pizza
Raj Tarun interview (Telugu) about Andhhagadu
ఏ పాత్ర అయినా ప్రేమించే చేస్తాను - రాజ్‌ తరుణ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2017
Hyderabad

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. ఈ సినిమా జూన్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా రాజ్‌త‌రుణ్‌తో ఇంట‌ర్వ్యూ...

ఆర్ట్‌ సినిమా కాదు..
- నేను గుడ్డివాడి పాత్ర పోషిస్తున్నాను కదా అని సినిమా ఆర్ట్‌ సినిమా కాదండి..సినిమా అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ట్విస్టులు, ఎమోషన్స్‌ అన్ని ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా.

పూర్తి భిన్నమైన పాత్ర..
- కథ వినగానే ఎగ్జయిట్‌ అయ్యాను. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్‌కు పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో పూర్తిగా ఎంజాయ్‌ చేశాను. అంధగాడు సినిమాలో అంధగాడిగా నలబై నిమిషాల పాటు కనపడతాను.

క్లారిటీ ఉన్న వ్యక్తి..
- వెలిగొండ శ్రీనివాస్‌గారు మంచి రచయిత, ఎన్నో సినిమాలకు రచయితగా తన సహకారం అందించారు. కంటెంట్‌ విషయంలో శ్రీనివాస్‌గారు స్ట్రాంగ్‌ పర్సన్‌. క్లారిటీ ఉన్న పర్సన్‌. ఆయనలో మంచి ఆర్టిస్ట్‌ కూడా ఉన్నాడు. ఆయనకెలా కావాలో అలా నటించి చూపగలరు. కాబట్టి మనకు ఇంకా సులభం అవుతుంది.

క్యారెక్టర్‌ అలా పుట్టింది...
- దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్‌గారు ఓసారి ఓ బ్లైండ్‌ స్కూల్‌కు వెళ్ళారట. అక్కడ పిల్లలు ఎవరి సహాయం లేకుండా చాలా యాక్టివ్‌గా వాళ్ళ పనులను వాళ్ళే చేసుకుంటుండం చూసి ఆయన ఆశ్చర్యపోయారట. అలా ఆయన చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్‌గారు క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసుకున్నారు. ఈ సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించలేదు. అంతా పాజిటివ్‌ యాంగిల్‌లోనే సినిమా సాగుతుంది. మెసేజ్‌ ఏం ఉండదు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.

ఆడియెన్‌లానే కథ వింటాను..
- కథ విన్నప్పుడు ఆడియెన్‌లా వింటాను. అలా విని ఎగ్జయిట్‌ అయినప్పుడు సినిమా చేయడానికి ఒప్పుకుంటాను. అలా అంధగాడు సినిమా కథ వినగానే ఎగ్జయిట్‌ అయ్యాను. అలాగే ఈ సినిమాను ఓ జోనర్‌ మూవీ అని చెప్పలేం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్‌ కలగలిపి కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది.

కంఫర్ట్‌ లెవల్స్‌ బావుంటాయి..
- రాజేంద్రప్రసాద్‌గారు లెజెండ్రీ యాక్టర్‌. ఆయన సెట్‌లో ఉంటే సరదా సరదాగా ఉంటుంది. అందరినీ నవ్విస్తుంటారు. ఏదైనా డౌట్‌ ఉంటే వెంటనే చెబుతారు. ఈ సినిమా మొత్తంలో బాగా సపోర్ట్‌ చేశారు. అలాగే హెబ్బాపటేల్‌తో ఇది వరకు రెండు సినిమాల్లో నటించాను. మంచి పరిచయం కారణంగా తనతో కంఫర్ట్‌ జోన్‌లో నటించగలను.

డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌
- నేను ఏ పాత్ర చేసినా ప్రేమించే చేస్తాను. కాకపోతే అంధగాడు సినిమాలో బ్లైండ్‌ పాత్రను డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. ఈ సినిమాలో పనిచేసిన వారందరూ ఇది వరకు నాతో వేరే సినిమాల్లో నటించినవారే. కాబట్టి అందరితో కలిసిపోయి సరదాగా సినిమా చేశాం.

interview gallery

ఆ ఆనందాన్ని మరేదీ ఇవ్వదు..
- నాకు సంబంధించినంత వరకు ఓ సినిమా సక్సెస్‌ ఇచ్చినంత ఆనందం మరేదీ ఇవ్వదని చెప్పగలను. ఓ సినిమా కోసం దాదాపు రెండు వందలకు వ్యక్తులు పనిచేస్తారు. అందరి కంటే నాదే సులభమైన పని. వెళతాను..యాక్ట్‌ చేస్తాను. వచ్చేస్తాను. అందరి కష్టంతోనే సినిమా హిట్‌ అవుతుంది. మంచి టీమ్స్‌ సహకారంతోనే సినిమాలు సక్సెస్‌లు అవుతాయి. అందువల్లే సక్సెస్‌ రేట్‌ బావుంది.

అందుకే ఆ సినిమా చేయలేకపోయాను..
- శతమానం భవతి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది దిల్‌రాజుగారి ప్లాన్‌. కథ ప్రకారం సినిమా కూడా అప్పుడే విడుదలైతేనే బావుంటుంది. కానీ అప్పటి లోపు పూర్తి చేయాలంటే డేట్స్‌లేవు. దాని వల్ల శతమానం భవతి సినిమా చేయలేకపోయాను. ఎట్టకేలకు త్వరలోనే దిల్‌రాజుగారితో సినిమా చేయబోతున్నాను. ఆ వివరాలను దిల్‌రాజు తెలియజేస్తారు.

నిజంగా నా లక్‌...
- అనిల్‌సుంకర వంటి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌తో వరుసగా సినిమాలు చేయడం నా లక్‌. మంచి కథ దొరికితే, దాంతో సినిమాను ఎంత బాగా తీయాలని ఆలోచిస్తారే తప్ప బడ్జెట్‌ గురించి పట్టించుకోరు. ఎ.కె.ఎంటర్‌టైన్మ్‌ంట్‌ నా హోం బ్యానర్‌లాంటిది. ఈ బ్యానర్‌లో మరో సినిమా కూడా చేయబోతున్నాను.

అన్నీ పాటలు నచ్చాయి...
- శేఖర్‌ చంద్ర సంగీత సారథ్యంలో వచ్చిన అన్ని పాటలు బాగా నచ్చాయి. సినిమా చూపిస్త మావ సినిమాలోని సంగీతానికి, ఈ సినిమాలో సంగీతానికి శేఖర్‌ చంద్ర చూపించిన వైవిధ్యం చూసి థ్రిల్‌ అయ్యాను. తన ట్యూన్స్‌ అందరూ పాడుకునేలా ఉంటాయి. నా సినిమాల్లో బెస్ట్‌ ఆల్బమ్‌ ఇది.

దర్శకత్వం గురించి...
- దర్శకత్వం చేయాలంటే ముందు ఒక ఏడాది పాటు గ్యాప్‌ తీసుకోవాలి. ఇప్పుడు గ్యాప్‌ తీసుకునేంత లేదు. కథ రాసుకునేంత తీరిక ఉండటం లేదు. అలాగే నా మనసులో ఏదైనా ఒక కథ పుట్టి దాన్ని సినిమాగా చెప్పాలనుకున్నప్పుడు కచ్చితంగా దర్శకత్వం చేస్తాను.

మల్టీస్టారర్స్‌ గురించి...
- మంచి కథ కుదరడంతో మంచు విష్ణుగారితో కలిసి ఆడోరకం ఈడోరకం సినిమా చేశాను. అలాగే మంచి కథ కుదిరితే ఎవరితోనైనా మల్టీస్టారర్‌ మూవీస్‌లో నటిస్తాను. నేను బేసిక్‌గా మల్టీస్టారర్‌ మూవీస్‌ను బాగా ఇష్టపడతాను.

తదుపరి చిత్రం..
- సెల్వరాఘవన్‌ శిష్యురాలు రంజని దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ లవ్‌ స్టోరీ చేస్తున్నాను. షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. ఇందులో చిత్ర అనే హీరోయిన్‌ నటిస్తుంది. తర్వాతే దిల్‌రాజుగారి బ్యానర్‌లో సినిమా ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved