pizza
Rahul Vijay interview (Telugu) about Suryakantham
ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా - రాహుల్ విజ‌య్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 March 2019
Hyderabad

రాహుల్ విజ‌య్ ఓ టెక్నీషియ‌న్ కొడుకు. ఇండ‌స్ట్రీలో పుట్టిపెరిగిన కుర్రాడు. 24 శాఖ‌ల్లోని వారి క‌ష్టాన్ని ప్ర‌తిబింబించే ఆర్టిస్ట్ అంటే అత‌నికి గౌర‌వం. ఆ విష‌యాన్నే తండ్రితో చెప్పాడు. తండ్రీ అనుమ‌తించారు. సొంత నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమా పూర్త‌యింది. ఇప్పుడు రెండో సినిమాతో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నున్నారు. ఆ సినిమా పేరే `సూర్యకాంతం`. రాహుల్ విజ‌య్‌, నీహారిక కొణిదెల న‌టించిన‌ `సూర్యకాంతం` శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌కుడు. వ‌రుణ్ తేజ్ స‌మర్పిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా గురించి రాహుల్‌ బుధ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* ఈ సినిమా అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- నా తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే సంత‌కం చేసిన చిత్ర‌మిది. వ‌రుణ్ అన్న చెబితే క‌థ విన్నా. న‌చ్చి చేశా.

* తొలి సినిమా డిస‌ప్పాయింట్ చేసింద‌ని అనుకుంటున్నారా?
- లేదండీ. నా తొలి సినిమా ఎంత ఆడింద‌నే విష‌యాన్ని ప‌క్క‌నపెడితే న‌టుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. `కుర్రాడు బాగా చేశాడు` అనే అంద‌రూ అన్నారు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా, నా పాత్ర‌కు నేను న్యాయం చేసిన‌ప్పుడు నేను బాధ‌ప‌డ‌ను.

* `సూర్యకాంతం` ఎలా ఉంటుంది?
- చాలా ఫ‌న్నీగా ఉంటుంది. సినిమాలో అప్స్ అండ్ డౌన్స్ చాలానే ఉంటాయి. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్ చాలా బావుంటాయి. ఎమోష‌న్ అనేది యూనివ‌ర్శ‌ల్ థింగ్‌. స్టోరీని మ‌నం ఎలా చూశామ‌న్న‌ది ఉంటుంది.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నేను అభి అనే పాత్ర చేశాను. కాస్త క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉండే పాత్ర‌. నా నిజ జీవితానికి, ఈ కేర‌క్ట‌ర్‌కి అస‌లు ఎక్క‌డా సంబంధం ఉండ‌దు. అందుకే ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా. చాలా అబ్జ‌ర్వ్ చేశాను. పూజా, కాంతం .. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య న‌లిగిపోయే ఇన్నొసెంట్ పాత్ర‌. ఎవ‌రినీ నొప్పించ‌ని త‌త్వం ఉన్న పాత్ర చేశా. ఇందులో ప్ర‌తి పాత్ర‌కూ ప్ర‌త్యేక‌త ఉంటుంది. థియేట‌ర్లో కూర్చున్న ఆడియ‌న్స్ ఎవ‌రిని ఎక్కువ ఫాలో అవుతారో చూడాలి.

* ద‌ర్శ‌కుడి గురించి చెప్పండి?
- ఈ సినిమా త‌ర్వాత ప్ర‌ణీత్ త‌ప్ప‌కుండా చాలా హైట్స్ రీచ్ అవుతాడు. మామూలుగా మ‌నం ఒత‌రుల్ని చూసేట‌ప్పుడు బ్లాక్ అండ్ వైట్ గురించి మాట్లాడుతాం. అయ‌తే చెడూ, లేకుంటే మంచీ అన్న‌ట్టే ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా ఉండ‌దు. బ్లాక్ అండ్ వైట్ కి మ‌ధ్య‌లో ఓ గ్రే షేడ్ ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి గ్రే గురించి ఎక్కువ డిస్క‌ష‌న్స్ ఉంటాయి. దాన్ని చాలా బేల‌న్స్ గా చెప్పాడు ప్ర‌ణీత్‌.

* నిహారిక‌తో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- త‌ను చాలాస్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్‌. ఎవ‌రితో ఎలా ఉండాలో త‌న‌కి బాగా తెలుసు. అలా లేకుంటే అడ్వాంటేజ్ తీసుకునేవారు చాలా మంది ఉంటారు. అలాంటి అంశాల‌కు త‌నెక్క‌డా స్కోప్ ఇవ్వ‌దు.

* తొలి సినిమాలో సోలో హీరో.. వెంట‌నే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కేర‌క్ట‌ర్ చేయ‌డం ఎలా అనిపించింది?
- పెర్ఫార్మెన్స్ చేయ‌డం నాకు ఇష్ట‌మే. ఇప్ప‌టికిప్పుడు యాక్ష‌న్ హీరో అయిపోవాల‌నేం లేదు. 30 ఏళ్ల లోపు వీలైన‌న్ని ప్ర‌యోగాలు కూడా చేయాల‌ని ఉంది. న‌టుడిగా నా వంతు కృషి నేను త‌ప్ప‌కుండా చేయాలి. అందుకే ఈ సినిమా చేశా. ఇందులో తొలి స‌గం మొత్తం ఫ‌న్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువ ఎమోష‌న్స్ ఉంటాయి.

interview gallery



* మీ నెక్స్ట్ మూవీస్ గురించి చెప్పండి?
- నెక్ట్స్ త‌మిళ్‌, తెలుగు ఓ బై లింగ్వుల్ సినిమా చేస్తున్నా. క‌న్న‌డ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో మా నాన్న పాత్ర‌లో తెలుగులో శ్రీకాంత్‌గారు చేస్తున్నారు. త‌మిళ్‌లో ప్ర‌భుగారు చేస్తున్నారు. ఏప్రిల్ మూడో వారం నుంచి షూటింగ్ ఉంటుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. కాలేజ్ కుమారా సినిమాకు రీమేక్ ఇది. దీని త‌ర్వాత కిక్ బాక్సింగ్ కాన్సెప్ట్ తో ఓ సినిమా చేస్తా. మ‌ణి అని ఓ కొత్త‌బ్బాయి ఆ స్క్రిప్ట్ చెప్పాడు. చాలా బావుంది. నేను కూడా నాలుగేళ్లు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. బ్యాంకాక్‌లోనూ ఆరు నెల‌లు నేర్చుకున్నా. నాన్న‌గారు స్టంట్ మాస్ట‌రే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ద‌గ్గ‌ర ఎప్పుడూ నేర్చుకోలేదు.

* నాన్న‌గారు మీ స్క్రిప్ట్ విష‌యాల్లో ఎంత వ‌ర‌కు జోక్యం చేసుకుంటారు?
- లేదండీ. ఆయ‌న వింటారు. స‌ల‌హాలిస్తారు. కానీ ఫైన‌ల్‌గా నేనేం చెబితే దానికి ఓకే చేస్తారు.

* ఫైన‌ల్‌గా ఈ సినిమా నిర్మాత‌ల గురించి చెప్పండి?
- చాలా మంచి ప్రొడ‌క్ష‌న్ టీమ్ అండీ. సెట్లో ఎప్పుడూ చిల్‌గా ఉండేది. ఎక్క‌డా క్రియేటివ్ ఇన్‌ఫ్లుయ‌న్స్ చేయాల‌ని చూడ‌లేదు. ద‌ర్శ‌కుడికి ఏం క‌వాలో అవ‌న్నీ స‌మ‌కూర్చారు. చాలా ఆనందంగా అనిపించింది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved