోగ్ సినిమాను నేను చాలా మందికి చూపించాను. చూసిన వాళ్ళంద‌రూ ఇషాన్‌ను అప్రిసియేట్ చేశారు. ఇలాంటి హీరోకు రెండు, మూడు హిట్స్ ప‌డితే త‌ను స్టార్ హీరోగా ఎదుగుతాడు.

బాలకృష్ణ సినిమా గురించి...
- బాల‌కృష్ణ‌గారిని నా సినిమాలో కొత్త‌గా చూపిస్తున్నాను. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌. చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉండే డైన‌మిక్ రోల్‌. ఆయ‌న డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయి. బాల‌కృష్ణ‌గారితో ఐదేళ్ళ క్రిత‌మే సినిమా చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది. ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ను అనుకోలేదు. ముస్కాన్ అనే హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేస్తాం. సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఆయ‌న చాలా హ్యాపీగా ఉన్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం.

త‌దుప‌రి చిత్రం...
- మెగాస్టార్ చిరంజీవిగారు త‌ప్ప‌, మెగా హీరోల‌తో సినిమాలు చేశాను. రీసెంట్‌గా ఆయ‌న్ను వెళ్ళి క‌లిశాను. ఇప్పుడు బాల‌కృష్ణ‌గారితో సినిమా చేస్తున్నాను క‌దా..దాని త‌ర్వాత ఏ విష‌య‌మ‌నేది చెబుతాను. అలాగే వెంక‌టేష్‌గారి సినిమా కూడా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. త‌దుప‌రి ఏ సినిమా అనేది ప్ర‌స్తుతం చేస్తున్న బాల‌కృష్ణ‌గారి సినిమా త‌ర్వాతే చెబుతాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved