pizza
Rahul Ramakrishna interview about Hushaaru
రైట‌ర్స్ నా కోసం క్యారెక్ట‌ర్స్ రాస్తున్నారు - రాహుల్ రామ‌కృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

8 December
Hyderabad

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన రాహుల్ రామ‌కృష్ణ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ....

ఈ సినిమాలో అవకాశం గురించి?
- డైరెక్టర్‌ హర్ష కొనుగంటి కథ చెప్పినప్పుడు ఆయన డ్రై సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాల నచ్చింది. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఇవ్వాళ జోక్‌ వేస్తె ఒక వారం తరువాత అర్ధం అవుతుంది. దానితో పాటు ఆయన కథ చెప్పే విధానం బాగా నచ్చి ఈ సినిమాకు ఓకే చెప్పాను.

హర్ష కొనుగంటితో మీ ప్రయాణం?
- ఈ సినిమా కథ నచ్చి హర్షతో 6,7 నెలలు ప్రయాణం చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ ఆడుతూ పాడుతూ జాలీగా సాగింది. సినిమా ఫైనల్‌ అవుట్‌ ఫుట్‌ చూసి చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఈ సినిమాలో కొన్ని సన్నివేషాలు ఫుల్ కామెడీతో తెరకెక్కించారు డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి?
- ఈ సినిమాలో నాపాత్ర నిడివి చాలా ఎక్కువ. ప్రదానంగా ఈ సినిమాలో నలుగురు యువతీ యువకులు ఉంటారు. వారికి విరుద్ధంగా సెకండ్‌ హాఫ్‌లో ఎంటర్‌ అయ్యే ఫ్రస్టేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లొయ్‌. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చెయ్యలేక రకరకాల పరిణామాల ద్వారా వాళ్ళ నలుగురిని కలిసి వారి చేత హోమ్‌ మేడ్‌ బీర్‌ తయారు చేసే పద్ధతి నేర్చుకొని ఆ కంపెనీ పెట్టిన తరువాత పరిణామాల గురించి ఈ సినిమాలో చూపించాం.

ఈ సినిమా ద్వారా మీరు సమాజానికి ఏదయినా సందేశం ఇస్తున్నారా?
- లేదండి! ఈ సినిమాలో మంచి సందేశం అయితే ఉంది కానీ అది నా ద్వారా కాదు.ఆ నలుగురు యువతీయువకుల ద్వారానే ఉంటుంది.

సినిమా ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా ఉంటుందా?
- ఈ సినిమా ప్రధానంగా కామెడీ జోనర్‌లోనే ఉంటుంది. కాకపొతే అక్కడక్కడా కొంత కథకు అవసరమైన ఎమోషన్స్‌ కూడా ఉంటాయి.

interview gallery



సెలబ్రేషన్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బిహేవియర్‌ టాగ్‌ లైన్‌ గురించి?
- హుషారు అంటే ప్రతి మనిషి హుషారు గానే ఉంటారు. కానీ చనిపోయే ముందు మనం మన జీవితాన్ని తిరిగి చూసుకుంటే మనకు జ్ఞాపకాలు తప్ప ఇంకేమి ఉండవు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం.

ఈ సినిమాలో సాఫ్ట్‌ వేర్‌ క్యారెక్టర్‌కు నిజ జీవితంలో ఎవరికైనా సంబంధం ఉందా?
- నాకు చాలా మంది సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేసే ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారి జీవితంలో కొన్ని సంఘటనలు కూడా ఈసినిమాలో చూపించాం. ఈ సినిమా లో నాక్యారెక్టర్‌ సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేసే ప్రతీ ఒక్కరికి ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది.

ఈ సినిమాలో షెఫ్‌ గా కూడా కనిపించారు?
ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ సాఫ్ట్‌ వేర్‌ అయినా నాకు సాఫ్ట్‌ వేర్‌ పట్ల అంత అవగాహన ఉండదు. అందుకే రకరకాల వంటలు వండి ప్రదర్శిస్తాడు.

పిచాక్‌ సాంగ్‌ రెస్పాన్స్‌?
- `అర్జున్‌ రెడ్డి` తరువాత నేను చాలా సినిమాలు చేశాను. మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది కానీ పిచాక్‌ సాంగ్‌ రెస్పాన్స్‌ చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నా జీవితంలో ఫస్ట్‌ టైం 1.3 మిల్లియన్‌ వ్యూస్‌ దాటి ట్రెండింగ్స్‌లో ఉన్న సాంగ్‌. యూత్‌ ఈ సాంగ్‌ను బాగా ఇష్టపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో అన్ని గడ్డంతో ఉన్న క్యారెక్టర్స్‌నే చేస్తున్నారు?
'భరత్‌ అను నేను' సినిమాలో కొరటాల శివ గారు నాతో మంచి ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేపించారు. అప్పటినుండి నాకోసం అన్ని అలాంటి క్యారెక్టర్స్‌నే రాస్తున్నారు రైటర్స్‌. నాకు కూడా వేరియేషన్‌ క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
- `మిఠాయి` సినిమా రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది, సందీప్‌ కిషన్‌గారితో 'నిను వీడని నీడను నేను' సినిమా చేస్తున్నాను, ప్రశాంత్‌ వర్మ గారితో రాజశేఖర్‌ గారి 'కల్కి' సినిమా చేస్తున్నాను. వివేక్‌ ఆత్రేయ, సత్యదేవ్‌ గారితో సినిమా ఉంది. రీసెంట్‌గా ఆర్‌.ఆర్‌.ఆర్‌లో కూడా మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను. దాని గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. రాహుల్‌ రామకృష్ణ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved