pizza
Sai Dharam Tej interview (Telugu) about Inttelligent
కాంబినేష‌న్ కంటే క‌థే ముఖ్యం - సాయిధరమ్‌ తేజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

8 February 2018
Hyderabad

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరవమ్‌ తేజ్‌తో ఇంటర్వ్యూ...

క్యారెక్టర్‌ గురించి..
- 'ఇంటిలిజెంట్‌' సినిమాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ యువకుడి పాత్రలో నటించాను. చిన్నప్పట్నుంచి తన కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటకు రాని యువకుడు, కొన్ని పరిస్థితులు కారణంగా ఆ కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటకు రావాల్సి వస్తుంది. అలా వచ్చిన యువకుడు ఎంత ఇంటిటిజెంట్‌గా ప్రవర్తించాడనేదే సినిమా. కథను కూడా అలాగే రాసుకుంటూ వెళ్లారు. మనకి ఎవరైనా సపోర్ట్‌ చేస్తే వారిని మనం మరచిపోకూడదు. వారికి ఏదైనా కష్టం వస్తే వారికి మనం సపోర్ట్‌గా నిలబడాలనే అండర్‌లైన్‌ మెసేజ్‌ ఉంటుంది. దీన్ని బట్టి కథ రన్‌ అవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ను అనుసరించే టైటిల్‌ను నిర్ణయించారు.

పూర్తి స్థాయి కమర్షియల్‌ మూవీ...
- కొత్త క్యారెక్టర్‌ చేశానని చెప్పను కానీ ఇది నేను నటించిన పూర్తిస్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. నాకైతే చేస్తున్నప్పుడు కొత్తగా అనిపించింది. సినిమా చూసే ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ప్రతి సినిమాను సక్సెస్‌ కావాలనే ఉద్దేశంతోనే చేస్తాం. అందులో మన వంతు ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. ఇక జయాపజయాలు మన చేతిలో ఉండవు కదా.. ప్రేక్షకుల చేతిలో ఉంటుంది.

వినాయక్‌తో పనిచేయడం గురించి...
- వినాయక్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అంత పెద్ద డైరెక్టర్‌, చిరంజీవిగారి కమ్‌బ్యాక్‌ మూవీ చేసిన ఆయన సినిమాలో నాకు అవకాశం ఇవ్వడం ఆనంద పడే విషయం. ఎందుకంటే నేను నాలుగు ప్లాపులు తర్వాత చేసిన సినిమా ఇది. ఆయన సెట్‌లో అందరినీ కంఫర్ట్‌ జోనర్‌లో ఉంచుతారు. వర్కింగ్‌ ఎట్మాస్పియర్‌ను ప్లెజర్‌గా ఉంచుతారు.

ఎవరికైనా కథే ముఖ్యం...
- వినాయక్‌గారి దర్శకత్వంలో సినిమా అనగానే ఒప్పుకున్నాను. అలాగని కథను వదులుకోలేదు. నేనైనా, వినాయక్‌గారైనా మంచి కథ ఉండాలనే చూస్తారు. ఆకుల శివగారు చాలా మంచి కథను అందించారు. కథ లేకుండా కాంబినేషన్‌పై సినిమా చూడాలంటే కష్టం. శివగారు అందించిన కథను వినాయక్‌గారు రాసిన స్క్రీన్‌ప్లే, టేకింగ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. నేను విభిన్నమైన కథల కోసం వెయిట్‌ చేస్తున్నాను. అయితే ఎక్కువగా కమర్షియల్‌ ఫార్మేట్‌ సినిమాలే వస్తున్నాయి. అందులో నచ్చిన కథలతోనే ముందుకు వెళుతున్నాను. ఓ పంథాలో వెళ్లాలని ముందు నుండి అనుకోవడం లేదు. నాకు నచ్చిన.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళుతున్నాను.

మిగతా విషయాలను పట్టించుకోను...
- కథ.. నా క్యారెక్టర్‌ అనే విషయాలను బాగా పట్టించుకుంటాను. అంతే కానీ హీరోయిన్‌, ఇతర ఆర్టిస్టులు సహా సినిమాలో ఇన్‌వాల్వ్‌ కాను. డైరెక్టర్స్‌ అన్నాక కొత్త కాంబినేషన్స్‌, హిట్‌ కాంబినేషన్స్‌లో సినిమాలు చేయాలని కోరుకుంటారు. దర్శక నిర్మాతలను అనుసరించే వెళతాను.

interview gallery



రిలీజ్‌ డేట్‌..నిర్మాతల చాయిస్‌...
- 'ఇంటిలిజెంట్‌', 'తొలిప్రేమ' సినిమాల రిలీజ్‌ డేట్స్‌ విషయం అనేది నిర్మాతల వ్యవహారం. నేను వారి పరిధుల్లోకి వెళ్లి వారిని పుష్‌ చేయలేను. అలాగే మా సినిమా నిర్మాత కూడా ముందుగానే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసేశారు. వేరే చాయిస్‌ లేకపోవడంతో అనౌన్స్‌ చేసిన రోజునే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. నేను, వరుణ్‌ చేయాల్సిన సపోర్ట్‌ చేశాం. మా మధ్య ఏ పోటీలు లేవు. అయితే ఒకే రోజు ఇద్దరి సినిమాలు విడుదలై హిట్‌ కొడితే.. ఆ కిక్‌ వేరేలా ఉంటుందని నాకు అనిపించింది. అయితే తొలిప్రేమ అనౌన్స్‌ చేసిన రోజు కంటే ఓ రోజు ఆలస్యంగా వస్తున్నారు. సినిమాలు బావుంటే కచ్చితంగా ఆదరణ పొందుతాయి. అందులో సందేహం లేదు.

- టీజర్‌ను నందమూరి బాలకృష్ణగారు విడుదల చేశారు. అలాగే తొలిపాటను ప్రభాస్‌ అన్న.. రిలీజ్‌ చేశారు. సినిమా విడుదల సందర్భంగా వారికి నా స్పెషల్‌ థాంక్స్‌. వాళ్లు అంత పెద్ద స్టార్స్‌ అయినా మాకు సపోర్ట్‌ అందించారు. ముఖ్యంగా బాలకృష్ణగారు మా మెగాఫ్యాన్స్‌కు రెస్పెక్ట్‌ ఇచ్చారు. అది చూసి హ్యాపీగా ఫీలయ్యాను. అంత పెద్ద వ్యక్తి అలా చెప్పడం చూసి.. ఇలా అందరినీ కలుపుకుపోయేలా ఉండాలనిపించింది. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీకి 'బాహుబలి' వంటి హిట్‌ ఇచ్చిన ప్రభాస్‌ అన్న.. సాంగ్‌ రిలీజ్‌ చేశారు. చాలా బాగా మాట్లాడి మా యూనిట్‌ను ఎంకరేజ్‌ చేశారు.

నిర్మాత సి.కల్యాణ్‌ గురించి...
- నిర్మాత కల్యాణ్‌గారు మేకింగ్‌ కాంప్రమైజ్‌ కాలేదు. కానీ అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం. ఇక తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అందుకు తగినట్లుగానే నా బెస్ట్‌ డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వడానికి ప్రయత్నించాను.

- మా మామయ్య(చిరంజీవి) సాంగ్స్‌ అన్నింటిని నేనే రీమిక్స్‌ చేయడం లేదు. నేనెప్పుడూ ఆయన సాంగ్స్‌ను రీమిక్స్‌ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అది ఆయా సినిమాల దర్శకుల నిర్ణయం. అయితే అలాంటి రీమిక్స్‌ చేయాల్సి వచ్చినప్పుడు నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యతగా ఫీలై రీమిక్స్‌ సాంగ్స్‌ చేశాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved