pizza
Rashmika Mandanna interview (Telugu) about Chalo
అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే పాత్ర‌లో మెప్పిస్తాను - ర‌ష్మిక మండ‌న్నా
You are at idlebrain.com > news today >
Follow Us

30 January 2018
Hyderabad

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ఛలో`. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ర‌ష్మిక మండ‌న్నా ఇంట‌ర్వ్యూ...

నేప‌థ్యం...?
- మాది కూర్గ్‌. నేను 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాను. మైసూర్‌లో ఇంట‌ర్మీడియెట్, బెంగ‌ళూర్‌లో డిగ్రీ చ‌దివాను. 2014 బెంగ‌ళూరులో ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్‌లో గెలిచాను. డిగ్రీ చ‌దువుకునే స‌మయంలో క‌న్న‌డంలో కిరిక్ పార్టీ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమా వ‌ల్ల `ఛ‌లో` సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది.

`ఛ‌లో` సినిమా చేయ‌డానికి కార‌ణ‌మేంటి?
- నాకు `ఛ‌లో` క‌థ న‌చ్చింది. త‌ర్వాత ఎంటైర్ టీం న‌చ్చింది. తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇది స‌రైన సినిమాగా భావించాను. ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లా కాకుండా కుటుంబంలా అనిపించింది.

మీ రోల్ గురించి చెప్పండి?
- ట్రెడిష‌న‌ల్‌, కాలేజ్ అమ్మాయిగా క‌నిపిస్తాను. అంద‌రికీ కామ‌న్‌గా క‌నెక్ట్ అయ్యే రోల్ ఇది. కొత్త పాత్ర‌ల‌నే కాదు.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే పాత్ర‌లు చేయాల‌నేది నా కోరిక‌. మ‌న ప‌క్కన జ‌రిగే క‌థ‌లాంటి సినిమా కావ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. నేను కాలేజ్ చ‌దువుకుంటుండం వ‌ల్ల ఈ పాత్ర‌లో చేయ‌డం సుల‌భ‌మ‌నిపించింది.

డ‌బ్బింగ్ మీరే చెప్పారా?
- అవునండీ డ‌బ్బింగ్ చెప్పాను. ద‌ర్శ‌కుడు వెంకీగారు ముందురోజే నాకు సీన్ పేప‌ర్స్ ఇచ్చేసేవారు. దాన్ని చ‌దువుకుని సీన్స్‌కు వెళ్ల‌డం వ‌ల్ల సీన్స్ చేసేదాన్ని. అందువ‌ల్ల‌నే నాకు సీన్స్‌పై అవ‌గాహ‌న కుదిరింది. డ‌బ్బింగ్ కూడా నేనే చెప్పాను. డ‌బ్బింగ్ స‌మ‌యంలో ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నాకు స‌ల‌హాలిచ్చారు. ముందు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఆలోచించాను. అయితే ట్రై చేస్తాను.. మీకు న‌చ్చితేనే పూర్తి డ‌బ్బింగ్ చెబుతాన‌ని అన్నాను. ద‌ర్శ‌కుడు ఒప్పుకోవ‌డంతో డ‌బ్బింగ్ చెప్పాను.

interview gallery



ఖాళీ స‌మ‌యాల్లో ఏం చేస్తారు?
- నేను ఖాళీగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌ను. ఏదో ఒక ప‌ని చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌తాను. నేను ఇత‌రులు ఎలా క‌ష్ట‌ప‌డుతున్నారో తెలుసుకుని... వారిలా క‌ష్ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నిస్తాను.

మీకు ఇష్ట‌మైన హీరోయిన్‌?
- అనుష్క‌గారిలా డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయాల‌ని ఉంది.

కిరిక్‌పార్టీ రీమేక్ కోసం మిమ్మ‌ల్ని సంప్ర‌దించారా?
- అవును సంప్ర‌దించారు. కానీ ఒక‌సారి చేసిన పాత్ర‌ను మ‌రోసారి చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ను.

క‌న్న‌డ‌, తెలుగులో ప‌నిచేయడం ఎలా ఉంది?
- భాష ప‌రంగా చాలా క‌ష్టంగా ఉంది. ఇక్క‌డ‌కు వ‌స్తే క‌న్న‌డ మ‌రచిపోతున్నాను. బెంగ‌ళూరుకి వెళితే తెలుగు మ‌ర‌చిపోతున్నాను (న‌వ్వుతూ..)

ఎలాంటి క‌థ‌ల‌ను చేయాల‌నుకుంటున్నారు?
- స్క్రిప్ట్ న‌చ్చితే ఎలాంటి సినిమా అయినా చేయ‌డానికైనా సిద్ధ‌మే.

త‌దుప‌రి చిత్రం?
- తెలుగులో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాను. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved