pizza
Ram Gopal Varma interview about Vangaveeti
ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిద్ర‌పోతున్న అగ్నిప‌ర్వ‌తంలాంటోడు - రామ్‌గోపాల్ వ‌ర్మ‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 December 2016
Hyderaba
d

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వంగవీటి'. రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్‌ రూపొందించిన 'వంగవీటి' చిత్రం డిసెంబర్‌ 23న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో ఇంట‌ర్వ్యూ....

`వంగ‌వీటి` చేయ‌డానికి కార‌ణం...
- విజయవాడలో జరిగిన కొన్ని సంఘటనల గురించి నాకు బాగా తెలుసు. అవి నా జీవితంలోని భాగాలే. ఈ కథని ఒక సినిమాగా వేరు చేసి చూడలేను. విజయవాడలో చదువుకునే రోజుల్లో జరిగిన ఆ సంఘటనల్లో నేను కూడా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను.ఆ రోజుల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యమైన పెద్ద రౌడీల్లో ఎవరినీ కలవలేదు కానీ వాళ్ళ అనుచరుల కదలికల్ని మాత్రం చాలా దగగర్నుంచి గమనించాను.

షాక్ అయ్యాను...
- నేను కాలేజీలో చ‌దువుతున్న రోజుల్లో 400 స్టూడెంట్స్ హోలీ పండుగ సంద‌ర్భంగా సంద‌డి చేసుకుంటూ వెళుతున్నాం. ఓ గ్యాంగ్ వెళుతున్న కారును ఆపి బ‌య‌ట‌కు దిగ‌మ‌ని అడ్డుప‌డితే...స‌డ‌న్ గా ఆ కారులోంచి క‌త్తులుతో దిగారు అది చూసి నేను షాక్. నేను రౌడీల‌ను చూడ‌డం అదే ఫ‌స్ట్ టైమ్.

`వంగ‌వీటి` అనే టైటిల్ గురించి....
- విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి రంగా నుండే రౌడీయిజం అనే క‌ల్చ‌ర్ ప్రారంభ‌మైంది. అందుకే ఆ టైటిల్ పెట్టాను. నేను రంగాను రెండు, మూడుసార్లు క‌లిశాను. ముర‌ళిని దూరంగా చూశానే త‌ప్ప క‌ల‌వ‌నే లేదు.

Ram Gopal Varma interview gallery

`వంగ‌వీటి`..ఆఖ‌రి చిత్రమ‌నే నిర్ణ‌యం ఎందుకంటే....
- వంగ‌వీటి త‌ర్వాత ఆ రేంజ్‌లో కిక్ ఇచ్చే సినిమా మ‌రొక‌టి ఇప్ప‌ట్లో దొరికే అవ‌కాశం లేదు. అది కాకుండా న్యూక్లియ‌ర్ అనే ఇంట‌ర్నేష‌నల్‌ సినిమా చేయ‌బోతున్నాను. ఈ సినిమా చేయ‌డానికి రెండు, మూడు సంవత్స‌రాలు ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ న్యూక్లియ‌ర్ సినిమాను వ‌చ్చే ఏడాది మే నెల‌లో ప్రారంభించాల‌నుకుంటున్నాను.

శాండీని రంగా పాత్ర‌లో న‌టింప చేయ‌డానికి....
- శాండీని పూరి ఇంట్లో జరిగిన ఒక ప్రయివేట్ పార్టీలో చూశాను. అక్కడ సైలెంట్ గా ఒక మూలన నిల్చుని ఉన్న అతన్ని చూసి వంగవీటి రంగ ఫొటో చూపించి ఇలా తయారవగలవా అని అడిగాను. అతను తయారై ఫొటోలు చూపించాడు. వెంటనే అతన్ని ఫైనల్ చేసేశాను.

నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్‌గారి గురించి....
- దాసరి కిరణ్ మంచి నిర్మాత. సినిమా కోసం నేనేం కావాలన్న వెంటనే చేసేవాడు. ఒక రోజు షూటింగ్ కోసం 100 అంబాసిడర్ కార్లు కావాలని అడిగాను, పక్క రోజుకల్లా 80 కార్లు తెచ్చి పెట్టాడు. ఈ సినిమాలో వాటినే ఎక్కువగా వాడాం.

శ‌శిక‌ళ‌పై సినిమా ఎందుకు చేయాల‌నిపిచింది...
-శశికళ పాత్ర జయలలిత కన్నా ఎక్కువ ఆస‌క్తిక‌రంగా నాకు అనిపించింది. ఎటువంటి పదవీ లేకుండా శక్తివంతమైన మహిళగా ఎదిగిన ఆమెను గురించి చెప్పడమే నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై ట్వీట్స్ వ‌ర్షం కురిపిస్తున్న‌ట్లున్నారు..
- చిరంజీవి అభిమానిగా ఆయ‌న బాహుబ‌లి కంటే పెద్ద సినిమా చేయాల‌ని చెప్పాను. ఇక ప‌వ‌న్ నిద్ర‌పోతున్న అగ్నిప‌ర్వ‌తం లాంటోడు. టైమ్ వ‌చ్చిన‌ప్పుడే పేలుతాడు.

శివ‌2 సీక్వెల్ గురించి...
- అప్పుడున్న ప‌రిస్థితుల ఆధారంగా చేసుకుని శివ చేశాను. కానీ శివ‌2 చేయ‌డం అసాధ్యం

`స‌ర్కార్‌ 3` గురించి...
- షూటింగ్ పూర్త‌య్యింది. వ‌చ్చే ఏడాది మార్చిలో విడుద‌ల ఉండ‌వ‌చ్చు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved