pizza
Ram Charan interview (Telugu) about Dhruva
`ధృవ` విష‌యంలో టెన్ష‌న్‌, కాన్ఫిడెన్స్... రెండూ ఉన్నాయి - రామ్‌చ‌ర‌ణ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

7 December 2016
Hyderaba
d

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధృవ‌`. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో రామ్‌చ‌చ‌ర‌ణ్‌తో ఇంట‌ర్వ్యూ.....

రెండూ ఉన్నాయి....
- ధృవ విడుద‌ల‌కు ఉండాల్సిన టెన్ష‌న్‌, కాన్ఫిడెన్స్ రెండూ ఉన్నాయి. రీమేక్ కాబ‌ట్టి కాస్తా ఎక్కువ టెన్ష‌న్ ఉంద‌నాలి. ఎందుకంటే త‌మిళ్‌లో ఇది అల్‌రెడి ప్రూవ్ అయిన స‌బ్జెక్ట్‌. దాని కంటే బావుండాల‌ని అనుకుంటాం క‌దా.

ప‌ట్టింపులు లేవు....అందుకే న‌టించా...
- రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌దు, కొత్త క‌థ‌లే చేయాల‌నే ప‌ట్టింపులు మాకు ఉండ‌వు. క‌థ బావుంటే ఆ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపిస్తే బావుంటుంది కదా అని రీమేక్ చేస్తాం. రీమేక్ చేసినా అది సినిమాయే క‌దా. ప‌ర్టికుల‌ర్‌గా ధృవ సినిమా చేయ‌డానికి కార‌ణం ఎన్‌.వి.ప్ర‌సాద్‌గారు. ఎందుకంటే ఆయ‌న క‌థ న‌చ్చి సినిమా చేయ‌మ‌ని అడిగారు. ప్ర‌సాద్‌గారు సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్‌, ప‌క్కా మాస్ ప‌ల్స్ తెలిసిన నిర్మాత‌. అటువంటి ఆయ‌నే ఈ క‌థ‌ను నేను యాప్ట్ అవుతాన‌ని భావించి న‌న్ను అడిగిన‌ప్పుడు నేనెందుకు సినిమా చేయ‌కూడ‌ద‌నిపించి సినిమా చేశాను. ప్రీవియ‌స్ స‌క్సెస్‌లు, ఇమేజ్‌లు దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయ‌కూడ‌దు, చేయ‌డం లేదు. క‌థ‌ను బ‌ట్టి మారుతూ వెళుతుండాలి.

ఆయ‌న్ను చూసి టెన్ష‌న్ ప‌డ్డాను..
- అర‌వింద్‌స్వామిగారితో యాక్ట్ చేయ‌డానికి ముందు కాస్తా టెన్ష‌న్ ప‌డ్డాను. ఆయ‌న‌కేమో అల‌వాటైన సీన్స్‌, అల్రెడి త‌మిళంలో ఆయ‌న ప్రూవ్‌డ్, నేనెమో కొత్త‌గా చేయాలి క‌దా అనుకున్నాను. కానీ అర‌వింద స్వామిగారు కొత్త క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు ఫీలై చేయ‌డంతో నాకు టెన్ష‌న్ త‌గ్గింది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర‌ను అర‌వింద్‌స్వామిగారే చేయాలి. వేరే ఆప్ష‌న్స్ లేవు. అది కాకుండా తెలుగు ప్రేక్ష‌కులు అర‌వింద‌స్వామిగారిని తెర‌పై చూసి చాలా కాలం కావ‌డంతో ఆయ‌న్నే అప్రోచ్ అయ్యాం. ఆయ‌న కూడా ఒప్పుకున్నారు.

Ram Charan interview gallery

ఎప్పుడో చేయాల్సింది...
- సిక్స్‌ప్యాక్ ఎప్పుడో చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఈ సినిమాకు కుదిరింది. ప్ర‌తి సినిమాకు క‌ష్ట‌ప‌డుతూనే ఉంటాను. ఈ సినిమా విష‌యంలో ఎక్కువగా క‌న‌ప‌డుతుంది.

మార్పులు పెద్ద‌గా చేయలేదు...
- ఒరిజిన‌ల్ సబ్జెక్ట్‌కు ద‌గ్గ‌ర‌గా సినిమాను తీశాం. అయితే చిన్న చిన్న చేంజ‌స్ త‌ప్ప పెద్ద చేంజ‌స్ చేయ‌లేదు.

సురేంద‌ర్‌రెడ్డి గురించి...
- సురేంద‌ర్‌రెడ్డిగారు త‌న స్వంత క‌థ‌తో సినిమా చేయాల‌నుకున్నారు. కాబ‌ట్టి రీమేక్ విష‌యంలో ముందు ఆయ‌న పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. అయితే నేను క‌థ న‌చ్చి చేయమ‌ని అడ‌గంతో ఆయ‌న క‌థ‌ను ఓన్ చేసుకుని సినిమా చేశారు. త‌మిల్ కంటే బాగా చేయాలి కాబ‌ట్టి ఎలా చేయాల‌ని బాగా ఆలోచించి చేశాం.

నిర్మాత‌గా హ్య‌పీ...చిరంజీవి 150వ సినిమా గురించి...
- నాన్న‌గారు సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డం బానే ఉంది. వినాయ‌క్‌గారు సెట్స్ ఉంటున్నారు. కాబ‌ట్టి ఆయ‌నే ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో నా వ‌ర్క్ ఈజీగా ఉంది. టాకీ పార్ట్ అంతతా పూర్త‌య్యింది. రామోజీ ఫిలింసిటీలో సాంగ్ షూట్ చేస్తున్నాం. సాంగ్ రేపో, ఎల్లుండో అయిపోతుంది. క్రిస్మ‌స్ స‌మ‌యంలో ఆడియో విడుద‌ల చేసి, జ‌న‌వ‌రి 11 లేదా 12న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. ఈ ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంలలో ఓ సాంగ్‌లో ఓ బి.జి.ఎంలో క‌న‌ప‌డ‌తాను.

త‌దుప‌రి చిత్రాలు...
- సుకుమార్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సంక్రాంతి త‌ర్వాత ప్రారంభం అవుతుంది. అలాగే మ‌ణిర‌త్నంగారితో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. క‌థ ఓకే అయితే వ‌చ్చే ఏడాది ఆయ‌న‌తో సినిమా ఉంటుంది. అలాగే కొర‌టాల శివ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు ప్ర‌స్తుతం ఉన్న క‌మిట్‌మెంట్స్ పూర్తి చేస్తున్నారు. అలాగే ఈలోపు నేను కూడా నా క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న బ్యాన‌ర్‌లో సినిమా గురించి వివ‌రాలు తెలుస్తాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved