pizza
RP Patnaik interview about Manalo Okadu
మీడియా ఈగో పై ఓ సాధార‌ణ వ్య‌క్తి చేసే పోరాట‌మే `మ‌న‌లో ఒక‌డు` - ఆర్‌.పి.ప‌ట్నాయక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2016
Hyderaba
d

ఆర్పీ పట్నాయక్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మనలో ఒకడు'. నువ్వు నేను ఫేమ్‌ అనిత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్‌ మూవీ పతాకంపై జి.సి.జగన్‌ మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ సినిమా గురించి విశేషాల‌ను తెలియ‌జేశారు...

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా...
- మీడియా అనే ఈగో సోసైటీని చాలా చాలా డామినేట్ చేస్తుంద‌ని నా ఫీలింగ్. చాలా వ‌ర‌కు రియ‌ల్ ఇన్‌సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకున్నాం. అందుకోసం కావాల్సిన అవుట్‌పుట్స్‌ను మీడియా మిత్రులే ఇచ్చారు. సినిమాలో చూపించేదేది ప‌ర్స‌న‌ల్ కాదు.., జ‌న‌ర‌లైజ్‌గా జ‌రుగుతున్న‌దే చూపించాం. అందుకు ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే మొన్న క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్ చ‌నిపోయిన‌ట్లు ఓ చానెల్‌లో వార్త వ‌చ్చింది. కానీ వేణుమాధ‌వ్ బ్ర‌తికేఉన్నానంటూ మీడియా ముందుకు వ‌చ్చారు. అంతే కాకుండా త‌న వార్త‌ను నిజం చేసుకోవ‌డానికి మీడియానే త‌న‌నెక్క‌డో చంపేస్తుందోనని భ‌య‌ప‌డి గ‌వ‌ర్న‌ర్‌ను ర‌క్ష‌ణ కోరడానికి వ‌చ్చాన‌ని చెప్పారు. అలాగే ఎం.ఎస్‌.నారాయ‌ణ‌గారు చ‌నిపోవ‌డానికి ముందు రోజే ఆయ‌న చనిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అర‌గంట త‌ర్వాత అన్నీ చానెల్స్‌లో ఆ వార్త‌ను తొల‌గించారు. కానీ ఒక‌రిద్ద‌రు రిపోర్టర్స్ మాత్రం వారి కుటుంబ స‌భ్యులు క‌న‌ప‌డితే ఏం జ‌రిగిందంటూ ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. అంటే ఇక్క‌డ త‌మ వార్త నిజం కావాల‌నుకుని తాప‌త్ర‌య ప‌డ్డారే త‌ప్ప ఇంకేం లేదు. వార్త సేక‌రించ‌డం త‌ప్పు కాదు..ఏదీ నిజమో దాన్నే చెప్పమ‌నే ఈ సినిమాలో చూపిస్తున్నాం.

క్యారెక్ట‌ర్ గురించి....
- కృష్ణ‌మూర్తి అనే కామ‌న్ మేన్ క్యారెక్ట‌ర్ చేశాను. ఓ సాధార‌ణ వ్య‌క్తికి మీడియా వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చింది. దాన్ని వ‌ల్ల అత‌నెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నాడు. దానికి అత‌నెలా ఎదురుతిరిగాడు..అనేవి ఈ సినిమాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాను. `మ‌న‌లో ఒక‌డు` అంటే మ‌నం ప్ర‌తిరోజు మ‌న జీవితంలో కలిసే ఏవ‌రో ఒక వ్య‌క్తి. అందుకే మ‌నలో ఒక‌డు అనే టైటిల్‌ను పెట్టాం.

ఎవరినీ టార్గెట్ చేయ‌లేదు...
- ఇందులో ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా దాని వ‌ల్ల ఇబ్బందిగా ఫీలైతే దాని వ‌ల్ల క‌లిగే స‌మ‌స్య‌ల‌ను నేను ఎదుర్కొన‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్ర‌తి ఒక్క‌రూ, ప్ర‌తి ఫ్యామిలీ ఇది నా క‌థ అని ఫీలవుతారు. ఇది ఎంట‌ర్‌టైనింగ్ మూవీ కాదు..సీరియ‌స్‌గా చెబుతున్నాను.

- నువ్వు నేను ఫేమ్ అనిత ఈ సినిమాలో నా భార్య పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. చాలా మంచి రోల్‌లో త‌ను న‌టించింది.

RP Patnaik interview gallery

అందుకే నేనే న‌టించాను…
- హీరోయిజం ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. హీరోలు యాక్ట్ చేస్తే కథ కంటే హీరోయిజం ఎక్కడైనా కనపడుతుంది..అలా కనపడితే కథలోని ఫీల్ కనపడదనిపించింది. అందుకే మనలో ఒకడు రెగ్యులర్ హీరోలు చేసే సినిమా కాదు. కామ‌న్ మేన్ కనెక్ట్ అయ్యే క‌థ‌ కాబట్టే నేనే యాక్ట్ చేశాను. ఇప్ప‌టి వ‌ర‌కు నాకు స‌రిపోతుంద‌నుకునే క్యారెక్ట‌ర్స్‌లోనే యాక్ట్ చేస్తూ వ‌చ్చాను. అలా స‌రిపోద‌నుకున్న సినిమాల‌ను డైరెక్ట్ చేశానంతే.

మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది...
- రామోజీరావుగారికి కూడా మీడియా ఈగోపై క‌థ న‌డుస్తుంద‌ని చెప్పాను. వార్త‌ను హైలెట్ చేయ‌డానికి నిజాన్ని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో చాలా మంచి క‌థ‌ను ఎన్నుకున్నార‌ని రామోజీరావుగారు అప్రిసియేట్ చేశారు. అలాగే సినిమాను కొంత మంది మిత్రుల‌కు కూడా చూపించాను. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ లేచి నిల‌బ‌డి అప్రిసియేట్ చేశారు. ఒకాయ‌నైతే ఇన్ని రోజులు మంచి సినిమాలే చేశావురా..ఈరోజు గొప్ప సినిమా చేశావు అని అన‌డం మ‌ర‌చిపోలేను.

త‌దుప‌రి చిత్రాలు
- నెక్ట్స్ సినిమాస్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved