pizza
Rajeev Saluri interview about Titanic
ఆయన సలహాలిస్తారు కానీ ఇన్ వాల్వ్ కారు – రాజీవ్ సాలూరి
You are at idlebrain.com > news today >
Follow Us

15 June 2016
Hyderaba
d

రాజీవ్ సాలూరియామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు ఈ చిత్రాన్న నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో రాజీవ్ సాలూరి మీడియాతో పంచుకున్న సినిమా విశేషాలు...

అందుకే ఆ టైటిల్...
టైటానిక్ అనేది ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న హాలీవుడ్ మూవీ. ఇక ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టడానికి పెద్ద కారణం, కథ ప్రకారం సినిమా అంతా టైటానిక్ అనే బోటులోనే జరుగుతుంది. అంతర్వేది నుండి అమలాపురం వరకు టైటానిక్ అనే బోట్ లో సాగే ప్రయాణం కావడంతో ఈ టైటిల్ ను పెట్టాలనుకున్నాం.

క్యారెక్ట‌ర్ గురించి...
- ఈ చిత్రంలో కార్తీక్ అనే కాలేజ్ కుర్రాడి రోల్ చేశాను. హీరోయిన్ ను ప్రేమించిచిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు వల్ల విడిపోతారు. అలాంటి మ‌రి హీరో టైటానిక్ బోటు ఎందుకు ఎక్కుతాడ‌నే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

రెండింటికీ పోలిక లేదు...
- గోదావ‌రి సినిమాను కూడా బోట్‌లోనే చిత్రీక‌రించారు. అయితే ఆ సినిమాకుమా సినిమాకు పోలిక లేదు. దేనిక‌దే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. మా చిత్రం కామెడి ఎంట‌ర్ టైన‌ర్‌. సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా 22రోజుల పాటు బోటులోనే షూటింగ్ చేశాం. పండుగ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించింది. సినిమా అవుట్ పుట్ చూశాక యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

కెరీర్ ప‌రంగా హ్యాపీ...
- టైటానిక్ నాకు 8వ చిత్రం. కెరీర్ ప‌రంగా చూస్తే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదీ ప‌డితే అది చేసేయ‌కుండా సెల‌క్టివ్‌గానే ముందుకెళ్లాల‌నుకుంటున్నాను.

డైరెక్ట‌ర్ గురించి..
- డైరెక్ట‌ర్ రాజ‌వంశీగారు ప‌క్కా స్క్రిప్ట్‌ను త‌యారు చేసుకున్న త‌ర్వాతే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఏ క‌థ‌ను అయితే చెప్పారో దాని కంటే బాగా సినిమాను చిత్రీక‌రించారు.

నాకే వ‌దిలేశారు...
మ్యూజిక్ సైడ్ వ‌చ్చుంటే నేను అండ‌గా ఉండేవాడినికానీ నువ్వు హీరో కావాల‌నుకున్నావుకాబట్టి మంచి క‌థ‌లను ఎంచుకుంటూ నువ్వే ముందుకెళ్లు అన్నారు. స‌ల‌హాల‌ను మాత్ర‌మే ఇస్తారు కానీ నా సినిమాల విష‌యంల ఇన్‌వాల్వ్ కారు. ప్ర‌స్తుతం ఈ సినిమాను కూడా నాన్న‌గారింకా చూడ‌లేదు. ఆయ‌న యు.ఎస్‌లో ఉన్నారు.

త‌దుప‌రి చిత్రాలు...
కేటుగాడు సినిమా డైరెక్టర్ కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్ బాలసాని నిర్మాతగా ఓ హ‌ర్ర‌ర్ చిత్రం మొద‌లు కానుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved