pizza
Raasi interview (Telugu) about Lanka
'లంక' మూవీలో నా క్యారెక్టర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించాను - రాశి
You are at idlebrain.com > news today >
Follow Us

19 April 2017
Hyderabad

సీనియర్‌ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో రోలింగ్‌ రాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నామన దినేష్‌; నామన విష్ణు కుమార్‌ నిర్మాతలుగా శ్రీముని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లంక'. ఈసినిమా ఏప్రిల్‌ 21న విడుదలవుతుంది. ఈసందర్భంగా రాశితో ఇంటర్వ్యూ...

సినిమాలో క్యారెక్టర్‌ గురించి....
- 'లంక' సినిమాలో చాలా క్లిష్టమైన క్యారెక్టర్‌లో నటించాను. నేను హీరోయిన్‌గా చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా కాంట్రాస్ట్‌గా కనపడుతుంది. చాలా యారగేంట్‌గా కనపడ్డా, దయార్ధ్ర హృదయం ఉన్న స్త్రీ పాత్రలో నటించాను. చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించాను. ఎలాంటి రెఫరెన్స్‌లు లేవు.

ముందు చేయకూడదని అనుకున్నాను...
- సినిమా కథ వినగానే నేను ఈ సినిమా చేయకూడదు. మా అయనకు నేనేదో బూస్టప్‌ చేయడానికి నేను నటిస్తున్నానని అందరూ అనుకుంటారని నేను ముందు వద్దని అన్నాను. అప్పుడు ఓసారి కథ విను నచ్చితేనే చెయ్‌..లేకుంటే వద్దు అన్నారు. కథ వినగానే నాకు బాగా నచ్చింది. కొత్తగా చెయవచ్చు కదా అనిపించింది.

కాన్పెప్ట్‌...
- సినిమా మెయిన్‌ పాయింట్‌ టెలిపతి...35-40 వయసున్న ఓ మహిళా తనకు పిల్లలు లేకున్నా, ఉన్నారనుకుని జీవిస్తూ ఉంటుంది. అలాంటి స్త్రీ జీవితంలోకి హీరోయిన్‌ ఎలా ప్రవేశిస్తుంది. వారి మధ్య రిలేషన్‌ ఎలా ఏర్పడుతుందనేదే ముఖ్యమైన కథ.మహిళలందరూ చూడదగ్గ చిత్రం.

టైటిల్‌ జస్టిఫికేషన్‌...
- 'లంక' అనే టైటిల్‌ నేటి సమాజాన్ని బేస్‌ చేసుకుని పెట్టారు. మనం టీవీలు, పేపర్స్‌ చూస్తున్నప్పుడు మహిళలపై జరగుతున్న అత్యాచారాలు మనకు కనపడుతుంటాయి. లంకలాంటి సమాజంలో ఓ అమ్మాయి ఎలా పరిస్థితులను ఎదుర్కొందనేదే కథ. నేను అమ్మాయిలోకి వెళతానా? ఆ అమ్మాయి నాలో వెళుతుందా? అనేది కీలకాంశం. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిలోకి నేనే వెళతాను.

Raasi interview gallery

రిలాక్స్‌ అయిపోయాను...
- చిన్నప్పట్నుంచి ఇండస్ట్రీలో ఉండటంతో కాస్తా విశ్రాంతి తీసుకోవాలనిపించింది. హీరోయిన్‌గా డౌన్‌పాల్‌ అనేది ఉన్నప్పుడే నాకు అవగాహన వచ్చి సెటిల్‌ అయిపోతే బావుంటుందనిపించింది. ఆ క్రేజ్‌తో రిలాక్స్‌ తీసుకున్నాను కాబట్టే గ్యాప్‌ తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చినా అవకాశాలు వస్తున్నాయి.

కమ్‌బ్యాక్‌ మూవీ...
- కళ్యాణ వైభోగమే సినిమాలో హీరోయిన్‌ అమ్మ పాత్ర కోసం నందిని రెడ్డిగారు ఫోన్‌ చేసినప్పుడు మూడు నెలల పాప ఉండటంతో చేయలేనని చెప్పాను. మళ్ళీ కొన్ని నెలలు తర్వాత నందినీ రెడ్డిగారు మళ్ళీ ఫోన్‌ చేసి చేస్తారా అని అడిగారు. తల్లి పాత్రలో రీ ఎంట్రీ ఎందుకు అని ఆలోచిస్తున్నప్పుడు ముందు కథ విని నచ్చితే చేయమని అన్నారు. కథ వినగానే హీరోయిన్‌కు, నాకు మధ్య ఉన్న ఇంటిమసి నచ్చడంతో కళ్యాణవైభోగమే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. క్యారెక్టర్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందనే విషయాన్నే పరిగణలోకి తీసుకుంటాను.

అప్పట్లో ఇన్ని అవకాశాలు లేవు..
- అప్పట్లో మేం ఎండల్లో, వానల్లో బాగానే కష్టపడ్డాం. ఇప్పట్లోలా క్యారీ వాన్స్‌ కూడా లేవు. ఎక్కడో చెట్టు చాటున కూర్చొని షూటింగ్‌ గ్యాప్‌లో రెస్ట్‌ తీసుకునేవాళ్ళం. డైలాగ్స్‌ చెప్పడానికి కూడా ముందు బాగా రీహార్సల్‌ చేసేవాళ్లం కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌తో అన్నీ చిన్న చిప్‌లో అమరిపోతున్నాయి. డబ్బింగ్‌ సమయంలో కూడా పెద్దగా కష్టపడే పనిలేకుండా పోయింది.

నాలెడ్జ్‌ లేదు..తప్పకుండా చేస్తా...
- రియాల్టీ షోస్‌ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. రాజకీయాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు.

పవన్‌ను కలిశాను..
- పవన్‌కళ్యాణ్‌గారంటే నటుడుగా ఎంతో ఇష్టం. పాప మొదటి పుట్టినరోజున కలవాలనుకున్నాను. అపాయింట్‌మెంట్‌ కోసం నేను బయట వెయిట్‌ చేస్తున్నాను. పవన్‌గారికి ఆ విషయం ముందు తెలియలేదు. నేను వచ్చినని తెలియగానే లోపలికి పిలిపించారు. చాలా కూల్‌గా పొలైట్‌గా అరగంటసేపు మాట్లాడారు. పాపతో ఆడుకున్నారు. లోపలికి వెళ్ళేటప్పటి కంటే బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఫీలయ్యాను.

తదుపరి చిత్రాలు..
- 'లంక' విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved