pizza
Raj Tarun interview (Telugu) about Kittu Unnadu Jagratha
అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది - రాజ్ త‌రుణ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 March 2017
Hyderabad

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మార్చి 3న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు చేస్తున్నారు.ఈ సంద‌ర్భంగా హీరో రాజ్‌తరుణ్‌తో ఇంట‌ర్వ్యూ...

వంశీకృష్ణ‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
- క‌థ‌ను శ్రీకాంత్ అద్భుతంగా రాశాడు. క‌థ విన‌గానే ఐదు నిమిషాల్లో క్యారెక్ట‌ర్‌లోకి ఇన్‌వాల్వ్ అయిపోయా. చాలా వేరియేష‌న్స్ ఉన్న క‌థ‌. క‌థ విన్నాక‌, డైరెక్ట‌ర్ ఎవ‌రు అని అనుకుంటున్న టైం వంశీ కృష్ణ దొంగాట సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. షాట్స్ ఎలా ఉండాలో బాగా అవగాహ‌న ఉన్న కాబ‌ట్టే వంశీ కృష్ణ అయితే సినిమాను చ‌క్క‌గా హ్యండిల్ చేయ‌గ‌ల‌ర‌నిపించి చేశాను.

వాటితో న‌టించ‌డం క‌ష్ట‌మ‌నిపించ‌లేదు...
- కుక్క‌ల‌తో కలిసి సినిమా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మ‌నిపించ‌లేదు. వాటితో ఎలా న‌టింప చేయాలో తెలుసుకుంటే చాలా ఈజీగా షూటింగ్ అయిపోతుంది. కుక్క‌ల్ని..ఎప్పుడూ మ‌న‌తో ఫ్రెండ్లీగానే ఉంటాయి.

నిర్మాణ సంస్థ గురించి...
- ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ మేకింగ్ వాల్యూస్‌కు పెద్ద పీట వేస్తారు. ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుండి ఎండింగ్ అయ్యే వ‌ర‌కు, ఎంట‌ర్‌టైన్మెంట్ మాత్ర‌మే క‌న‌ప‌డుతుంది. నాతో క‌లిసి న‌టించిన వారు కూడా చ‌క్క‌గా చేశారు. అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

పాట రాయడం యాదృచ్చిక‌మే...
-హీరో అను ఇమ్మాన్యుయ‌ల్ అద్భుతంగా న‌టించింది. సినిమాలో విల‌న్ క్యారెక్ట‌ర్‌కు ఓ స్ట్రెచ‌ర్ ఉండాల‌నుకున్న‌ప్పుడు అర్బాజ్ ఖాన్‌గారు గుర్తుకు వ‌చ్చారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ళేట‌ప్పుడు ఆయ‌న చేస్తారో, చేయ‌రోన‌ని అనుకున్నాం. కానీ ఆయ‌న క‌థ విన‌గానే ఒప్పుకున్నారు. అద్భుతంగా న‌టించారు. అలాగే ఈ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ కూడా ఒక ఇంపార్టెన్స్‌తో సాగుతుంది. అలాగే మా ఇంట్లో కుక్క‌ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల వాటితో నాకు మంచి ర్యాపో ఏర్ప‌డింది. అందులో న‌టించ‌డం ఈజీ అయ్యింది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. అలాగే అనూప్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు., అనుకోకుండా జానీ జానీ ..పాట ట్యూన్ విని పాట రాశాను. పాట రాయ‌డం యాదృచ్చిక‌మే. ఆ పాట డైరెక్ట‌ర్‌కు న‌చ్చ‌డంతో ఆ పాట‌నే సినిమాలో పెట్టేశారు.

Raj Tarun interview gallery

అనూప్‌తో చేయ‌డం ఇప్ప‌టికీ కుదిరింది...
- ఈ సినిమాలో చాలా డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో న‌టించాను. ఉయ్యాలా జంపాల త‌ర్వాత అనూప్‌ను క‌లిశాను. అప్ప‌టి నుండి త‌న‌తో ప‌నిచేయాల‌నుకుంటున్నాను. త‌ను మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇస్తాడు. ఈ సినిమాలో త‌న‌తో కలిసి ప‌నిచ‌య‌డం ఆనందంగా ఉంది. అలాగే సాయిమాధ‌వ్ బుర్రాగారు రెండు పెద్ద సినిమాలు త‌ర్వాత మా సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. ఎంతటి విష‌యాన్ని అయినా సింపుల్‌గా సింగిల్ డైలాగ్‌లో చెప్ప‌గ‌ల‌గ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అలాగే వంశీకృష్ణ దొంగాట చిత్రానికి ప‌ని చేయ‌డం వ‌ల్ల ఈ సినిమాకు ఆయ‌న వ‌ర్క్ చేశారు. సినిమాలో ఐటెం సాంగ్ చాలా బాగా వ‌చ్చింది. సాంగ్‌పై కూడా సినిమా ర‌న్ అవుతుంది.

తదుప‌రి చిత్రాలు...
- ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో అంధ‌గాడు సినిమా చేస్తున్నాను. అలాగే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో రంజ‌ని అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved