pizza
Ram interview (Telugu) about Vunnadi Okate Zindagi
ల‌క్కిలీ ఈ చిత్రం కుదిరింది - రామ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 October 2017
Hyderabad

`నేను శైల‌జ‌` చిత్రంతో స‌క్సెస్ ఇచ్చిన కిశోర్ తిరుమ‌ల‌తో మ‌ర‌లా ట్రావెల్ చేశారు రామ్‌. వారిద్ద‌రి కాంబినేష‌నల్‌లో తాజాగా వ‌చ్చిన సినిమా `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ`. ఈ సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరో రామ్ మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ల‌వ్ ఫెయిల్యూరా అండీ..?
- ల‌వ్ పెయిల్యూర్ కాదుకానీ ఇంచుమించు అలాంటిదే.

* మ‌రి సినిమా ఏంటి?
- ఇందులో త్రీ ఫేసెస్ ఆఫ్ లైఫ్‌. చిన్న‌ప్పుడు, కాలేజీ, ఆ త‌ర్వాత‌.

* 15వ సినిమా కోసం చాలా క‌థ‌లు విన్నార‌ట క‌దా?
- 15వ సినిమా అని ప్ర‌త్యేకంగా అనుకోలేదు. ఫ‌స్ట్ నుంచి డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ తో వెళ్ల‌దామ‌ని అనుకున్నా. అది ల‌క్కీలీ ఈ సినిమాకు కుదిరింది.

* ఈ షూటింగ్ స‌మ‌యంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రైనా గుర్తొచ్చారా?
- ఈ సినిమాకు ముందు స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చున్న‌ప్పుడు మాత్రం ఏవో ఒక‌టీ రెండు సార్లు అనుకున్నాం. అంతేగానీ షూటింగ్ స‌మ‌యంలో ఎవ‌రూ గుర్తుకురాలేదు.

* ఇంత‌కీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రు?
- శ‌ర‌త్ అని.. చెన్నైలో ఉంటాడు. డాక్ట‌ర్‌.

* ఈ సినిమాలో జింద‌గీ గురించి ఏం చెప్తున్నారు?
- లైఫ్ అనేది సింపుల్‌. కాక‌పోతే మ‌నం కాంప్లికేట్ చేసుకుంటాం .

* ఇందులో రాక్‌స్టార్‌గా చేశారా?
- రాక్‌స్టార్ కాదండీ. రాక్ బ్యాండ్‌లో ఇత‌ను కీల‌క పాత్ర చేశాడు.

* ఇందులో కొత్త లుక్ ట్రై చేసిన‌ట్టున్నారు?
- ఈ సినిమా కోసం చేసిన లుక్ కాదండీ. ముందు నుంచే ఈ లుక్ అయితే బావుంటుంది అని అనుకున్నాం. బాగా సెట్ అయింది.

* `నేను శైల‌జ‌` సినిమాతో పోలిక ఉంటుందా?
- అస్స‌లు ఉండ‌దండీ. అందులో హ‌రి పాత్ర‌కీ, ఇందులో అభి పాత్ర‌కీ చాలా తేడా ఉంటుంది.

interview gallery

* కిశోర్ తిరుమ‌ల‌తో మ‌ర‌లా ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- చాలా బావుంది. మొద‌టి సినిమాతో కొద్దిగా తెలిశాడు. ఈ సినిమాతో త‌ను పూర్తిగా నాకు తెలిసిపోయాడు. ఇద్ద‌రి మ‌ధ్య చాలా మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉంటుంది. త‌న‌కి ఏదైనా ఒక ప‌నిని అప్ప‌గిస్తే చాలా బాధ్య‌త‌తో చేస్తాడు.

* హీరోయిన్ల గురించి చెప్పండి?
- లావ‌ణ్య పాత్ర త‌న రియ‌ల్ లైఫ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. కానీ అనుప‌మ మాత్రం అందుకు విరుద్ధం. ఈ సినిమాలో అనుప‌మ చేసిన హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది.

* మాస్‌ను అట్రాక్ట్ చేసే అంశాలేంటి?
- ఈ సినిమాలో హ్యూమ‌న్ ఎమోష‌న్స్ ఉంటాయండీ. క్లాస్‌, మాస్ తేడా లేకుండా అంద‌రికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ సినిమా ఆ ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించింది.

* దేవిశ్రీగారితో ఇంకోసారి న‌టించ‌డం ఎలా ఉంది?
- సినిమా ఎలా ఉన్నా.. దేవిశ్రీ అందించే సంగీతం మాత్రం హిట్ అయి తీరుతుంది అంటే. ఈ సినిమాకి కూడా చాలా హిట్ మ్యూజిక్ ఇచ్చాడు.

* మీ త‌దుప‌రి సినిమాలు ఏంటి?
- ఇంకా ఏమీ ఒప్పుకోలేదండీ. ప్ర‌స్తుతానికి స్క్రిప్ట్ వింటున్నాను. ఫైన‌లైజ్ అయితే నేనే అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved