pizza
Ravi Teja interview (Telugu) about Amar Akbar Anthony
మూడు షేడ్స్‌ ఉన్న పాత్ర చేయడం నిజంగా చాలెంజ్‌ - రవితేజ
You are at idlebrain.com > news today >
Follow Us

14 November 2018
Hyderabad

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీనన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌(సి.వి.ఎం) నిర్మించిన చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. నవంబర్‌ 16న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రవితేజతో ఇంటర్వ్యూ...

అమర్‌ అక్బర్‌ ఆంటోని ఎలా మెప్పిస్తాడు?
- అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా మెప్పించేలా ఉంటుంది. మరో 48 గంట‌లు వెయిట్‌ చేస్తే రిజల్ట్‌ తెలిసిపోతుంది.

అమర్‌ అక్బర్‌ ఆంటోని.. మూడు పాత్రల్లో మీకు నచ్చిన పాత్రేంటి?
- వ్యక్తిగతం చెప్పాలంటే అమర్‌ పాత్రంటే నాకు బాగా ఇష్టం. ఓ ఇంటెన్సిటి, ఎమోషన్‌ ఉండే పాత్ర కాబట్టి నచ్చింది. అలాగే అక్బర్‌, ఆంటోని పాత్రల నుండి కామెడీ జనరేట్‌ అవుతుంది.

మూడు రకాల పాత్రలు చేయడం ఎలా అనిపించింది?
- చాలా బాగా అనిపించింది. ఓ నటుడికి రెండు కంటే ఎక్కువ షేడ్స్‌ ఉండే పాత్రలను చేయాల్సి వస్తే నిజంగా చాలెంజింగ్‌గా ఉంటుంది. నాకు అలాగే అనిపించింది. రేపు ప్రేక్షకులు సినిమా చూసి ఎలా రెస్పాండ్‌ అవుతారో చూడాలి. నటుడిగా నేను చాలా శాటిస్‌ఫాక్షన్‌తో ఉన్నాను. శ్రీనుకైనా, నాకు అయినా ఇలాంటి స్క్రిప్ట్‌ కుదరడం కొత్తగానే ఉంది. శ్రీనుతో నేను చేసిన నీకోసం ఓ ఇన్‌టెన్స్‌ లవ్‌స్టోరీ.. వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలు పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కూడా అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది.

ఈ పాత్రల కోసం ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా?
- లేదండీ.. హోం వర్క్‌ లాంటిదేమీ చేయలేదు. డైరెక్ట్‌గా క్లాస్‌ వర్క్‌లా సెట్స్‌లోనే చేసేశాను.

అమర్‌ అక్బర్‌ ఆంటోని అదే హిట్‌ సినిమా టైటిల్‌ కదా.. ?
- నిజంగానే హిట్‌ సినిమా టైటిల్‌. కానీ టైటిల్‌ మాత్రమే పెట్టాం. కానీ ఆ సినిమాకు సంబంధమే ఉండదు.

స్ఫూఫ్‌లేమైనా ఉన్నాయా?
- స్ఫూఫ్‌లేవీ లేవు.

చాలా మంది కమెడియన్స్‌ ఉన్నట్లున్నారుగా?
- సునీల్‌, వెన్నెలకిషోర్‌, సత్య .. తమదైన స్టయిల్లో కామెడీని జనరేట్‌ చేశారు. సత్య పాత్ర విషయానికి వస్తే ఇప్పటి వరకు సినిమాల్లో తనను చూసింది వేరు. ఈ సినిమాలో తను కనపడబోయే మరోలా ఉంటుంది. తన పాత్ర చాలా హైలైట్‌గా ఉంటుంది. దుబాయ్‌ శీనులో సునీల్‌ను చూసినట్లు ఈ సినిమాలో కనపడతారు.

ఇలియానా గురించి..?
- ఇలియానాతో ఇంతకు ముందే సినిమా చేయాల్సింది కానీ డేట్స్‌ కుదరకపోవడమో.. మరేదైనా సమస్యల వల్లనో కుదరలేదు. ఈసినిమాకు తనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తన పాత్రకు తనే డబ్బింగ్‌ కూడా చెప్పింది.

లయ, అభిరామి పాత్రలు ఎలా ఉంటాయి?
ఇద్దరు ఫ్రెండ్స్‌గా కనపడతారు. ప్లాష్‌ బ్యాక్‌లో ఈ పాత్రలు కనపడతాయి. ఇలియానా చిన్నప్పటి పాత్రలో లయ కూతురు నటించింది. నా చిన్నప్పటి పాత్రలో మా అబ్బాయి మహదేవ్‌ నటించాల్సింది కానీ.. తనకు స్కూల్‌ ఉండటం, వీసా లేట్‌ కావడం వంటి కారణాలతో కుదరలేదు.

interview gallery



శ్రీను వైట్ల మిమ్మల్ని ట్రబుల్‌ షూటర్‌ అని అన్నారుగా?
- తనేదో అవేశంలో అన్నాడండీ.. మంచి కాంప్లిమెంట్‌గానే భావిస్తున్నాను. ఒక ప్లాప్‌ అయితే తన పనైపోయిందని అనుకోకూడదు. ప్లాప్‌ ఇచ్చిన వాళ్లు బ్లాక్‌బస్టర్‌ ఇవ్వొచ్చు. బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినవాళ్లు డిజాస్టర్‌ ఇవ్వొచ్చు కదా. ప్రతి సినిమా బాగా రావాలనే చేస్తాం. బాగా రాకూడదని అనుకోం కదా. జయాపజయాలనేవి కామన్‌గా ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. నెక్స్‌ట్‌ ఏంటనేది ఆలోచించుకుని ముందుకెళ్లాలి.

స్వంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే ఆలోచనలేమైనా ఉన్నాయా?
- లేదండి.. నాకు ప్రొడక్షన్‌ వ్యవహారాలు తెలియవు. నాకు నటుడిగా సినిమాలు చేయడమే తెలుసు. నేను నీళ్లులాంటివాడ్ని అలా పోతుంటాను.

ఇలాంటి పాత్ర చేయలేదే? అని అనుకుంటారా?
- అలాంటిదేమీ లేదు. నేను చేసే ప్రతి సినిమాలో నా పాత్రను బెస్ట్‌గానే చేయడానికి ప్రయత్నిస్తుంటాను.

అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు?
- ఎప్పుడూ అందరూ అలాగే సంతోషంగా ఉండాలి. నెగిటివి, స్ట్రెస్‌, డిప్రెషన్‌ వంటి వాటిని పక్కన పెట్టేయాలి.

పూరితో సినిమా ఎప్పుడు ఉంటుంది?
- తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య కూడా ఓ స్క్రిప్ట్‌ డిస్కస్‌ చేశాం. అంతా ఓకే అయితే సినిమా చేస్తాను.

తదుపరి చిత్రాలు?
ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. నవంబర్‌ 13న ఈ సినిమా లుక్‌, టైటిల్‌ను విడుదల చేద్దామని అనుకున్నాం కానీ కొన్ని కారణాలతో చేయలేకపోయాం. త్వరలోనే అనౌన్స్‌ చేస్తాం. అలాగే మైత్రీ మూవీస్‌లో సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాను. సంతోష్‌ శ్రీనివాస్‌తో చేసేది తెరి సినిమా కాదు.. ఓ కొత్త కథతో సినిమా చేయబోతున్నాను.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved