pizza
Ram Gopal Varma interview about Bhairava Geetha
అలా చెప్పడం ప‌బ్లిసిటీలో భాగ‌మే - రామ్ గోపాల్ వ‌ర్మ‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2018
Hyderabad

 

అలా చెప్పడం ప‌బ్లిసిటీలో భాగ‌మే - రామ్ గోపాల్ వ‌ర్మ‌

ధనుంజయ్ హీరోగా ఐరా మోర్ హీరోయిన్‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌ణ‌లోఅభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మించిన చిత్రం `భైర‌వ‌గీత‌`. లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మీడియాతో సినిమా గురించి మాట్లాడారు..

- సినిమా అనేది కథ స్టార్‌డ‌మ్‌పై నడవచ్చు అయితే ఒక దర్శకుడు సీన్ చెప్పే విధానాన్ని సినిమాటిక్ లాంగ్వేజ్ అంటారు. అలాంటి సినిమాటిక్ లాంగ్వేజిని సిద్ధార్థ డైరెక్షన్‌లో చూశాను. రేపు సినిమా ఎంత బాగుంది? ప్రేక్షకులకు నచ్చుతుందా? న‌చ్చ‌దా? అనేది సినిమా విడుదలైన తర్వాత డిసైడ్ అవుతుంది అయితే ఫిలిం మేకర్‌గా టెక్నికల్ నాలెడ్జ్ ఉండటంవల్ల లాంగ్వేజ్ అంటే అర్థం అయింది.

- నా కెరీర్‌లో నేను 30-40 మంది డైరెక్ట‌ర్స్‌ను ప‌రిచ‌యం చేసుంటాను. స్టోరీ వైజ్‌, సీన్ వైజ్ సినిమాటిక్ లాంగ్వేజ్‌ని మార్చ‌డం కంటే సినిమా మొత్తానికి సినిమాటిక్ లాంగ్వేజ్‌ను మార్చ‌డం చాలా క‌ష్టం. .అలా సిద్ధార్థ కొత్త సినిమాటిక్ లాంగ్వేజ్‌ని కొత్తగా చూపించాడు.

- `భైరవ గీత` కొత్త కథ కాదు. చేగువేరా నుంచి ఇప్పటి వరకు ఒక రెబల్ అనేవాడు ఎక్కడో ఒక ట్రిగ్గింగ్ పాయింట్ దగ్గర పుడతాడు అందుకు బలమైన కారణం ఉంటుంది అలాంటి కారణాన్ని ప్రేమకు లింకు పెట్టి ఈ చిత్రంలో చూపించాం. వంశీకృష్ణ నేను కలిసి స్క్రిప్ట్‌ను డెవలప్ చేశాం.కడప వెబ్ సిరీస్‌లో సిద్ధార్థ షాట్ డివిజ‌న్ న‌న్ను ఇంప్రెస్ చేసింది. ఆ సినిమాను సిద్ధార్థ డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌నిపించింది.

- ఒక డైరెక్ట‌ర్‌గా ఓ సీన్‌ను చ‌దివిన‌ప్పుడు ఎలా చేస్తార‌నే దానిపై నాకు ఐడియా ఉంటుంది. కానీ నా అంచ‌నాల‌కు మించి సిద్ధార్థ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ క్రెడిట్ అంతా సిద్ధార్థ సిద్ధార్థ కే దక్కుతుంది.

- `2.0`చిత్రాన్ని చిన్న పిల్లల సినిమా అని చెప్పడం పబ్లిసిటీ మాత్రమే అంతమాత్రాన చిన్న పిల్లల సినిమా చేయడం తప్పని చెప్పను. పబ్లిసిటీ లో భాగంగానే 2.0తో మా సినిమాని కంపేర్ చేశాను.

interview gallery



- సినిమా అనేది ఒకరి ఆలోచన కాదు ఐదారుగురు కీలకమైన వ్యక్తుల ఆలోచనల కలయిక. నాగార్జున, నేను `ఆఫీసర్`పై న‌మ్మ‌కంగా ఉన్నాం. కథనం సినిమా చూసిన తర్వాత కూడా నమ్మకంగానే ఉన్నాం. అయితే సినిమా సక్సెస్ కాలేదు సినిమా సక్సెస్ కాకపోవడానికి ఇత‌రులు కారణాలేవైనా చెప్పవచ్చు. కానీ నేను చెప్పలేను ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలిస్తే ముందుగానే జాగ్రత్త పడతాను కదా!. `ఆఫీసర్` సినిమా రిలీజ్ తర్వాత నాకు నాకు మధ్య అదే అనుబంధం కొనసాగుతుంది ఆ సినిమాకు సంబంధించి మా మధ్య ఎలాంటి డిస్కషవ‌న్స్ జరగలేదు ఒక డైరెక్ట‌ర్‌గా ప్ర‌తిసినిమాకు నేను పూర్తి ఫోక‌స్‌తోనే ప‌నిచేస్తాను.

- సీనియ‌ర్ ఎన్టీఆర్ గారికి.. తిరుపతికి మధ్య అనుబంధం ఉంది. ఎప్పుడూ నేను దేవుని నమ్మనని చెప్పలేదు. అయితే భక్తులని నమ్మను. అందుకు కారణం దేవుడ్ని నమ్మితే నేను చేసే చాలా పాపాలను భయంతో చేయలేను. ఉదాహ‌ర‌ణ‌కు అన్నపూర్ణ స్టూడియోలో కార్పెంటర్ సెట్ వేసిన‌ప్పుడు కొబ్బరికాయ కొట్ట‌మంటే .. నేను కొబ్బ‌రి కాయ కొట్టి ప్ర‌సాదం తీసుకున్నాను. అయితే అది కార్పెంట‌ర్ కోస‌మే. కొబ్బరికాయ కొట్టిన కొట్టక పోయినా నాకు పెద్ద తేడా లేదు.

కానీ నా చుట్టుపక్కల ఉన్న వారి కోసం కొన్ని సార్లు కొన్ని పనులు చేస్తూ ఉంటాను అలాగే `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా కోసం తిరుపతి గుడి గుడికి వెళ్ళాను. అది ఎన్టీఆర్ ఆత్మ కోసం లక్ష్మీపార్వతి కోసం వెళ్లాను అనుకోవ‌చ్చు.

- బాల‌కృష్ణ‌గారు నాకు ఎన్టీఆర్ బయోపిక్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇవ్వ‌లేదు కదా! అని `లక్ష్మీస్ ఎన్టీఆర్` చేయడం లేదు. ఎన్టీఆర్‌గారి లైఫ్‌లో లక్ష్మీపార్వతిగారి ఎంట్రీ తర్వాత చాలా డ్రామా జ‌రిగింది. ఆయన గురించి, ఆయన డార్క్ పార్ట్ ఆఫ్ లైఫ్ గురించి నాకున్న ఆసక్తితో `లక్ష్మీస్ ఎన్టీఆర్` చేస్తున్నాను. `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు. జరిగింది అందరికీ తెలిసిందే. ఫిలిం మేకర్‌గా ఎమోష‌న్స్‌తో చూపించబోతున్నాం. ఈ సినిమా గురించి బాలకృష్ణగారితో మాట్లాడలేదు. లక్ష్మీపార్వతి గారితో మాట్లాడాను. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారి మధ్య రిలేషన్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? తర్వాత ఏమైంది అనే అంశాలను చూపిస్తున్నాం కొత్త నటీనటులు నటిస్తున్నారు ఇప్పటికే కొంత భాగాన్ని చిత్రీకరించాం జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మధ్యలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం.


 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved