pizza
Rao Ramesh interview about Nanna Nenu Naa Boyfriends
ఐదేళ్ల వ‌ర‌కు ఇలాంటి తండ్రి పాత్ర రాద‌ని ప్ర‌శంసిస్తున్నారు - రావు ర‌మేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2016
Hyderaba
d

ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. సినిమా డిసెంబ‌ర్ 16న విడుద‌లలైన సంద‌ర్భంగా రావు ర‌మేష్‌తో ఇంట‌ర్వ్యూ....

స‌క్సెస్ రెస్పాన్స్‌.....
- `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` త‌ర్వాత నాకు ఇంకా గౌర‌వం పెరిగింది. మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు ఇలాంటి తండ్రి క్యారెక్ట‌ర్ రాద‌ని ప్ర‌శంసిస్తున్నారు. సినిమా చూపిస్త మావ సినిమా కంటే ముందుగానే ఈ క‌థ‌ను చెప్పినా ముందు `సినిమా చూపిస్త మావ` చేశాను. త‌ర్వాత ఈ సినిమాలో న‌టించాను. భాస్క‌ర్‌గారు డైరెక్ట్ చేసిన విధానం. సాయికృష్ణ‌గారి క‌థ‌కు ప్ర‌స‌న్న‌కుమార్‌గారి డైలాగ్స్ బలాన్నిచ్చాయి. దిల్‌రాజుగారు క‌థ విన‌గానే ఆయ‌న చెప్పిన స‌ల‌హాలు వెల‌కట్ట‌లేనివి. ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌గారు చాలా కాన్ఫిడెంట్‌గా డైరెక్ట్ చేశారు. చోటాగారి కెమెరా వ‌ర్క్ ఇలా అంద‌రి వ‌ర్క్ క‌లిసి యూనానిమ‌స్‌గా ఇంత మంచి టాక్ రావ‌డం గొప్ప స‌క్సెస్‌గా భావిస్తున్నాను. ఇందులో తండ్రి క్యారెక్ట‌ర్ చూసినవారు ది బెస్ట్ క్యారెక్ట‌ర్ చేశాన‌ని అంటున్నారు.

ప్ర‌తి తండ్రికి ఉండే ప్రేమే..
- ఏ తండ్రికి అయినా కూతురంటే ఓ స్పెష‌ల్ ఎఫెక్ష‌న్ ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుంది. నా పాప పేరు దీక్షిత‌. త‌నిప్పుడు ఆర‌వ త‌ర‌గ‌తి చ‌దువుతుంది. నేను కూడా నా కూతురిని మా అమ్మెక్క‌డా అనే అంటుంటాను. కాబ‌ట్టి నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌లో నా క్యారెక్ట‌ర్ అంద‌రూ త‌ల్లిదండ్రులు క‌నెక్ట్ అవుతున్నారు. నాతో పాటు నోయెల్‌, అశ్విన్‌బాబు, పార్వ‌తీశం, తేజ‌స్వి చాలా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. హెబ్బా పటేల్ మ‌రోసారి మంచి హిట్ సాధించింది. నాతో పాటు వీరంద‌రూ వారి వారి పాత్ర‌ల‌ను క్యారీ చేశారు కాబ‌ట్టి నా పాత్ర‌కు గుర్తింపు వ‌చ్చింది.

జీరో ప్రిపేరేష‌న్‌......
- నేను ప్ర‌తి సినిమాకు జీరో ప్రిపేరేష‌న్‌తోనే వెళ‌తాను. ఎందుకంటే ప్ర‌తి డైరెక్ట‌ర్ నా క్యారెక్ట‌ర్ గురించి ఏదో ఒక‌టి రాసుకునే ఉంటాడు. అలాంట‌ప్పుడు నేనేదో ప్రిపేర్ అయిపోతే వారెలాగో ఫీల‌వుతారు. ఆ జోన‌ర్ నుండి న‌న్ను బ‌య‌ట‌కు తీసుకు రావ‌డానికి ద‌ర్శ‌కుల‌కు టైం ప‌డుతుంది. అది ద‌ర్శ‌కుడికి, రైట‌ర్‌కు శ్ర‌మ‌. అదే మనం ఖాళీగా వెళితే డైరెక్టరే మ‌న‌ల్ని ఆ మూడ్‌లోకి తీసుకెళ‌తారు. నా తొలి సినిమా గ‌మ్యం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు నేను అదే ఫాలో అవుతున్నాను. అందుకు త‌గినట్లు డైరెక్ట‌ర్స్ కూడా డైలాగ్స్‌ను స్పాట్‌లోనే ఇస్తారు.

సిచ్యువేష‌న్ బట్టి చేయాలి...
- ఒక్కో సినిమాలో ఒక్కొలా చేయాలి. కొన్ని చోట్ల సైలెంట్‌గా ఉండి ఇన్‌టెన్స్ చూపాలి. కొన్ని చోట్ల బిగ్గ‌ర‌గా అర‌వాల్సి ఉంటుంది. సిచ్యువేష‌న్‌ను బ‌ట్టి చేయాల్సి ఉంటుంది. విల‌నీజం చేయ‌డం వేరు. కానీ ఆ విల‌న్‌ను కూడా మ‌న ఇంట్లో వ్య‌క్తిగా భావించాలి. ఒక‌ప్పుడు నాన్న‌గారిని ప్ర‌జలు అలా భావించారు. ఇప్పుడు న‌న్ను కూడా వారింట్లో స‌భ్యుడిలానే భావిస్తున్నారు. ఇది అమ్మ‌నాన్న‌ల నుండి నాకు వ‌చ్చింది. అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను.

తదుపరి చిత్రాలు...
- కాట‌మ‌రాయుడు సినిమాలో నా క్యారెక్ట‌ర్ నాకు మ‌రో మైల్‌స్టోన్ మూవీ అవుతుంది. నాకు మంచి కిక్ ఇచ్చింది. రాయ‌ల‌సీమ యాస‌లో మాట్లాడుతాను. న‌మో వేంక‌టేశాయ‌లో ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేశాను. అలాగే డిజె.జ‌గ‌న్నాథంలో కూడా మ‌రో అద్భుత‌మైన రోల్ చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved