pizza
Ram interview (Telugu) about Hyper
`హైపర్` లో కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సోషల్ మెసేజ్ కూడా ఉంది – రామ్
You are at idlebrain.com > news today >
Follow Us

28 September 2016
Hyderaba
d

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంటగోపీచంద్‌ ఆచంటఅనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సెప్టెంబర్‌ 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ....

'హైపర్‌' టైటిల్‌ గురించి....
ప్రతి సినిమాను డిఫరెంట్‌గానే చేయాలని అనుకుంటాను. నా గత చిత్రం 'నేను శైలజచిత్రంలో నా నటన చాలా బావుందని మెచ్చుకున్నారు. క్లాస్‌ ఆడియెన్స్‌ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే నా స్టయిల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌యాక్షన్‌ను కోరుకునే ప్రేక్షకుల కోసం చేసిన సినిమా హైపర్‌. సినిమాకు హైపర్‌ అనే టైటిల్‌ను ఫైనల్‌ షెడ్యూల్‌ సమయంలో పెట్టారు. అయితే ఈ టైటిల్‌ను నాకోసం పెట్టమని ఫోర్స్‌ చేసినట్టుందని భావించి ముందు నేనేం మాట్లాడలేదు. అయితే పోస్టర్‌లో ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే క్యాప్షన్‌ చూడగానే టైటిల్‌ నాకు నచ్చింది.

'హైపర్‌'లో కొత్తదనమదే....
ఇది అన్నీ రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమని పోస్టర్స్‌టీజర్‌ట్రైలర్‌ చూడగానే అనిపించింది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధంతో పాటు మంచి సోషల్‌ మెసేజ్‌ ఉంటుంది. ప్రతి సినిమాలో నేను అమ్మాయి కోసమో,నాన్న కోసమోఅమ్మ కోసమో ఫైట్‌ చేసేవాడిని కానీ కానీ ఇందులో సోషల్‌ మెసేజ్‌ కోసం ఫైట్‌ చేస్తాను. అయితే నేను మెసేజ్‌ ఇస్తే నా ఏజ్‌కు సరిపోదు. అందుకని ఇందులో సత్యరాజ్‌ వంటి నటుడిని తీసుకున్నాం. దీనివల్ల సుగర్‌ కోటెడ్‌ ట్లాబెట్‌లా మనం చెప్పాలనుకున్న మెసేజ్‌ను చెప్పవచ్చు.

సత్యరాజ్‌ క్యారెక్టర్‌ గురించి....
మిర్చిబాహుబలినేను శైలజ వంటి సినిమాల్లో సత్యరాజ్‌గారి రోల్‌ చాలా సీరియస్‌గా ఉంటుంది. ఈ సినిమాలో సత్యరాజ్‌గారి రోల్‌ కామిక్‌గా ఉంటుంది. సాధారణంగా అందరికీ అమ్మ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను వివిధ సందర్భాల్లో చూపిస్తూనే ఉంటాం. అయితే నాన్నపై ప్రేమ ఉంటుంది. కానీ అది సందర్భానుసారం మాత్రమే బయటకు వస్తుంది. కానీ ఈ సినిమాలో హీరోకు నాన్నంటే ప్రేమ కాదు పిచ్చ ఉంటుంది. హీరో తన ప్రేమను అన్నీ సందర్భాల్లో ప్రదర్శిస్తుంటాడు. అది సినిమాలో ఆడియెన్స్‌కు కామెడిని పంచుతుంది.

Ram interview gallery

నిజ జీవితంలో తండ్రితో ఉన్న రిలేషన్‌....
రియల్‌ లైఫ్‌లో నాన్నతో మీరందరూ ఎలా ఉంటారో నేను అలాగే ఉంటాను. అయితే నాన్నకు భయపడను. భయం అనే కాన్సెప్ట్‌ లేకుండా ఇంట్లో నన్ను పెంచారు.

'హైపర్‌లవ్‌స్టోరీ కాదు....
- 'హైపర్‌లవ్‌స్టోరీ కాదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్‌ కూడా ఉంటుంది. దీంతో పాటు లవ్‌ అనే ఎలిమెంట్‌ కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడున్న హీరోయిన్స్‌లో రాశిఖన్నాకు కామెడి టచ్‌ ఎక్కువగా ఉంది. సుప్రీమ్‌ సినిమాలో కూడా అది ప్రూవ్‌ అయ్యింది. దాంతో రాశిఖన్నాను హీరోయిన్‌గా తీసుకున్నాం. ఈ సినిమాతో తను డ్యూయెల్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్‌లో కననపడుతుది.

14 రీల్స్‌ బ్యానర్‌లో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌...
- 14 రీల్స్‌ బ్యానర్‌ మొదటి సినిమా నేనే చేయాల్సింది కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. ఇక నిర్మాతలు గోపీచంద్‌ ఆచంటరామ్‌ ఆచంటఅనీల్‌ సుంకర విషయానికి వస్తే చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌. పైకి సాఫ్ట్‌గా కనపడతారు కానీ చాలా హైపర్‌ ఉన్న వ్యక్తులు. వారి హైపర్‌ కారణంగానే సినిమా మూడు నెలల్లో పూర్తయ్యింది.

దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ గురించి....
కందిరీగ తర్వాత నేనువాసు కలిసి చేసిన సినిమా. తనలో కూడా చాలా హైపర్‌ ఉంది. కందిరీగ సమయంలో వాసుకిహైపర్‌ సినిమాలోని వాసుకు చాలా తేడా ఉంది. తన మెచ్యురిటీ లెవల్స్‌ బాగా పెరిగాయి.

పెద్దగా టెన్షన్‌ పడటం లేదు...
సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్‌అయ్యి పదేళ్ళవుతుంది. సక్సెస్‌లుఫెయిల్యూర్స్‌తో కలిసి చాలా ఎత్తుపల్లాలను చూసేశాను కాబట్టి ఓ సెటిల్డ్‌ స్థితికి చేరుకున్నాను. టెన్షన్ పడితే ప్రతి విషయానికి టెన్షన్ పడొచ్చు, పడకూడదనుకుంటే కూల్ గా ఉండొచ్చు. అయితే ప్రతి సినిమా రిలీజ్‌ టైంలో బేసిక్‌ టెన్షన్‌ మాత్రం ఉంటుంది.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌....
ప్రస్తుతం 'హైపర్‌రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. కిషోర్‌ తిరుమల వెంకటేష్‌గారితో సినిమా తర్వాత నాతో సినిమా చేసే అవకాశం ఉంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved