pizza
Rakul Preet Singh interview about Dhruva
వాళ్లు అప్రోచ్ కాగానే ఎయిత్ వండ‌ర్ అనిపించింది - ర‌కుల్ ప్రీత్ సింగ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

14 December 2016
Hyderaba
d

ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు స‌క్సెస్‌ఫుల్ నాయిక‌. చేతినిండా చిత్రాల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన `ధ్రువ‌` విడుద‌లైంది. ఈ సినిమా గురించి, త‌న కెరీర్ ప్లాన్స్ గురించి ర‌కుల్ చాలా విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. ఆ విశేషాల స‌మాహారం...

*ధ్రువ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారా?
- అవునండీ. చాలా హ్యాపీగా ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థ‌, సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం, రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న చేసిన సినిమా తొలి షో నుంచే ఇంత పెద్ద హిట్ టాక్‌తో న‌డ‌వ‌డం చాలా హ్యాపీగా అనిపించింది.

* ప‌రేషానురా పాట కోసం వాట‌ర్ మెల‌న్ డైట్ చేశార‌ట క‌దా?
- అది వాట‌ర్ మిల‌న్ డైట్ కాదు. ఆ పాట కోసం అంద‌రూ చాలా శ్ర‌ద్ధ తీసుకున్నారు. అలాగే నేను కూడా నా వంతు శ్ర‌ద్ధ‌ను తీసుకున్నాను. మనం మామూలుగా తిన్నా, నీళ్లు తాగినా పొట్ట కాస్త ఉబ్బెత్తుగా క‌నిపిస్తుంది. అలా క‌నిపించ‌కుండా ఉండేలా ఈ పాట కోసం జాగ్ర‌త్త తీసుకున్నాను. ఉద‌యం 9.30నుంచి సాయంత్రం వ‌ర‌కు నీళ్లు కూడా తాగేదాన్ని కాదు. ఎప్పుడైనా మ‌రీ దాహంగా అనిపిస్తే నోరు త‌డుపుకునేదాన్ని. నీర‌సంగా ఉంటే పుచ్చ‌కాయ ముక్క‌లు ఒక‌టో, రెండో తినేదాన్ని. అలా నాలుగు రోజులు చేశాను. షూటింగ్ పూర్త‌వ‌గానే `ర‌కుల్‌కి ఫుడ్ పెట్టండి` అంటూ అంద‌రూ చాలా కేర్ తీసుకునేవారు.

* ఒకసారి ప‌నిచేసిన‌వారితో మ‌ళ్లీ చేసిన‌ప్పుడు ఎలా అనిపిస్తుంది?
- బేసిగ్గా కంఫర్ట్ లెవ‌ల్స్ పెరుగుతాయి. ఒక‌సారి ప‌నిచేసిన త‌ర్వాత వారి ప్ర‌వ‌ర్త‌న మ‌న‌కు తెలుస్తుంది. చాలా మంది ద‌ర్శ‌కులు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవ‌డం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక‌సారి చేసిన త‌ర్వాత వారేం చెప్తున్నారో ఇట్టే అర్థ‌మైపోతుంది. నిర్మాణ సంస్థ ద‌గ్గ‌ర నుంచి సురేంద‌ర్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ వ‌ర‌కు అంద‌రితోనూ ఇంత‌కు ముందు ప‌నిచేశాను. వాళ్ల‌తో మ‌ర‌లా చేయ‌డం హ్యాపీగా అనిపించింది.

* రామ్‌చ‌ర‌ణ్‌తో ఇంత‌కు ముందు చిత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో మ‌ళ్లీ ఈ అవ‌కాశాన్ని ఎక్స్ పెక్ట్ చేశారా?
- అస‌లు లేదండీ. న‌న్ను అప్రోచ్ కాగానే ఎయిత్ వండ‌ర్ అనిపించింది. కానీ సినిమా జ‌యాప‌జ‌యాల‌ను న‌టీన‌టులు నిర్ణ‌యిస్తారా? హిందీలో షారుఖ్‌, కాజోల్‌ని హిట్ పెయిర్ అంటారు. అలాగ‌ని వారు చేసిన సినిమాల‌న్నీ హిట్ అయ్యాయా? అలాగే స‌ల్మాన్‌, రాణి చేసిన సినిమాల‌న్నీ హిట్ అయ్యాయా? సినిమా స‌క్సెస్‌ని నిర్ణ‌యించే పండితులం మేం అయితే ప్ర‌తి సినిమానూ స‌క్సెస్ చేసుకుంటాం క‌దా. `కిక్‌2` బాగా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ సురేంద‌ర్‌రెడ్డిగారు నా మీద న‌మ్మ‌కంతో ఈ సినిమాను ఇచ్చారు.

Rakul Preet Singh interview gallery

* నాన్న‌కు ప్రేమ‌తో చిత్రానికి డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాకు ఎందుకు చెప్ప‌లేదు?
- నేను చెబుదామ‌నే అనుకున్నా. సూరి కూడా చెప్ప‌మ‌నే అన్నారు. కానీ నేను చాలా బిజీగా ఉన్నాను. ఒక‌రోజు ఒక చోట ఉంటే, ఇంకో రోజు ఇంకెక్క‌డో ఉండేదాన్ని. నా ప‌రిస్థితిని అర్థం చేసుకున్న అల్లు అర‌వింద్‌గారు `ఫ‌ర్వాలేదు` అని అన్నారు.

* `త‌ని ఒరువ‌న్‌` ఒరిజిన‌ల్ చూశారా?
- విడుద‌లైన‌ప్పుడే చూశానండీ. ఏ సినిమా అయినా విడుద‌ల కాగానే చూస్తాను. మ‌రీ ముఖ్యంగా తెలుగు, త‌మిళ చిత్రాలు.

* మిమ్మ‌ల్ని చూసి ఎవ‌రైనా మీలా డైట్ చేస్తే?
- బాగా తినండి. డైటింగ్ ని నేనెప్పుడూ ప్రోత్స‌హించ‌ను. ఏం తింటే మంచిదో తెలుసుకుని తిన‌మంటాను. నాకు తండి విష‌యంలో ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుంది. ప్లేట్‌లో ఉన్న ఐట‌మ్స్ ని బ‌ట్టి అవి ఎన్ని కేల‌రీలు ఉంటాయో, వాటిలో మ‌న‌కెన్ని కావాలో చెప్పేయ‌గ‌ల‌ను. అందువ‌ల్ల ఎక్కువ కేల‌రీ ఫుడ్ తీసుకోను. అంతెందుకు కేర‌వాన్ లోనూ ఎప్పుడూ హెల్త్ మేగ‌జైన్స్ చ‌దువుతుంటాను. కాబ‌ట్టి నాకు అవ‌గాహ‌న ఉంది. అందుకే చేశా. న‌న్ను చూసి ఎవ‌రూ చేయొద్ద‌నే అంటాను.

* ఓవ‌ర్‌నైట్ స్టార్ అయ్యారు. మీలో ఏమైనా మార్పు వ‌చ్చిందా?
- మీకు అలా అనిపిస్తోందా? నేనేం ఓవ‌ర్‌నైట్ స్టార్‌ని కాలేదు. స్టార్‌ని కావ‌డానికి చాన్నాళ్లే ప‌ట్టింద‌నిపిస్తోంది. అయినా నేను షూటింగ్ పూర్త‌యితే ర‌కుల్‌గానే ఉంటాను. ఆరు త‌ర్వాత స‌రిగా త‌ల కూడా దువ్వుకోను. కానీ బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఓ న‌టిగా సిద్ధం కాక త‌ప్ప‌దు కాబ‌ట్టి రెడీ అవుతుంటాను.

* తెలుగు ఫుల్‌గా నేర్చుకున్న‌ట్టున్నారు?
- నేర్చుకోవ‌డం కాదు.. తెలుగులోనే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను పూర్తిగా తెలుగ‌మ్మాయినే అయిపోయాను.

* మీ సోద‌రుడు కూడా న‌ట‌న‌లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టున్నారు?
- త‌ను తెలుగు నేర్చుకుంటున్నాడు. త‌న‌ప‌రంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

* ఈ జ‌న‌వ‌రి 1న ఎక్కడుంటారు?
- గోవాకి ట్రిప్ వెళ్తున్నా. గ‌త నాలుగేళ్లుగా ఎక్క‌డికీ వెళ్ల‌లేదు. ఈ సారి మాత్రం పాతిక మంది క‌లిసి గోవాలో సెల‌బ్రేట్ చేసుకోబోతున్నాం.

* మీ డ్రీమ్ డైర‌క్ట‌ర్ ఉన్నారా?
- రాజ‌మౌళిగారితో చేయాల‌ని ఉంది. ఆయ‌న పిలిస్తే అలా వెళ్లిపోతానంతే.

* ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలేంటి?
- మ‌హేశ్ చిత్రం, కార్తితో ఓ సినిమా, నాగ‌చైత‌న్య‌తో ఓ చిత్రం, సాయిధ‌ర‌మ్‌తేజ్ సినిమా.. ఇలా ఐదారు చిత్రాలున్నాయి.

* నాగ‌చైత‌న్య చిత్రంలో ఎలాంటి పాత్ర చేయ‌బోతున్నారు?
- ఎలాంటి పాత్ర‌లో న‌న్ను నేను చూసుకోవాల‌ని ఇన్నాళ్లు క‌ల‌లు క‌న్నానో, అలాంటి పాత్ర చేయ‌బోతున్నాను. `విన్న‌ర్‌`లో అథ్లెట్ పాత్ర చేస్తున్నా.

* మీ డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
- పూర్తి స్థాయి రొమాంటిక్ చిత్రం చేయాల‌ని ఉంది. మ‌ణిర‌త్నంగారి ఓకే బంగారం త‌ర‌హా సినిమా అన్న‌మాట‌.

*విశాల్ చిత్రాన్ని వ‌దులుకున్న‌ట్టున్నారు?
- డేట్లు ప్రాబ్ల‌మ్ వల్ల వ‌ద‌లాల్సి వ‌చ్చింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved