pizza
Rakesh Shashi interview (Telugu) about Vijetha
`విజేత‌` క‌థ‌ను న‌మ్మి చేసిన సినిమా - రాకేశ్ శ‌శి
You are at idlebrain.com > news today >
Follow Us

10 July 2018
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మించిన చిత్రం `విజేత`. ర‌జ‌ని కొర్రపాటి నిర్మాత‌. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* చిరంజీవి అల్లుడ‌ని క‌ల్యాణ్‌దేవ్‌ను తీసుకున్నారా?
- లేదండీ. ఈ క‌థ కొత్త‌వారికైనా, ఎస్టాబ్లిష్డ్ హీరోల‌కైనా స‌రిపోతుంది. ఎవ‌రితోనైనా వెళ్ల‌మ‌ని నాకు మా నిర్మాత ఫ్రీడ‌మ్ ఇచ్చారు. ఇప్పుడు నేను వైజాగ్ స‌త్యానంద్‌గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి `మీరు ట్రైనింగ్ ఇస్తుంటారుగా. ఈ బ్యాచ్‌లో ఎవ‌రైనా ఉన్నారా` అని అడిగాను. ఆయ‌న నాకు క‌ల్యాణ్‌గారి గురించి చెప్పారు. అప్పుడు మాకు క‌ల్యాణ్ చిరంజీవిగారి అల్లుడ‌ని తెలిసింది.

* `విజేత‌` క‌థ ఏంటి?
- తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే క‌థ ఇది. ఇప్ప‌టి వర‌కు మేం ఇచ్చిన టీజ‌ర్స్ లో, పోస్ట‌ర్స్ లో ఈ విష‌యాన్ని రివీల్ చేస్తూ వ‌చ్చాం. అయితే ఇది మ‌న‌లో ఉన్న 90 శాతం మంది క‌థ‌. మ‌న దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ‌. సో.. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జ‌ర్నీ అనేది చాలా విష‌యాల‌తో కూడుకుని ఉంటుంది. ఆ జ‌ర్నీలో బాధ‌లు, సంతోషాలు, అవమానాలు.. చాలా ఉంటాయి. వాట‌న్నిటినీ ప్ర‌తిబింబించేది `విజేత` క‌థ‌. ఈ సినిమాలో శ్రీనివాసరావు అని ఓ ఫ్యాక్ట‌రీ ఎంప్లాయీ, అత‌ని కొడుకుగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌గా రామ్ పాత్ర‌లు హైలైట్ అవుతాయి. వాళ్ల ఫ్యామిలీ ఎలాంటి ప‌రిస్థితుల‌ను దాటుకుని ముంద‌డుగేసింది అనేది సినిమా.

* ఎప్పుడూ తండ్రిని గొప్ప‌గా, కొడుకును బేవ‌ర్స్ గానే చూపిస్తారెందుకు?
- అదీ క‌థే. ఇదీ క‌థే. నేను ఈ క‌థ‌ను తీసుకున్నాను. అయితే ఒక‌రి ఎదుగుద‌ల‌ను చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాం మ‌నం.

* చిరంజీవి `విజేత‌`కు ఈ `విజేత‌`కు పోలిక‌లుంటాయా?
- పాత విజేత‌తో ఎక్క‌డా పోలిక‌లు ఉండ‌వు. ఈ క‌థ‌ని మేం అనుక‌న్న‌ప్పుడు చాలా టైటిల్స్ పెట్టుకున్నాం. ఒక మనిషి విజ‌యం మీద‌నే క‌థ సాగుతుంది కాబ‌ట్టి ఇదే ప‌ర్ఫెక్ట్ టైటిల్ అని ఈ టైటిల్‌ని పెట్టాం.

* టైటిల్ అనుకోగానే చిరంజీవి `విజేత‌`తో పోలిక‌లు వ‌స్తాయ‌ని అనుకోలేదా?
- చిరంజీవిగారి టైటిల్‌ని పోల్చుకుని మా సినిమాకు వ‌స్తార‌నే భ‌యాలు ఏం లేవు. చిరంజీవిగారి ప‌ర్మిష‌న్ తీసుకుని ఈ టైటిల్ పెట్టాం.

interview gallery



* ఈ క‌థ‌ను చిరంజీవికి చెప్పారా?
- ముందు క‌ల్యాణ్‌గారికి చెప్పాను. రెండు రోజుల దాకా ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. స‌రే న‌చ్చ‌లేదేమో అనుకున్నా. ఒక రోజు ఫోన్ చేసి చిరంజీవిగారికి క‌థ చెప్ప‌మ‌న్నారు. స‌రేన‌ని వెళ్లాను. చిరంజీవిగారు క‌థ మొత్తం విని నువ్వు నాకు ఏం చెప్పావో అది తీయి చాలు అని అన్నారు. ఆయ‌న అనుభ‌వంతో కొన్ని స‌జెష‌న్స్ కూడా ఇచ్చారు. ఆ మ‌ధ్య డీఐ కాక‌ముందు ఓ సారి సినిమా చూశారు. ఆయ‌న‌కు చాలా బాగా న‌చ్చింది. న్యూ క‌మ‌ర్ మీద ఫ్రెష్‌గా సాగే క‌థ ఇది. ఎస్టాబ్లిష్డ్ హీరో ఎవ‌రికైనా సూట్ అవుతుంది. క‌థ‌లో విష‌యం ఉంద‌ని ముందునుంచీ న‌మ్మ‌కంతో ఉన్నాం. చిరంజీవిగారి అల్లుడు రావ‌డం సినిమాకు ప్ల‌స్ అయింది.

* ఈ సినిమా కోసం క‌ల్యాణ్ ఎలా మౌల్డ్ అయ్యారు?
- క‌ల్యాణ్‌గారు చిన్న‌ప్ప‌టి నుంచి రిచ్ ఫ్యామిలీలో పెరిగారు. ఆయ‌న చూడ‌ని చాలా లైఫ్ ఈ సినిమాలో ఉంది. అందుకోసం చాలా హోమ్ వ‌ర్క్ చేశారు. కొత్త విష‌యాల‌ను నేర్చుకోవాల‌నే త‌త్వం ఉన్న అబ్బాయి త‌ను. అది మాకు న‌చ్చింది.

* హీరోయిన్ పాత్ర గురించి చెప్పండి?
- మాళ‌విక న‌టించిన ఇంత‌కు ముందు సినిమాలు నాకు న‌చ్చాయి. ఇందులో ఇండిపెండెంట్ విమెన్‌గా న‌టించింది. కేర‌క్ట‌ర్‌లో వేరియేష‌న్ ఉంది.

* ఇది మీ ఊహ‌లో నుంచి పుట్టిన స‌బ్జెక్టా?
- ఇది క‌ల్ప‌న కాదు. నేను పుట్టిందే మిడిల్ క్లాస్‌లో. నా ఫ్రెండ్స్ చాలా మందిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా 12 ఏళ్ల‌ప్పుడు మా నాన్న పోయారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పేరు చెడ‌గొట్ట‌కుండా ఉండ‌టానికి మేం ఎలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అవ‌న్నీ సినిమాలో ఉండ‌వు కానీ, నేను చూసిన జీవితం ఉంటుంది.

* మీ గురించి చెప్పండి?
- ఎమ్మెస్సీ ఇండ‌స్ట్రియ‌ల్ ఎల‌క్ట్రానిక్స్ చేశాను. 2006లొ హైద‌రాబాద్ వ‌చ్చా. 2007లో రాఘ‌వేంద్ర‌రావుగారి `రేప‌టి ద‌ర్శ‌కులు`లో టాప్ టెన్‌లో ఉన్నాను. ఆ త‌ర్వాత `ర‌క్త‌చ‌రిత్ర‌`లో డైలాగ్ వెర్ష‌న్ కూడా రాశాను. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ , చిన్నికృష్ణ‌గారి ద‌గ్గ‌రా ప‌నిచేశాను. `రుద్ర‌మ‌దేవి`కి డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేస్తూ బ‌య‌టికి వ‌చ్చాను. విజ‌య‌వాడ జ‌గ్గ‌య్య‌పేట మాది.

* కోడి సాంగ్ పెట్టాల‌ని ఎందుకు అనిపించింది?
- స‌ర‌దాగా అక్క‌డో సాంగ్ పెట్టాలి. మందు సాంగ్ వంటివ‌న్నీ మామూలే. స‌రే ఏం చేద్దామా అని అనుకుంటుండ‌గా కోడికి సంతాపం చెప్తే బావుంటుందని అనిపించింది. ఆ ఐడియా చెప్ప‌గానే రామ‌జోగయ్య‌శాస్త్రిగారు నేను రాస్తాను అని అన్నారు. చాలెంజింగ్‌గా తీసుకుని రాశారు. హిట్ అయింది.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved