pizza
Sagar Birthday interview
సిద్ధార్థ్ యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ల‌వ్‌స్టోరీ - సాగ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 August 2015
Hyderabad

మొగళిరేకులు టీవీ సీరియల్‌లో ఆర్‌.కె.నాయుడుగా పాపులారిటీ సంపాదించుకున్న సాగర్‌ హీరోగా 'సిద్ధార్థ్‌' అనే సినిమా రూపొందుతోంది. రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 16న ఈ సిినిమా హీరో సాగర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో సాగర్‌తో ఇంటర్వ్యూ......

నేపథ్యం...
- నేను హైదరాబాద్‌లో ఎమ్మెసీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. సీరియల్స్‌లోకి వచ్చినప్పుడు ఆరేళ్ళ పాటు ఇబ్బందులు పడ్డాను. వెనక్కు వెళదామనుకుంటున్న తరుణంలో నాకు చక్రవాకం సీరియల్‌లో మంజులనాయుడుగారు అవకాశం ఇచ్చారు. అక్కడ చాలా విషయాలను నేర్చుకున్నాను. సీరియల్స్‌లో నటించి ఓ కాన్ఫిడెంట్‌ వచ్చినప్పుడు సినిమాల్లోకి ఎంటర్‌ అవుతామనిపించి రెడీ అయ్యాను.

సినిమా గురించి...
- సిద్ధార్థ్‌ సినిమా చేస్తున్నప్పుడే పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాను. నిర్మాత కిరణ్‌కుమార్‌గారు కూడా మంచి నిర్మాత, అలాగే మంచి ఆడియెన్‌ కూడా. అందుకే 40-50 కథలను విన్నాం. చివరకు సిద్ధార్థ్‌ సినిమాను ఓకే చేసుకున్నాం. మంచి కాంబినేషన్‌ కుదిరింది. ఇది యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ.

Sagar interview gallery

క్యారెక్టర్‌ గురించి...
- ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉండే అబ్బాయి కథ. అందుకని అనంతపురం బ్యాక్‌డ్రాప్‌ తీసుకున్నాం. అలాగే కథానుగుణంగా మలేషియాలో 25 రోజుల పాటు చిత్రీకరించాం. షూటింగ్‌ అంతా పూర్తయ్యింది. ఈ ఆగస్ట్‌ 22న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే నెలాఖరున ఆడియో ప్లాన్‌ చేస్తున్నాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.

తేడా కనపడలేదు...
- నటన పరంగా చూస్తే టీవీల్లో నటించడానికి, సినిమాల్లో నటించడానికి నాకు పెద్ద తేడా కనపడలేదు. అదృష్టమేమంటే నేను చేసిన సీరియల్‌లో ల్యాగ్‌ కూడా తక్కువగా ఉండటం నాకు కలిసొచ్చిందనాలి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చూస్తే అంతా ఒక్కటే. టెక్నికల్‌గా సినిమా హెవీగా ఉంటుంది.

మంచి టీం....
- సిద్ధార్థ్‌ సినిమా విషయానికి వస్తే సమరసింహారెడ్డి, ఇంద్ర వంటి సినిమాలు చేసిన సీనియర్‌ రైటర్స్‌ పరుచూరి బ్రదర్స్‌, బ్రహ్మకడలి. ప్రవీణ్‌పూడి వంటి సీనియర్‌ టెక్నిషియన్స్‌ పనిచేశారు. ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ప్లాన్‌ చేసుకుని షూటింగ్‌కు వెళ్లాం. ప్రతి షెడ్యూల్‌ను ముందుగానే చెక్‌ చేసుకున్నాం. గోపాల్‌రెడ్డిగారు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. విసుగారు కథను అందిస్తే, పవన్‌కల్యాణగారి దగ్గర జానీ చిత్రం నుండి ఇప్పటి వరకు వర్క్‌ చేస్తూ వచ్చిన దయానందరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

అందుకే ఆసక్తి చూపలేదు....
- మొగళి రేకుల్లో ఆర్‌.కె.నాయుడు, మున్నా క్యారెక్టర్స్‌తో మంచి ఇమేజ్‌ వచ్చింది. దాన్ని పొల్యూట్‌ చేయడం ఇష్టం లేక ఆసక్తి చూపలేదు ఒక కారణం అయితే నేను అంత హైపర్‌ పర్సన్‌ కాను. పెద్దగా డ్యాన్సులు చేయలేను. ఎక్కువగా మాట్లాడలేను. అప్పటికీ చాలా మంది నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు కానీ నేను వెళ్లలేదు.

దాసరి కిరణ్‌కుమార్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌.....
- ఈ సినిమాలో నేను యాక్ట్‌ చేయడానికి ఆయనే కారణం. నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు. సీరియల్స్‌లో ఇంత మంచి ఇమేజ్‌ ఉంది కదా..సినిమాల్లోకి ఎందుకు రాకూడదని అనేవారు. మంచి కథను రూపొందించి సినిమా చేద్దామని ప్రోత్సాహించేవారు. ఈ కథ ఓకే కాగానే మేం ప్రొసీడ్‌ అయ్యాం మేకింగ్‌ పరంగా కూడా ఆయన అన్‌కాంప్రమైజ్డ్‌ ప్రొడ్యూసర్‌. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గరు.

నెక్ట్స్‌ ప్లానింగ్‌....
- సీరియల్స్‌, సినిమాలు రెండింటినీ సమాంతరంగా చూస్తాను. సీరియల్‌ ప్రొడక్షన్‌ ప్లానింగ్‌లో ఉంది. మంచి క్యారెక్టర్స్‌ వస్తే వేరే సినిమాల్లో నటించడానికి కూడా నేను సిద్ధమే.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved