pizza
Rashi Khanna interview about Supreme
తొలిసారి వాళ్లు మెచ్చుకున్నారు - రాశీఖ‌న్నా
You are at idlebrain.com > news today >
Follow Us

02 May 2016
Hyderaba
d

చూడ్డానికి బ‌బ్లీగా ఉంటుంది రాశీఖ‌న్నా. చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా బెల్లం శ్రీదేవి పాత్ర‌లో ఈ భామ న‌టించిన సుప్రీమ్ విడుద‌ల కానుంది. శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించారు. దిల్‌రాజు నిర్మాత‌. ఈ సినిమా గురించి రాశీఖ‌న్నా హైద‌రాబాద్‌లో సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* సుప్రీమ్ మీ పాత్ర ఎలా ఉంటుంది?
- బెల్లం శ్రీదేవి అనే పాత్ర చేశాను. పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించాను. నేను తెర‌పై సిన్సియర్‌గా చేసే అంశాలు చివ‌రికి ఎలా కామెడీ యాంగిల్‌లో మిగిలాయ‌నేదే క‌థ‌.

* అంటే ఇందులో కామెడీ చేశారా?
- అవునండీ. నేను బేసిగ్గా చాలా సిగ్గ‌రిని. అలాంటిది నేను ఇందులో కామెడీని పండించాను. నాలో నాకు తెలియ‌ని కొత్త యాంగిల్ ఇది.

* యాక్ష‌న్ సీన్ల మాటేమిటి?
- యాక్ష‌న్ సీక్వెన్స్ ఉన్నాయి. అవి కూడా బాగా వ‌చ్చాయి.

* ట్రైల‌ర్‌లో మీ పార్ట్ అంత‌గా ఉన్న‌ట్టు లేదు..?
- ఎందుకులేదండీ. ఏ హీరోయిన్‌కీ అంత బాగా ట్రైల‌ర్‌తో పేరు రాదు. నా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ని చెప్పిన విధానం చాలా బావుంటుంది.

* తేజ్‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- చాలా కామ్‌గా ఉంటాడు. అదే స‌మ‌యంలో స‌ర‌దాగానూ ఉంటాడు. త‌న డ్యాన్సులు చూసి మ‌తిపోయాయి. నేనూ బాగా ప్రాక్టీస్ చేసి చేశా.

Rashi Khanna interview gallery

* అందం హిందోళం పాట‌కు స్టెప్పులేయ‌డం ఎలా అనిపించింది?
- ఒరిజిన‌ల్‌ని చూసి భ‌య‌ప‌డ్డా. రాధా మేడ‌మ్ ప్ర‌తి షాట్‌లోనూ హీరో ప‌క్క‌న డ్యాన్స్ చేశారు. తీరా నేను కూడా కెమెరా ముందు స్టెప్పులు వేసిన‌ప్పుడు భ‌యం అంతా పోయింది. బాగా చేశాన‌ని మెచ్చుకుంటున్నారు.

* డ‌బ్బింగ్ చెప్పుకున్నారా?
- నేను తెలుగులో మాట్లాడుతాను కానీ ఇంకా డిక్ష‌న్ క‌రెక్ట్ గా రాలేదండీ. నాకు డిక్ష‌న్ క‌రెక్ట్ గా వ‌చ్చిన‌ప్పుడు డ‌బ్బింగ్ బాగా చెబుతాను. ప్ర‌స్తుతానికి ప్ర‌య‌త్నించ‌డం లేదు.

* సినిమా చూసి ఎవ‌రైనా ఏమైనా చెప్పారా?
- రఘుబాబుగారు, వెన్నెల కిశోర్‌గారు నాకు ఫోన్ చేసి చాలా బాగా చేశాన‌ని అన్నారు. అలా నాకు ఒక‌రు ఫోన్ చేసి చెప్ప‌డం ఇదే తొలిసారి.

* హైద‌రాబాద్‌లో ఇల్లు కొన్నారా?
- తీసుకున్నానండీ. ఇక్క‌డే సెటిల్ అయ్యాను.

* ఈ సినిమా త‌ర్వాత మీకు ఎలాంటి పేరు వ‌స్తుంది?
- నా సంగ‌తి ఏమోగానీ, అమ్మాయిల‌కోసం ఇంత మంచి స్క్రిప్టులు రాయొచ్చ‌ని మిగిలిన ర‌చ‌యిత‌లు కూడా అనుకుని రాయ‌డం మొద‌లుపెడ‌తారు. అంత మంచి పాత్ర ఇది.

* ఇందులో చైల్డ్ సెంటిమెంట్ ఉంటుందా?
- అవునండీ. అది క‌థ‌కు చాలా కీల‌కం. అందుకే ఇప్పుడు చెప్ప‌లేను. కానీ ఆ బాబు చాలా బాగా న‌టించాడు. వాడు ఏడ్చే సీను ఒక‌టి ఉంటుంది. అందులో నిజంగానే ఏడ్చేశాడు. చూసిన మేమంతా వామ్మో అని అనుకున్నాం.

* మీ త‌దుప‌రి సినిమాలేంటి?
- గోపీచంద్‌తో ఆక్సిజ‌న్ చేస్తున్నా. ర‌వితేజ‌తో రాబిన్‌హుడ్ ఉంది.

* ఇత‌ర భాషా చిత్రాల ఆఫ‌ర్లు వ‌స్తున్నాయా?
- క‌థ‌లు వింటున్నానండీ. ప్రాప‌ర్ క‌థ‌తో వెళ్దామ‌ని అనుకుంటున్నా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved