pizza
Rakul Preet Singh interview (Telugu) about Jaya Janaki Nayaka
ఇప్ప‌టిదాకా నేను చేసిన పాత్ర‌ల్లో మోస్ట్ ఎమోష‌న‌ల్ పాత్ర ఇదే - ర‌కుల్ ప్రీత్‌సింగ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

2 August 2017
Hyderabad

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `జ‌య‌జాన‌కినాయ‌క‌`. ఆగ‌స్ట్ 11న సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట‌ర్వ్యూ...

* `జ‌య‌జాన‌కి నాయ‌క` గురించి చెప్పండి?
-` జ‌య జాన‌కి నాయ‌క` అంద‌రికీ తెలిసిన‌ట్టు బోయ‌పాటి సార్ స్కూల్ నుంచి డిఫ‌రెంట్ ట్రీట్‌మెంట్‌తో వ‌చ్చిన సినిమా. బోయ‌పాటి సార్ సిగ్నేచ‌ర్ యాక్ష‌న్ ఉంటుంది. ఆయ‌న సిగ్నేచ‌ర్ ఉంటుంది. ఇందులో మెయిన్ యాస్పెక్ట్ ఏంటంటే ల‌వ్‌స్టోరీ. ఇప్పుడు ఈ టైమ్‌లో ఇలాంటి ల‌వ్ నిజంగా ఉంటే ఎలా ఉంటుంది? పాత‌త‌రంలో ల‌వ్‌స్టోరీస్‌లో చాలా శాక్రిఫైస‌స్ ఉంటాయి. ఇప్పుడు అలాంటివి ఉండ‌వు. సో.. ఇప్పుడు రియ‌ల్ ల‌వ్ ఏంట‌న్న‌ది ఆయ‌న చూపించాల‌నుకున్నారు. దాన్ని బ‌ట్టే క‌థ‌ను అల్లారు. ఇందులో నా పాత్ర పేరు జాన‌కి. ఇందులో నాకు రెండు వేరియేష‌న్స్ ఉంటాయి. చాలా బ‌బ్లీ నార్మ‌ల్‌, కాలేజ్ గోయింగ్‌, ఫ‌న్నీ, ఓవ‌ర్ ఇనిషియేటివ్ తీసుకునే గ‌ర్ల్. ఫ్యామిలీ అంటే బాగా ఇష్ట‌ప‌డే అమ్మాయి. ఒక ఇన్సిడెంట్ వ‌ల్ల ఆమె మొత్తం లైఫ్ మారిపోతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఎక్క‌డ‌? అనేది ఈ సినిమాలో చాలా కీల‌కం.

* నెగ‌టివ్ ట‌చ్ ఉంటుందా?
- నెగ‌టివ్ ఉండ‌దండీ... కానీ లైఫ్‌లో జ‌రిగిన ఒక ఇన్సిడెంట్ వ‌ల్ల ఆమె ఎందుక‌లా శాడ్‌గా మారింది? అనేది ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టిదాకా నేను చేసిన పాత్ర‌ల్లో మోస్ట్ ఎమోష‌న‌ల్ పాత్ర ఇదే. ఆ ఫీల్‌గానీ, అమ్మాయి చేరుకునే డిప్రెష‌న్‌గానీ.. ఏదైనా నిజంగా.. అలాగే ఉండేది. ప‌ది రోజులు ఆ షెడ్యూల్‌ని చిత్రీక‌రిస్తే టోట‌ల్ ప‌ది రోజులూ నేను డిప్రెస్‌లోనే ఉన్నాను. ఎందుకంటే నేను ఆ రోల్‌ని ప్లే చేస్తున్నాను కాబ‌ట్టి... అందులో నుంచి బ‌య‌ట‌కు రాలేను కాబ‌ట్టి. ఆ స‌మ‌యంలో మా అమ్మ ఫోన్ చేసినా స‌రే నేను మాట్లాడ‌క‌పోయేదాన్ని. బీయింగ్ లో.., ఫీలింగ్ లో... దాని కోసం చాలా ఎన‌ర్జీ కావాల్సి వ‌చ్చేది.

* డిప్రెష‌న్ అనేది నేచుర‌ల్‌గా జ‌రుగుతుంది క‌దా.. దాన్ని సినిమాలో ఎలా ప్రెజెంట్ చేశారు?
- అంటే డిప్రెష‌న్ అనేది డిస్ క‌నెక్ట్ యువ‌ర్‌సెల్ప్ అన్న‌మాట‌. షూటింగ్ స‌మ‌యంలో నార్మ‌ల్ మూడ్‌లో ఉంటే ఫోన్లు చూసుకోవ‌చ్చు, చాట్ చేసుకోవ‌చ్చు.. ఏదైనా చేసుకోవ‌చ్చు. కానీ మ‌నం డిప్రెష‌న్ మూడ్‌లో ఉంటే మాత్రం అవ‌న్నీ చాలా క‌ష్టం. ఇందాక చెప్పిన‌ట్టు మా అమ్మ ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడ‌లేవా? అని అడిగినా స‌రే.. `మాట్లాడ‌లేను` అనే చెప్పేదాన్ని. ఎందుకంటే కేర‌క్ట‌ర్‌ని నేను ఆ విధంగా క్యారీ చేశాన‌న్న‌మాట‌. ఎందుకంటే ఏదో దుఃఖం వ‌చ్చింద‌న్న‌ట్టే ఉండేదాన్ని.

* అప్పుడు మీ మైండ్ స్టేట్ ఎలా ఉండేది?
- చాలా బ్లాంక్‌గా ఉండేదాన్ని. చాలా మంది లైఫ్‌లో జ‌రిగిన ఏదో ప్ర‌మాదాన్నో, చెడునో ఊహించుకుని శాడ్‌గా ఉంటారు. కానీ భ‌గ‌వంతుడు ద‌య‌వ‌ల్ల నా లైఫ్‌లో ఎప్పుడూ ఏ బ్యాడూ జ‌ర‌గ‌లేదు.

అందువ‌ల్ల అలాంటివాటిని త‌ల‌చుకోవాల్సిన అవ‌స‌రం నాకు ఎప్పుడూ రాలేదు. అందువ‌ల్ల నేను బ్లాంక్‌గా ఉండేదాన్ని. బోయ‌పాటి సార్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `షాట్ అయిపోయింది... నువ్వు న‌వ్వొచ్చు కాస్త‌` అని అనేవారు. అప్పుడు న‌వ్వేదాన్ని.

* సో దీన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు?
- ప్యాక‌ప్ త‌ర్వాత నేను నార్మ‌ల్ లైఫ్‌ని లీడ్ చేసేదాన్ని. ఎందుకంటే చాలా మందికి కేర‌క్ట‌ర్ల ఇంపాక్ట్ ఉంటుంది. కొంద‌రు డిప్రెష‌న్‌లోకి వెళ్తామ‌ని అంటారు. కానీ నేను అలా కాదు.. ప్యాక‌ప్ కాగానే నేను ర‌కుల్‌నే. జాన‌కిని కాదు. నేను మామూలుగా సినిమాల‌కు వెళ్లేదాన్ని. మా త‌మ్ముడితో స‌ర‌దాగా ఉండేదాన్ని. జాలీగా ఉండేదాన్ని.

* డిప్రెష‌న్‌లో ఉన్న సీన్ల‌ను ఎన్ని రోజులు షూట్ చేశారు?
- రేప‌ల్లె ఎపిసోడ్‌, బ్యాంకాక్ ఎపిసోడ్ అలా చేసిందే. దాదాపుగా 25 రోజులు డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్టు ఉన్నానంతే.

* గ్లిజ‌రిన్ వాడేవారా?
- దేవుడిద‌య‌వ‌ల్ల గ్లిజ‌రిన్ లేకుండా ఏడ‌వాల్సిన అవ‌స‌రం నాకు రాలేదు. కాక‌పోతే గ్లిజ‌రిన్ వాడి వాడి సాయంత్రానికి నా క‌ళ్లు రెండూ బాగా ఉబ్బేవి. నేనొక‌సారి బోయ‌పాటిగారితో కూడా అన్నాను.. `సార్‌.. ఈ షెడ్యూల్ అయ్యేస‌రికి నా క‌ళ్ల కింద చార‌లు వ‌చ్చేట‌ట్టున్నాయి. రోజూ క‌ళ్లు వాయ‌డం, నేను ఐస్ ప్యాక్ పెట్ట‌డం అవుతోంది..` అని.

సినిమాలో హీరోయిన్ ఏదో ఒక సీన్‌లో ఏడుస్తుంది.. కానీ కేర‌క్ట‌ర్ మొత్తం ఏడ‌వ‌డ‌మ‌నేది కొత్త‌గా ఉంటుంది.

interview gallery

* సినిమాల‌ను చూసి ఏడ్చే అల‌వాటుందా మీకు..?
- సినిమా మొత్తం చూసి నేనెప్పుడూ ఏడ‌వ‌లేదు. ఎప్పుడో ఒక‌టీ, అరా సీన్ల‌కు క‌న్నీళ్లు పెట్టుకునేదాన్ని. కానీ `నిన్నుకోరి` సినిమా చూసి చాలా వ‌ర‌కు ఏడుస్తూనే ఉన్నా. మా త‌మ్ముడు ప‌క్క‌న కూర్చుని నాకు టిష్యూలు పాస్ చేస్తూ ఉన్నాడు. నానికి ఫోన్ చేసి `ఏడిపించేశావు.. అలా ఎందుకు ఏడిపించావ్‌.. మీ ఇద్దరు క‌ల‌వాలి క‌దా` అని కూడా అన్నాను. ఎందుకంటే నేను హార్డ్ కోర్ రొమాంటిక్‌. అందుకే నాకు ట్రాజిక్ ల‌వ్ స్టోరీ న‌చ్చ‌లేదు.

* ఈ సినిమా కూడా ట్రాజిక్ ఎండింగ్ ఉంటుందా?
- ఎండింగ్ ఇప్పుడు చెప్పేస్తే జ‌నాలు ఎందుకు చూస్తారండీ..

* బోయ‌పాటి ఇలాంటి టైటిల్ పెడ‌తార‌ని అనుకున్నారా?
- సినిమాకు ఏం కావాలో, ఎలా ఉంటే బావుంటుందో.. ఇంకేం చేయాలో బోయ‌పాటిగారికి బాగా తెలుసు. సెట్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ప్ల‌స్‌లూ, మైన‌స్‌లూ ఆయ‌న‌కు తెలుసు. ఈ సినిమా కంప్లీట్‌గా జాన‌కి సినిమా. ఈ సినిమాకు హార్డ్ టైటిల్ పెట్టాల‌ని ఆయ‌న అనుకోలేదు. అందుకే ఆయ‌న ఈ టైటిల్‌ని పెట్టారు. ఇందులో యాక్ష‌న్ ఉంది.. ఇంకోటి ఉంది.. అయినా వాట‌న్నిటికీ రీజ‌న్ జాన‌కి కావ‌డంతో ఆ టైటిల్ పెట్టారు. ముస‌ల‌మ్మ‌ల నుంచి, మ‌న‌వ‌రాళ్ల వ‌ర‌కు అంద‌రూ క‌లిసి చూసేలా ఉంటుంది సినిమా.

* బోయ‌పాటికి మీ స్ట్రెంగ్త్ లు, వీక్‌నెస్‌లు తెలుస‌న్నారుగా.. మీకు ఆయ‌న ఎప్పుడైనా వాటి గురించి చెప్పారా?
- - చెప్పారు. నేను క‌రెక్ట్ చేసుకున్నా. వాటి గురించి ఇప్పుడు చెప్ప‌లేను.

* మీ ప్ర‌కారం మీకున్న ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఏంటి?
- నా బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు ప్ర‌జ‌లే చెప్పాలి. మ‌నం ప్ర‌తిదీ ప‌ర్ఫెక్ట్ గా చేస్తామ‌నే అనుకుంటాం. కానీ అందులో ఎంత బ‌ల‌మో, ఏది బ‌ల‌హీన‌తో మాత్రం ప్ర‌జ‌లే చెప్పాలి.

* సినిమా అయిపోయిన త‌ర్వాత క్యార‌క్ట‌ర్ హ్యాంగోవ‌ర్‌లో ఉంటారా?
- అబ్బే లేదండీ.. అదే పీలింగ్‌లో ఉండే అమ్మాయిని కాదు నేను. ఎందుకంటే క్యార‌క్ట‌ర్ మ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఓవ‌ర్‌టేక్ చేయ‌కూడ‌దు. ఒక‌వేళ చేసిందంటే సైకోలా మారుతారు. ఎందుకంటే ఇన్నేసి పాత్ర‌లు చేసిన త‌ర్వాత‌, ఆ పాత్ర‌ల ప్ర‌భావం మ‌న మీద ఉంటే డిప్రెస్ అవుతాం. లేకుంటే ఇన్ సెక్యూర్‌గా ఫీల‌వుతాం, లేకుంటే చాలా ఓవ‌ర్ కాన్షియ‌స్‌గా త‌యార‌వుతాం.. ఇదంతా క‌రెక్ట్ కాదు.. హ్యాపీగా మాత్రం ఉండ‌లేరు.

* ఈ సినిమాలో మీ హార్ట్ ని ట‌చ్ చేసిన స‌న్నివేశాలున్నాయా?
- ఉన్నాయండీ. నేను సినిమాను ఆడియ‌న్‌గా చూసిన‌ప్పుడు వాటిని ఫీల‌వుతాను. అంతేగానీ సీన్ చేసేట‌ప్పుడు నేను హార్ట్ ని ట‌చ్ చేస్తుంద‌ని అనుకోను. ఎందుకంటే నేను అక్క‌డ ర‌కుల్‌ని కాదు.. జాన‌కిని మాత్ర‌మే.

* భ్ర‌మ‌రాంబ‌కి, జాన‌కికి పోలిక‌లుంటాయా?
- లేదండీ.. చాలా తేడాలున్నాయా?

* ట్రైల‌ర్‌లో జాన‌కి మార్చింద‌ని అంటారు.. మీరు మార్చారా?
- అది సినిమా చూసి తెలుసుకోవాలి.

* వ‌దులుకోవాల్సిన ప్ర‌తిసారీ.. ప్రేమ‌నే వ‌దులుకోవాలా.. అనే డైలాగ్ కూడా ఉన్న‌ట్టుంది..?
- అది నా ఫేవ‌రేట్ డైలాగ్ అండీ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved