pizza
Richa Panai interview (Telugu) about Rakshaka Bhatudu
అచ్చ‌మైన తెలుగు అమ్మాయిగా న‌టించా - రిచా ప‌న‌య్‌
You are at idlebrain.com > news today >
Follow Us

11 May 2017
Hyderabad

మొగుడా మొగుడా అంటూ న‌రేశ్ న‌టించిన య‌ముడికి మొగుడు చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది రిచా ప‌న‌య్‌. విశాల‌మైన నేత్రాల‌తో వ‌ర్ధ‌మాన నాయిక‌ల్లో ఒక‌రిగా మెలుగుతున్న రిచా ప‌న‌య్ తాజాగా `ర‌క్ష‌క‌భ‌టుడు`లో న‌టించింది. ఆ సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి రిచా ప‌న‌య్ గురువారం విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* `ర‌క్ష‌క‌భ‌టుడు`లో మీ పాత్ర గురించి చెప్పండి?
- ర‌క్ష‌క‌భ‌టుడులో నా పాత్ర పేరు మైథిలి. చాలా ఇన్నొసెంట్ గ‌ర్ల్. ప‌క్కా తెలుగు అమ్మాయి. అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయ్యే అమ్మాయి. వైజాగ్ నుంచి అర‌కు వ్యాలీ వ‌ర‌కు వెళ్లే దారిలో ఆ అమ్మాయికి ఓ స‌మ‌స్య వ‌స్తుంది. అదేమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రం. మిగిలిందంతా స‌స్పెన్స్. ఈ సినిమాలో ఆ అమ్మాయికి చాలా డిఫ‌రెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఇందులో రొమాన్స్ చేస్తాను. కామెడీ కూడా చేస్తాను. ఆ పాత్ర‌కు చాలా షేడ్స్ ఉన్నాయి.

* మీరు పోలీస్ స్టేష‌న్‌కు ఎందుకు వెళ్తారు?
- ఈ స్టోరీ మొత్తం అర‌కు వ్యాలీ, పోలీస్ స్టేష‌న్‌లో ఉంటుంది. నేను పోలీస్ స్టేష‌న్‌కు ఎందుకు వెళ్తాన‌న్న‌ది స‌స్పెన్స్.

interview gallery

* ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్ర‌మా?
- ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కాదు. ఇది కంటెంట్ ఓరియంటెడ్ చిత్రం. నాది సెంట్ర‌ల్ పాత్ర‌. నా రోల్ ఉమెన్ ఓరియంటెడ్ అంత స్ట్రాంగ్ కాదు. రుద్ర‌మ‌దేవి, రాణీ లక్ష్మీభాయ్‌లాంటిది కాదు. కాక‌పోతే వేరియేష‌న్ ఇన్ ఎక్స్ ప్రెష‌న్స్ అనేది ఉంటుంది.

* ఈ క‌థ‌లో మీకు ఏం నచ్చింది?
- ఈ సినిమాలో నేను తొలి సారి తెలుగు అమ్మాయిగా చేస్తున్నాను. వైజాగ్ అమ్మాయిగా చేశా. మా ద‌ర్శ‌కుడుగారు ఏం చెబితే అదే చేశాను.

* మేక‌ప్ చాలా త‌క్కువ‌గా వేసుకున్నార‌ట‌?
- మా ద‌ర్శ‌కుడు న‌న్ను మేక‌ప్ వేసుకోనివ్వ‌లేదు. అస‌లు మేక‌ప్ వ‌ద్ద‌నే వ‌ద్ద‌న్నారు. ఆయ‌న నాకు క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు నేను ఫీవ‌ర్‌తో ఉన్నా. అప్పుడు మేక‌ప్ వేసుకోలేదు. `మేక‌ప్ లేకుండా చాలా బావున్నావు.. మేక‌ప్ ఎందుకు వేసుకుంటావు` అని అడిగారు. కానీ నేను ఆయ‌న్ని క‌న్విన్స్ చేశా.. కొంచెం కొంచెం మేక‌ప్ వేసుకుంటాన‌ని అడిగా. స‌రేన‌న్నారు. మ‌రోవైపు ఈ క‌థ విన్నంత సేపు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇంత‌కు ముందు ఎప్పుడూ నేను సెట్లో షాకింగ్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ్వ‌లేదు. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు క్యూట్ వేలో షాకింగ్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చేదాన్ని. కానీ ద‌ర్శ‌కుడు 100 రెట్లు, వెయ్యి రెట్లు షాకింగ్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ్వ‌మ‌ని అడిగేవారు. అలాగే ఇచ్చేదాన్ని.

* ఈ టీమ్ గురించి చెప్పండి?
- ఈ టీమ్‌తో ప‌నిచేయ‌డం చాలా మంచి ఎక్స్ పీరియ‌న్స్. మేం షూటింగ్‌ ఒకే లొకేష‌న్‌లో చేశాం. అందువ‌ల్ల నేను ఆ లొకేష‌న్‌ను ఇల్లులాగానే అనుకున్నా. మా యూనిట్ అంతా వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్‌లాగా ట్రీట్ చేశారు. మా ద‌ర్శ‌కుడు చాలా హంబుల్ హ్యూమ‌న్ బీయింగ్‌. మా అమ్మ‌నాతో ఎప్పుడూ `త‌క్కువ మాట్లాడేవారు ఇంట‌లిజెంట్‌పీపుల్` అని చెప్పేది. మా ద‌ర్శ‌కుడు చాలా త‌క్కువ‌గా మాట్లాడుతారు. ఆయ‌న ఇంట‌లిజెంట్‌.ఆయ‌న‌కి స్క్రిప్ట్ లో టూ మ‌చ్ క్లారిటీ ఉండేది. ఆయ‌న ఈ స్క్రిప్ట్ మీద‌ చాన్నాళ్లుగా ప‌ని చేశారు. అందువ‌ల్ల నా ప‌ని కూడా ఈజీ అయింది. మా నిర్మాత చాలా జాలీగా ఉండేవారు. చూడ్డానికి బాహుబ‌లిలాగా ఉంటారు. కానీ చాలా హంబుల్‌గా ఉంటారు. ప్ర‌తిరోజూ టిఫ‌న్‌లో 3,4 ఐట‌మ్స్ పెట్టేవారు. మా కెమెరామేన్ జోషిగారు చాలా స‌ర‌దాగా ఉండేవారు. న‌న్ను చాలా క‌రెక్ట్ యాంగిల్స్ లో చూపించారు. దానికి ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు చెప్పాలి.

* సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మా సినిమాలో ఎంత‌మంది ఫెమిలియ‌ర్ ఫేసెస్ ఉంటే అంత త్వ‌ర‌గా సినిమా జ‌నాల్లోకి వెళ్తుంది. మేమంతా సెట్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. సీనియర్స్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.

ఇందులో నా పెయిర్ నందు. ఆంజ‌నేయ‌స్వామిగా చేసింది వేరే వ్య‌క్తి. ఆ వ్య‌క్తి ఎవ‌రో సినిమా చూస్తేనే తెలుస్తుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved