pizza
Raashi Khanna interview (Telugu) about Srinivasa Kalyanam
`శ్రీనివాస‌క‌ళ్యాణం` నాకు ఒక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ - రాశీ ఖ‌న్నా
You are at idlebrain.com > news today >
Follow Us

6 August 2018
Hyderabad

నితిన్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `శ్రీనివాస క‌ళ్యాణం`. శ్రీ వెంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీశ్ వేగేశ్న ద‌ర్శ‌కుడు. సినిమా ఆగ‌స్ట్ 9న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా హీరోయిన్ రాశీ ఖ‌న్నాతో ఇంట‌ర్వ్యూ...

ఊహించిన దాని కంటే...
- సినిమా చూశాను. బాగాఎమోష‌న‌ల్ అయ్యాను. నాకు డ‌బ్బింగ్ చెప్పిన ప్రియాంక‌.. ఫోన్ చేసి ఏడేస్తూ.. చాలా మంచి సినిమా చేశాన‌ని అప్రిషియేట్ చేసింది.. క‌థ వినేట‌ప్పుడు ఓ మంచి సినిమా చేస్తున్నాన‌ని తెలుసు కానీ... సినిమా చూసేట‌ప్పుడు నేను ఊహించిన దానికి సినిమా నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్ర‌కాశ్‌రాజ్‌గారు, నితిన్ పెర్ఫామెన్స్‌లు అద్భుతంగా ఉంటాయి. తొలి ప్రేమ త‌ర్వాత ఓ మంచి సినిమా చేయాల‌నుకుంటున్న త‌రుణంలో ఈ క‌థ విని ఓకే చేశాను. క‌థ చెప్పిన దాని కంటే విజువ‌ల్‌గా గ్రాండ్‌గా ఉంది. స‌మీర్‌గారు ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తీశారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ మూవీ. ఉత్త‌రాది నుండి వ‌చ్చిన నాకు తెలుగు సంప్ర‌దాయాల గురించి పెద్ద‌గా తెలియ‌దు. సెకండాఫ్ షూట్ చేస్తున్న‌ప్పుడు నాకు పెళ్లి చేసుకోవాల‌నిపించింది. అంత అందంగా తీశారు. ఈ జ‌న‌రేష‌న్‌కి ఇలాంటి సినిమా కావాలి. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను గుర్త‌కు తెచ్చే సినిమా.

ప్రేమ‌లో ప‌డ్డాను..
- ఈ సినిమా కోసం దిల్‌రాజుగారు చాలా కేర్ తీసుకున్నారు. సినిమాలో ఎక్కువ మంది నటీన‌టులున్నారు. అంద‌రిలో ఓ మూడ్ క్రియేట్ చేసి దాన్ని క్యారీ చేయ‌డం కోసం ఎవ‌రినీ ఫోన్స్ కూడా వాడొద్ద‌ని చెప్పారు. ఈ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చాలా బావుంది. సెట్‌లో సీనియ‌ర్ న‌టులు ప్ర‌కాశ్ రాజ్‌గారు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, సితార గారు, జ‌య‌సుధ‌గారు, న‌రేశ్‌గారు .. ఇలా అంద‌రి నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. సినిమా యూనిట్‌తో ప్రేమ‌లో ప‌డిపోయాను. వారిని వ‌దిలి పెట్ట‌డానికి మ‌న‌సే రాలేదు. పెళ్లికి అడుగులు వేసే ప్రేమ‌క‌థ. ఇందులో సంస్కృతి, సంప్ర‌దాయాలు, విలువ‌లు.. ఇలా చాలా లేయ‌ర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్ట‌ర్‌కు అంద‌మైన క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను డిజైన్ చేశారు. ప్ర‌తి అమ్మాయి పెళ్లి చేసుకోవాల‌నుకుంటుంది. నేను అంద‌రిలానే.. విడాకులు తీసుకోవ‌డం వ‌ల్ల పెళ్లి ప‌ట్ల న‌మ్మ‌కం త‌గ్గిపోతుంది. కానీ పెళ్లి అనేది గొప్పది. సినిమా చూసిన త‌ర్వాత స‌తీశ్‌గారి పాదాల‌ను తాకాను. అంద‌రి హృద‌యాల‌ను తాకుతుంది.

సినిమా చూడాల్సిందే..
- సినిమాలో నా పేరు సిరి.. సంప్ర‌దాయాల‌కు విలువ‌నిచ్చే అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. అంత కంటే నా పాత్ర గురించి ఎక్కువ‌గా చెప్ప‌లేను. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఆ తేడా ఉంది...
- ఉత్త‌రాది, ద‌క్షిణాది పెళ్లి సంప్ర‌దాయాల‌కు చాలా తేడా ఉంది. అయితే అందులో ఫీల్ ఒక‌టే. పెళ్లి అనేది రెండు కుటుంబాల‌ను ద‌గ్గ‌ర చేస్తుంది. ఈ సినిమా చేసే స‌మ‌యంలో నేను తెలుగు అమ్మాయిలా ఫీలై న‌టించాను. ఈ సినిమా కేవ‌లం పెళ్లి గురించే కాదు.. వ్య‌క్తుల మ‌ధ్య ఉండే బంధాలు, బాంధ‌వ్యాల గురించి తెలియ‌జేస్తుంది. ఈ సినిమా చూసిన త‌ర్వాత డెస్టినేష‌న్ వెడ్డింగ్ కంటే త‌మ స్వంత గ్రామాల‌కు వెళ్లి పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు.

interview galleryనెక్ట్స్ లెవ‌ల్‌కు ...
- `మ‌హాన‌టి` త‌ర్వాత మిక్కీ జె.మేయ‌ర్‌గారు సంగీతం అందించిన చిత్ర‌మిది. మంచి పాట‌ల‌ను ఇచ్చారు. అలాగే త‌న రీరికార్డింగ్ స‌న్నివేశాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లారు.

అబ్బాయిలు ఏడ‌వ‌డం...
- సాధార‌ణంగా సినిమాల్లోఎక్కువ ఎమోష‌న‌ల్ సీన్స్‌, డైలాగ్స్‌కు అమ్మాయిలు క‌నెక్ట్ అయి ఏడుస్తుంటారు. కానీ సినిమాలో అబ్బాయిలు ఏడ‌వ‌డం నేను చూశాను. అబ్బాయిలే కాదు.. అంద‌రూ క‌నెక్ట్ అయి క‌న్నీళ్లు పెట్టుకుంటారు. నితిన్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌య‌సుధ‌, నందితా శ్వేత‌, సితార‌, ప్ర‌కాశ్ రాజ్‌గారు ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. అంద‌రి న‌ట‌న‌తో సినిమా స‌న్నివేశాల‌ను పండించారు.

ఈ సినిమా త‌ర్వాత కూడా..
- న‌టిగా మ‌న‌ల్ని మ‌నం ప్రూవ్ చేసుకుంటేనే మంచి పాత్ర‌లు వ‌స్తాయి. తొలిప్రేమ సినిమాలో అవ‌కాశం రావ‌డానికి కార‌ణం ఊహ‌లు గుస‌గుస‌లాడే. అలాగే తొలిప్రేమ సినిమా చూసిన దిల్‌రాజుగారు శ్రీనివాస‌క‌ళ్యాణంలో అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా త‌ర్వాత కూడా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదిచునే పాత్ర‌లు చేస్తాన‌న‌ని అనుకుంటాను.

త‌దుప‌రి చిత్రాలు
- తెలుగులో ఓ సినిమా సైన్ చేశాను. త్వ‌ర‌లోనే వివ‌రాలు తెలుస్తాయి. తెలుగుతో పాటు త‌మిళంలో సినిమాలు చేస్తున్నాను. రెండేళ్ల ముందు సైన్ చేసిన త‌మిళ సినిమాలు ఇప్పుడు మెటీరియ‌లైజ్ అవుతున్నాయి. త‌మిళంలో మూడు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి.

 

 


 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved