pizza
Ram Talluri about Chuttalabbayi success
`చుట్టాల‌బ్బాయి` స‌క్సెస్ తొలి చిత్ర నిర్మాత‌గా చాలా సంతోషాన్నిచ్చింది - రామ్ తాళ్ళూరి
You are at idlebrain.com > news today >
Follow Us

21 August 2016
Hyderaba
d

Aadi and Namitha Pramod starring Chuttalabbayi  is getting mixed reviews and the film is good at box office. Chuttalabbayi movie would be a deffinately come back film for Aadi as the film makers nearly increased 70 more theatres in both telugu states. As per the latest updates the film has collected 3.1 crores worldwide on the first day of its release. Things are happening very positive for Chuttalabbayi and it is a biggest blockbuster in Aadi’s career for sure. Chuttalabbayi is directed by Veerabhadram produced by Venkat Talari and Ram Talluri.

ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం. 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న. రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన రామ్ తాళ్ళూరి మీడియా మిత్రుల‌తో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు...

రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ ``రిలీజ్ త‌ర్వాత ఈ సినిమాపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయినా ఇప్పుడు క‌లెక్ష‌న్స్ పెరిగింది. ముఖ్యంగా బి, సి సెంట‌ర్స్‌లో మంచి స్పంద‌న వ‌చ్చింది. వైజాగ్‌, తూర్పు గోదారి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో స‌హా అన్నీ ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నిర్మాత‌గా నాకు తొలి చిత్రానికి ఇంత మంచి అప్రిసియేష‌న్ రావ‌డం ఆనందంగా ఉంది. సినిమా విడుద‌లైన మూడు రోజుల‌కు మేం పెట్టిన డ‌బ్బులు వ‌చ్చేస్తాయి. ఆది, సాయికుమార్‌గారు చాలా స‌పోర్ట్ చేశారు. ఇప్పుడు నా రెండో సినిమాను ర‌వితేజ‌, బాబీల కాంబినేష‌న్‌లో చేయ‌బోతున్నాను. మంచి క‌థ‌లు వ‌స్తే మినిమ‌మ్ బ‌డ్జెట్‌, హై బ‌డ్జెట్ చిత్రాలు అన్నీ చేయ‌డానికి నేను సిద్ధ‌మే`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved