pizza
Ram interview (Telugu) about Hello Guru Prema Kosame
ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోష‌న‌ల్ పాయింట్‌తో తెర‌కెక్కిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` - రామ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

13 October 2018
Hyderabad

రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హలో గురు ప్రేమకోసమే'. దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న సినిమా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్‌తో ఇంటర్వ్యూ.

అప్పుడు ఎంజాయ్‌ చేశా!!
ఫస్ట్‌టైమ్‌ ప్రసన్న రఫ్‌గా స్టోరి చెప్పారు. అప్పుడు నేను సైలెంట్‌గా విన్నాను. మూడు నెలల్లో స్టోరి డెవలప్‌ చేసిన తర్వాత మళ్లీ కథ చెప్పాడు. రెండోసారి చెప్పినప్పుడు కథని బాగా ఎంజాయ్‌ చేశాను.

సరికొత్త కోణంలో!!
బేసిగ్గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇప్పటివరకూ చాలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో సినిమా వుంటుంది. ఆ పాయింట్‌ని ఈ యాంగిల్‌లో కూడా చూడొచ్చా అనేలా స్టోరిని డెవలప్‌ చేశారు. విన్నప్పుడు ఎంత ఎంజాయ్‌ చేశానో.. ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూసినప్పుడూ అంతే ఎంజాయ్‌ చేశాను.

క్యారెక్టర్‌ గురించి!!
ఇందులో నాది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్ర. పల్లెటూరి నుండి పట్నం వచ్చిన యువకుడిగా నటించాను. విలేజ్‌ అబ్బాయిలా ఐదు నిమిషాలు మాత్రమే కనబడతాను. సిటీకి వచ్చాక సాఫ్ట్‌వేర్‌ అబ్బాయిగా ఒక కొత్త లుక్‌లో కనబడతాను.

ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌చేసేలా!!
ఇప్పటి వరకూ డైరెక్టర్‌ చేసిన సినిమాలన్నీ మాస్‌ ఓరియెంటెడ్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా వుంటుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ని మిక్స్‌ చేసి తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల్లో హీరో.. హీరోయిన్‌ తండ్రితో ఛాలెంజ్‌ చేసే స్టైల్లో వుంటుంది. ఈ సినిమాలో అలా కాకుండా ఎమోషనల్‌ కంటెంట్‌ వుంటుంది. సినిమా మెయిన్‌ పాయింట్‌, డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా వుంటాయి. సినిమా ప్రధానంగా నాది, ప్రకాష్‌రాజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ మధ్యనే రన్‌ అవుతుంది. కామెడీ కూడా సన్నివేశాల పరంగానే వుంటుంది. సెపరేట్‌ కామెడీ ట్రాక్‌ అంటూ ఉండదు.

ఇద్ద‌రి మ‌ధ్య మంచి ర్యాపో ఉంది!!
డైరెక్టర్‌ త్రినాథరావు, రైటర్‌ ప్రసన్న మధ్య మంచి ర్యాపో ఉంది. త్రినాథరావు ఒక ఆడియన్‌లా సీన్‌ని అబ్జర్వ్‌ చేస్తాడు. ప్రసన్న పాత్రల గురించి సెట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తుంటారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు నేను, డైరెక్టర్‌, రైటర్‌ డిస్కస్‌ చేసుకున్న తర్వాతే షూట్‌కి వెళతాం.

interview gallery



స‌క్సెస్ కోస‌మే!!
సక్సెస్‌ కావాలని సినిమాలు చేయను. ప్రతి సీన్‌ సక్సెస్‌ కావాలని అనుకుంటాను. అలాంటి సమయాల్లో స్క్రిప్ట్‌ వర్కవుట్‌ అయితే సక్సెస్‌ అవుతాయి. సినిమా రిలీజ్‌ తర్వాత ఫలితాన్ని అనలైజ్‌ చేసుకుంటాను. నా దగ్గర వాళ్ళతో సినిమా డిస్కస్‌ చేస్తాను.

భ‌విష్య‌త్‌లో చేస్తా!!
ప్రవీణ్‌ సత్తారుగారితో సినిమా కొన్ని కారణాల వలన ముందుకెళ్ళలేదు. భవిష్యత్‌లో ఆయనతో సినిమా చేస్తాను.

ఎక్కువ సినిమాలు చేయాల‌ని!!
ఒక హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలనే నాకూ ఉంది. అయితే నన్ను ఎగ్జైట్‌ చేసే స్క్రిప్ట్స్‌ నాకు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మా పెదనాన్నగారు కూడా స్క్రిప్ట్స్‌ వింటారు. నాకు ఏమాత్రం నచ్చుద్ది అని ఆయనకు అనిపించినా నన్ను స్క్రిప్ట్‌ వినమంటారు.

స‌రైన స్క్రిప్ట్ దొర‌క‌లేదు!!

'రామ రామ కృష్ణ కృష్ణ' తర్వాత దిల్‌ రాజుతో చేస్తున్న సినిమా ఇది. మధ్యలో ఇద్దరం కలిసి సినిమాలు చేయాలనుకున్నాం. ఇద్దరికీ సరైన స్క్రిప్ట్‌ దొరకలేదు. దిల్‌ రాజుగారు ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. సినిమా మేకింగ్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అయి సినిమా బాగా రావాలనే తపన ఉన్న వ్యక్తి.

తదుపరి చిత్రాలు!!

కథలు వింటున్నాను.. ఫైనలైజ్‌ అయ్యాక చెప్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved