pizza
Raai Laxmi interview (Telugu) about Where Is The Venkatalaxmi
తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్నాను - రాయ్‌ల‌క్ష్మి
You are at idlebrain.com > news today >
Follow Us

18 February 2019
Hyderabad

రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి'.. రామ్‌ కార్తిక్‌ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.శ్రీధర్‌ రెడ్డి, హెచ్‌.ఆనంద్‌ రెడ్డి, ఆర్‌.కె.రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయ్‌ లక్ష్మి ఇంటర్వ్యూ...

చాలా రోజుల తర్వాత తెలుగులో సినిమా చేశారుగా?
అవును .. తెలుగులో నటించి చాలా సంవత్సరాలైంది. అయితే వీలైనప్పుడల్లా స్పెషల్‌ సాంగ్స్‌లో నటిస్తున్నాను.

టైటిల్‌ ఎందుకు పెట్టారు?
- టైటిల్‌ అర్థమేంటో నేను చెప్పనక్కర్లేదు. అయితే ఆ టైటిల్‌ పెట్టడానికి, కథకు లింక్‌ ఉంది. కామెడీ మూవీ. లైట్‌ హార్టెడ్‌ మూవీ. ఎవరి కోసమో ఎవరో వెతుకుతూ వెళ్లే కథ. ఈ ప్రాసెస్‌లో చాలా కామెడీ జనరేట్‌ అవుతుంది. ప్యాకేజ్డ్‌ మూవీ అని చెప్పొచ్చు. స్క్రిప్ట్‌ వినగానే నచ్చింది. ఇలాంటి హ్యుమరెస్‌ సబ్జెక్ట్‌లో పార్ట్‌ కావాలని అనుకుని ఒప్పుకున్నాను. కామెడీతో పాటు ఓ సస్పెన్స్‌ పాయింట్‌ కూడా ఉంటుంది. వెంకటలక్ష్మి అనే టీచర్‌ పాత్రలో నటించాను. సినిమాను అమలాపురంలో చిత్రీకరించాను.

ఈ సినిమాను ఎందుకు చేయాలనుకున్నారు?
- మెయిన్‌గా జోనర్‌ నచ్చింది. మై హు నా చిత్రంలో సుస్మితాసేన్‌ తరహా పాత్ర నాది. గ్లామరస్‌ లుక్‌తో కనపడతాను. అలాగే సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాల్సినంత ఉంది. కథానుగుణంగా వచ్చే కామెడీ నన్ను ఆకట్టుకోవడంతో సినిమా చేయడానికి అంగీకరించాను.

interview galleryదర్శక, నిర్మాతలు గురించి?
- నిర్మాతలకు ఇది తొలి చిత్రం. చాలా ప్యాషన్‌తో మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. డైరెక్టర్‌ కిషోర్‌ కుమార్‌ సినిమాను క్లారిటీతో తెరకెక్కించారు.

తెలుగులో పరిమితంగా సినిమాలు చేయడానికి కారణమేంటి?
- నేను తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాను. తమిళం తర్వాత కన్నడలో సినిమాలు చేశాను. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో నేను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ కాలేదు. అందుకు కారణాలు అనేకం. అదే సమయంలో తమిళంలో నేను చాలా బిజీగా మారిపోయాను. తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాను. కాబట్టి మంచి స్క్రిప్ట్స్‌ అనిపిస్తేనే చేయాలని నిర్ణయించుకున్నాను. సినీ ఇండస్ట్రీలో జయాపజయాలు కామన్‌గా ఉంటాయి. అయితే మనం చేసే పనిలో మనకు సంతృప్తి కలగాలి కదా. నేను అలాగే ఆలోచిస్తాను. నేను చిన్న పాత్ర చేసినా, ఓ సాంగ్‌ చేసినా గుర్తింపు ఉంటేనే చేయాలనుకుంటున్నాను. స్పెషల్‌ సాంగ్‌ చేయడం ప్రెస్టీజియస్‌గానే భావిస్తాను.

రత్తాలు సాంగ్‌కు చాలా అప్రిషియేషన్స్‌ వచ్చింది కదా?
- అవును చాలా గుర్తింపు వచ్చింది. చిరంజీవిగారి 150వ చిత్రంలో చేసిన రత్తాలు రత్తాలు... సాంగ్‌ చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ఎంత పెద్ద హిట్‌ అంటే.. నన్ను అందరూ రత్తాలు అని పిలిచేవారు.

బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయా?
- వస్తున్నాయి. అయితే 'జూలీ2'లో నేను చేసిన తరహా పాత్రలే వస్తున్నాయి. ఒకే తరహా పాత్రల్లో నటించడం నాకు ఇష్టం లేదు. అందుకే చేయలేదు. బాలీవుడ్‌లో ఎక్కువగా స్కిన్‌ షో ఉంటుంది. కానీ సౌత్‌లో ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉంటుంది.

తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం మూడు తమిళ్‌ సినిమాలు అలాగే ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. అదేవిధంగా ఇది వరకు అంగీకరించిన ఒక తెలుగు సినిమా కూడా ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved