pizza
Rashmi Gautham interview about Guntur Talkies
ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం – రష్మీ గౌతమ్
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2016
Hyderaba
d

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ తో ఇంటర్వ్యూ...

రెండూ చేస్తున్నాను...
-నేను సినిమా ఇండస్ట్రీకి కొత్త కాదు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాను. అయితే ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. తర్వాత టీవీ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను. ఇప్పుడు ఈ సినిమాలో ప్రవీణ్ సత్తారు గారి సపోర్ట్ తో ఈ సినిమాలో చేశాను.

అతనితో డేటింగ్ చేయలేదు...
-నాకు, సిద్ధుకు మధ్య రొమాంటిక్ సాంగ్ చూసే ఉంటారు. చాలా బావుందని అందరూ అంటున్నారు. కానీ ఆ పాటను ఉన్నట్టుండి చేసేయండి అంటే చేయలేం అందుకనే అతనితో సినిమాలకు వెళ్ళడం, షాపింగ్ లకు వెళ్శడం వెళ్ళాను. అంతే తప్ప డేటింగ్ చేయలేదు. మా మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. దాంతో ఈ సాంగ్ ను చివర్లో షూట్ చేశాం. ఈ సినిమాలో నా పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది.

Rashmi Gautam interview gallery

డైరెక్టరే కారణం..
-ఈ సినిమాలో నన్ను సెలక్ట్ చేసుకోవడానికి కారణం దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారే కాణం. నాకు గ్లామర్ ఇమేజ్ ఉంది. దానికి డిఫరెంట్ గా విలేజ్ టైప్ పాత్రలో చేయడం డిఫరెంట్ గా అనిపించింది.

క్యారెక్టర్....
-ఈ సినిమాలో సువర్ణ అనే అమ్మాయి పాత్ర చేశాను. ఇందులో మురికివాడలో ఉండే అమ్మాయి పాత్ర. ఈ సినిమా కథంతా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అయితే లోకేషన్స్ పరంగా హిందూపురం, అనంతపురంలో చిత్రీకరించాం. వారి లైఫ్ లో జరిగిన ట్రాజెడి ఆడియెన్ కు కామెడిగా కనపడుతుంటుంది. నేను, శ్రద్ధాదాస్ ఇలా అందరం ఇతర ప్రధాన పాత్రల్లో నటించాం.

ఏ పాత్ర అయినా చేస్తాను...
-ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా చిన్నదైనా, పెద్దదైనా చేయడానికి నేను సిద్ధమే.

ప్రేక్షకులు మారారు...
-ప్రేక్షకులు చాలా వరకు మారారు. కొత్త సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే అనసూయ చేసిన క్షణ సినిమాలో పోలీస్ పాత్రను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇలా డిఫరెంట్ పాత్రలను చేస్తే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved