pizza
Ranjith interview (Telugu) about Juvva
`జువ్వ` కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది - రంజిత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

21 February 2018
Hyderabad

రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ జంటగా 'దిక్కులు చూడ‌కు రామయ్య‌' ఫేమ్ త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నచిత్రం 'జువ్వ‌'. ఎస్.వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో రంజిత్‌తో ఇంట‌ర్వ్యూ..

నేపథ్యం..
- మాది వైజాగ్‌. చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే ఉండే ఆసక్తితోనే ఈ రంగంలోకి వచ్చాను. హైదరాబాద్‌లోనే ఎం.బి.ఎ చదివాను. అదే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాను. హీరోగా చేయాలనే కోరికతో చిన్న చిన్న పాత్రలు చేయలేదు.

'జువ్వ' గురించి..
- 'నువ్వు నేను ఒకటవుదాం' సినిమా తర్వాత నేను నటించిన రెండో చిత్రమే 'జువ్వ'. మా స్వంత నిర్మాణ సంస్థలో సినిమాను రూపొందించాం. మా బ్యానర్‌లో సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో త్రికోటిగారు కలిశారు. రత్నంగారు చెప్పిన కథ ఓకే కావడంతో మూడు నెలలు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాం. అంతా పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళ్లాం. హైదరాబాద్‌, వైజాగ్‌, బెంగళూరు, మలేషియా లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించాం. సినిమా చిత్రీకరణకు 85 రోజులు సమయం పట్టింది.

హైలైట్స్‌...
- ఇది ప్రేమకథా చిత్రమే. 'దిక్కులు చూడకు రామయ్యా' సినిమాను త్రికోటిగారు ఎలాగైతే డిఫరెంట్‌గా తీశారో అలాగే ఈ సినిమాను కూడా తీశారు. సాధారణ ప్రేమకథకు డ్రామాను కలిపి తెరకెక్కించారు. లవ్‌, కామెడీ, ఫైట్స్‌, పాటలు ఇలా అన్ని ఎలిమెంట్స్‌ కలగలిసిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అందరినీ మెప్పిస్తుంది. రత్నంగారు అందించిన కథలో చాలా ఆసక్తికరమైన ట్విస్టులుంటాయి. అలాగే కీరవాణిగారు అందించిన పాటలు, నేపథ్య సంగీతమే సినిమాకు ప్రధాన బలం. పాటలు ఆల్‌రెడీ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. మలయాళ నటుడు అర్జున్‌ను ఇందులో విలన్‌గా పరిచయం చేశాం.

interview gallery




పాత్ర గురించి..
- ఇందులో నా క్యారెక్టర్‌ పేరు రానా. నేను ఇందులో అందరికీ పోస్టర్స్‌ వేస్తుంటారు. ఓ సందర్భంలో హీరోయిన్‌ను చూసిన హీరో ఆమె కోసం ఏం చేశాడనేదే సినిమా. సినిమా ప్రారంభంలో అనుక్ను బడ్జెట్‌ కంటే.. కాస్త ఎక్కువే అయినా.. కథకు అవసరమనిపించే ఖర్చు పెట్టాం. మేం పెట్టిన ఖర్చుకు డబుల్‌ అవుట్‌పుల్‌ పుట్‌ కనపడుతుంది.

నిర్మాత గురించి..
- మా అన్నయ్య భరత్‌ డాక్టర్‌. ఈ సినిమా కోసం నిర్మాతగా మారి సినిమా చేశారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు.

తదుపరి చిత్రం..
- ఒక సబ్జెక్ట్‌ ఓకే అయ్యింది. బయటి బ్యానర్‌లో ఈ సినిమా ఉంటుంది. చర్చలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కుదిరితే మేలో సినిమా షూటింగ్‌ ఉంటుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved